For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.6,499కే జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్: నాలుగు విధాల EMIలు చెల్లించండి ఇలా

|

జియో ఫోన్ నెక్స్ట్ ధర విడుదలైంది. ఈ ఫోన్ ధరను రూ.6,499గా నిర్ణయించినట్లు జియో, గూగుల్ ప్రకటించాయి. దీపావళి నుండి ఈ 4G స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. జియో ఫోన్ నెక్స్ట్ కొనుగోలుకు ఫైనాన్స్ సదుపాయాన్ని కూడా జియో ఇస్తోంది. మొదట రూ.1999 చెల్లించి, మిగతా మొత్తాన్ని నెలవారీ ఈఎంఐ రూపంలో 18 నెలల నుండి 24 నెలల మధ్య చెల్లించవచ్చు. లాంచింగ్ సమయంలోనే స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు ఫైనాన్స్ సదుపాయం అందించడం ఇదే మొదటిసారి అని తెలిపింది. క్వాల్‌కామ్ చిప్‌సెట్‌తో రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్ దేశవ్యాప్తంగా ఉన్న జియో మార్ట్ డిజిటల్ రిటైల్ స్టోర్స్‌లలో లభిస్తుంది.

పండగ సీజన్‌లో తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ను భారత కస్టమర్లకు గూగుల్, జియో అందించడం సంతోషకరమని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ఇంటర్నెట్ ప్రయోజనాలను ప్రతి ఒక్కరు పొందేలా, అందుబాటు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ కోసం రూపొందించినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.

ఈఎంఐలలో చెల్లింపు

ఈఎంఐలలో చెల్లింపు

క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 215 చిప్‌సెట్‌తో తయారైన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత ఓఎస్ ద్వారా పనిచేస్తుంది. రీడ్ అలౌడ్, ట్రాన్స్‌లేట్ వంటి ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్ ఉన్నాయి. అన్ని గూగుల్ యాప్స్‌ను సపోర్ట్‌ చేస్తుంది. జియోమార్ట్ డిజిటల్ రిటైల్ స్టోర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. ఫీచర్ ఫోన్ యూజర్లు, 2G కస్టమర్ల అప్‌గ్రేడ్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌పై EMI సదుపాయం కల్పించింది. తొలుత రూ.1,999 చెల్లించి మిగతా మిగతా మొత్తాన్ని అంటే రూ.4,500 వాయిదాలలో చెల్లించవచ్చు. 18 నెలల నుండి 24 నెలల సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. నెలకు రూ.300 నుండి రూ.600 వరకు ఈఎంఐ చెల్లింపుతో డేటా, టాక్ టైమ్ ఆఫర్లను కూడా కంపెనీ ఇస్తుంది. ఇందుకు ప్రాసెసింగ్ ఛార్జీ రూ.501 వసూలు చేస్తుంది.

తెలుగు సహా

తెలుగు సహా

తెలుగు సహా 10 భారతీయ భాషల్లో కంటెంట్‌ను వినియోగించుకోవచ్చు. తెరపై ఇతర భాషల్లోని సమాచారాన్ని తమ భాషలోకి మార్చి వినియోగించే సౌకర్యం కూడా ఉండటం గమనార్హం. రాత్రిపూట స్పష్టమైన ఫోటోలు తీసే కెమెరాలు అమర్చారు. మన భాషలోనే నోటితో సూచనలు ఇవ్వడం ద్వారా యాప్స్ ఓపెన్ చేయవచ్చు. సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు.

4 డిఫరెంట్ ఈఎంఐలు

4 డిఫరెంట్ ఈఎంఐలు

జియోఫోన్ నెక్స్ట్‌కు సంబంధించి నాలుగు డిఫరెంట్ ఈఎంఐలు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు కాలపరిమితిని బట్టి రూ.300 (24 నెలలు) లేదా రూ.350 (18 నెలలు) చెల్లించి 5జీబీ డేటా ప్లస్ 100 టాక్ టైమ్ పొందవచ్చు.

జియోఫోన్ నెక్స్ట్ లార్జ్ ప్లాన్‌లో రూ.500 చెల్లించి 18 నెలల ఈఎంఐ లేదా రూ.450 చెల్లించి 24 నెలల పాటు ఈఎంఐ చెల్లించవచ్చు. వినియోగదారులు 1.5 జీబీ 4జీ డేటాను పొందవచ్చు. వాయిస్ కాల్స్ అన్‌లిమిటెడ్.

జియో ఫోన్ నెక్స్ట్ థర్డ్ ఈఎంఐ ప్లాన్ XL. కస్టమర్లు 18న నెలల కోసం రూ.550, 24 నెలల కోసం రూ.500 చెల్లించవచ్చు. ఈ ప్లాన్ కింద 2జీబీ హైస్పీడ్ 4జీ డేటా, అన్-లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు.

నాలుగో ప్లాన్ XXL. 18 నెలల కోసం అయితే రూ.600 ఈఎంఐ, 24 నెలల కోసం అయితే రూ.550 ఈఎంఐ చెల్లించవచ్చు. ప్రతిరోజు 2.5 జీబీ 4జీబీ డేటా, అన్-లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉన్నాయి.

English summary

రూ.6,499కే జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్: నాలుగు విధాల EMIలు చెల్లించండి ఇలా | JioPhone Next price revealed, upfront price is Rs 6,499

Jio and Google announced today that the much-anticipated JioPhone Next, the made for India smartphone jointly designed by the two companies, will be available in stores from Diwali, adding to the festival cheer in the country.
Story first published: Saturday, October 30, 2021, 9:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X