For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Loan Resposibility: తండ్రి తీసుకున్న అప్పు కొడుకు తీర్చాలా? చట్టం ఏమని చెబుతోంది.. ఇప్పుడు తెలుసుకోండి..

|

Loan Resposibility: తండ్రి తీసుకున్న అప్పుకు కొడుకు బాధ్యుడని సమాజంలో సాధారణంగా చెప్పుకుంటున్నా.. అసలు ఈ విషయంలో చట్టం ఏమంటుందో తెలుసుకోవటం తప్పని సరి. మనలో చాలా మందికి ఈ అనుమానం ఏదో ఒక సమయంలో వచ్చే ఉంటుంది. ఆస్తులకు వారసుడైన వారు అప్పులకు కారా అని సందేహం చాలా మందికి సహజంగా వచ్చే డౌట్. అనైతిక ప్రయోజనం కోసం అప్పు చేయకపోయినా, హిందూ కొడుకు తన తండ్రి రుణాన్ని చెల్లించడానికి వ్యక్తిగతంగా బాధ్యత వహించడని చట్టం చెబుతోంది.

 బ్యాంకు అప్పుల విషయంలో..

బ్యాంకు అప్పుల విషయంలో..

హిందూ వారసత్వ చట్టం- 2005లో ఒక సవరణ ఉంది. ఆ సవరణలో తండ్రి ఆస్తులకు కొడుకుకు ఎంత మేరకు వారసత్వ హక్కు ఉంటుందో.. ఆ ఆస్తులపై అప్పు ఉంటేనే కొడుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా తండ్రి బ్యాంకులో అప్పు తీసుకుని చనిపోతే కొడుకు బ్యాంకు రుణం చెల్లించాల్సిన అవసరం లేదు. వారసుడైనప్పటికీ కొడుకును అప్పు చెల్లించమని అడిగే హక్కు బ్యాంకుకు లేదు.

నాన్న అప్పు..

నాన్న అప్పు..

తండ్రి బ్యాంకు రుణం తీసుకున్నప్పుడు, గ్యారెంటర్ గా సంతకం చేసిన వ్యక్తిపై ఆ రుణాన్ని తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. లేదా తండ్రి ఏదైనా ఆస్తిపై తనఖా పెట్టినట్లయితే, ఆ ఆస్తులను విక్రయించి రుణం కింద తీసుకునే హక్కు బ్యాంకుకు ఉండదు. కానీ.. బ్యాంకులు వారసుల నుంచి రుణాలు అడగకూడదని చట్టం చెబుతోంది.

 కొడుకు బాధ్యుడా?

కొడుకు బాధ్యుడా?

తండ్రి బ్యాంకులోనే కాకుండా ప్రైవేట్ వ్యక్తుల వద్ద కూడా రుణం తీసుకున్నప్పటికీ.. వాటిని కొడుకు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొడుకు హామీదారుగా సంతకం చేసినట్లయితే.. ఆ సందర్భంలో తండ్రి రుణానికి కొడుకు మాత్రమే బాధ్యత వహిస్తాడు. ష్యూరిటీ సంతకం చేయకపోతే.. కొడుకును అడిగే హక్కు రుణదాతకు లేదని చట్టం స్పష్టంగా చెబుతోంది.

తండ్రి ఆస్తిపై హక్కు..

తండ్రి ఆస్తిపై హక్కు..

కానీ అదే సమయంలో.. తండ్రి ఆస్తిలో కొడుకుకు హక్కు ఉన్నంత వరకు అప్పు ఉంటే, రుణదాతలకు దావా వేసి ఆస్తిని వసూలు చేసే హక్కు ఉంటుంది. ఉదాహరణకు.. కొడుకు తండ్రి నుంచి రూ.20 లక్షల ఆస్తిని పొంది, ఆ ఆస్తిపై రూ.10 లక్షల అప్పు ఉంటే, ఆ ఆస్తిపై ఉన్న అప్పుకు కొడుకు బాధ్యత వహిస్తాడు. కానీ అదే సమయంలో ఆస్తి విభజన తర్వాత తండ్రి రుణం తీసుకున్నట్లయితే.. ఆ రుణానికి కొడుకు బాధ్యత వహించడు.

ఆస్తి లేకుండా అప్పులు మాత్రమే ఉంటే..

ఆస్తి లేకుండా అప్పులు మాత్రమే ఉంటే..

ఒకవేళ తండ్రి ఎలాంటి ఆస్తులను కూడబెట్టకుండా అప్పు తీసుకున్నట్లయితే.. ఆ ఆస్తికి కొడుకు బాధ్యత వహించాల్సిన అవసరం అస్సలు లేదు. తండ్రి ఆస్తులు లేకుండా రుణం తీసుకుంటే కొడుకు తాను సంపాదించిన ఆస్తుల నుంచి అప్పు చెల్లించాల్సిన అవసరం లేదని చట్టమే చెబుతోంది.

 LIC లోన్..

LIC లోన్..

ఇటీవల భోపాల్‌కు చెందిన వనీషా అనే బాలిక కరోనా వ్యాధితో తన తండ్రిని కోల్పోయింది. తన తండ్రి తీసుకున్న ఎల్‌ఐసీ హోమ్ లోన్ తిరిగి చెల్లించాలని ఆమెకు నిరంతరం నోటీసులు అందాయని ఆమె తెలపటం గమనార్హం.

English summary

Loan Resposibility: తండ్రి తీసుకున్న అప్పు కొడుకు తీర్చాలా? చట్టం ఏమని చెబుతోంది.. ఇప్పుడు తెలుసుకోండి.. | is son responsible for repayment of loans that are taken from banks and other financial institutions

how far a son responsible to pay loans that are taken by father what law saying know in detail
Story first published: Wednesday, July 6, 2022, 18:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X