For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలసీదారులకు డిజిటల్ పాలసీలు, భద్రపరుచుకోవడమూ నేర్పించాలి

|

న్యూఢిల్లీ: పాలసీదారులకు డిజిటల్ పాలసీలు జారీ చేయాలని బీమా సంస్థలను IRDAI ఆదేశించింది. డిజిటల్ పత్రాలను డిజిలాకర్‌లో ఎలా భద్రపరుచుకోవాలో సూచించాలని తెలిపింది. డిజిటల్ పాలసీల జారీతో ఖర్చులు తగ్గుతాయని, క్లెయిమ్స్ సెటిల్మెంట్ ప్రక్రియ వేగవంతం అవుతుందని పేర్కొంది. జీఐసీఆర్ఈ, లాయిడ్స్, విదేశీ రీ-ఇన్సురెన్స్ శాఖలతో పాటు అన్ని బీమా సంస్థలకు IRDAI ఆదేశాలు జారీ చేసింది. డిజిలాకర్‌తో ఖర్చులు తగ్గుతాయని, పాలసీలు డెలివరీ కాలేదని కస్టమర్ల నుండి ఫిర్యాదులు ఉండవని తెలిపింది. వివాదాలు, మోసాలు కూడా తగ్గుతాయని, కస్టమర్లను చేరుకోవడం ఈజీ అవుతుందని పేర్కొంది.

ATMను తాకకుండానే డబ్బులు ఉపసంహరణATMను తాకకుండానే డబ్బులు ఉపసంహరణ

ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త

ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త

బీమా రంగంలో డిజిలాకర్‌ను ప్రమోటింగ్ చేయడంలో భాగంగా అన్ని ఇన్సురెన్స్ కంపెనీలు ఐటీ సిస్టమ్‌లో డిజిలాకర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోన్న ఓ మోటార్ ఇన్సురెన్స్ సంస్థ లైసెన్స్ లేకుండానే పాలసీలు జారీ చేస్తోందని, ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పాలసీదారులను IRDAI హెచ్చరించింది.

అవగాహన

అవగాహన

రెగ్యులేటర్ IRDAI అనేక ఇన్సురెన్స్ అవేర్‌నెస్ అవగాహన కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. బీమాబేమిసాల్ అనేది IRDAI అవగాహన ప్రచార బ్రాండ్ నేమ్. ప్రమోటింగ్ ఇన్సురెన్స్, ప్రొటెక్టింగ్ ఇన్సూర్డ్ అనే ట్యాగ్‌లైన్‌ను కలిగి ఉంది. బీమాబేమిసాల్ పాలసీహోల్డర్లకు వారి హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పిస్తుంది. అందుబాటులోని ఫిర్యాదు పరిష్కార పద్ధతుల గురించి తెలియజేస్తుంది. వివిధ మార్గాల్లో ప్రచారం నిర్వహిస్తోంది.

బీమా రంగం డిజిటలైజేషన్

బీమా రంగం డిజిటలైజేషన్

డిజిలాకర్‌వో డ్రైవింగ్ లైసెన్స్, కారు రిజిస్ట్రేషన్, ఓటరు ఐడీ, పాన్ కార్డు, స్కూల్, కాలేజ్ స‌ర్టిఫికెట్స్, ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను డిజిటల్‌గా భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు. ఇక నుండి బీమా పాలసీలను డిజిలాకర్‌లో కూడా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచవచ్చు. బీమా రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలనే ఆలోచనతో, పాలసీదారులకు బీమా ప్ర‌క్రియ‌ సులభతరం చేయాలనే లక్ష్యంతో బీమా కంపెనీలు డిజిలాకర్ ద్వారా డిజిటల్ బీమా పాలసీలను జారీ చేయ‌నున్న‌ట్లు Irdai ఇటీవలే ప్రకటించింది.

అన్ని డాక్యుమెంట్స్ కాపీల్ని తమ మొబైల్ ఫోన్లలో భద్రపరచడానికి డిజిలాకర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. డిజిటల్ లాకర్ యాప్‌ను గూగుల్, ఆపిల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

English summary

పాలసీదారులకు డిజిటల్ పాలసీలు, భద్రపరుచుకోవడమూ నేర్పించాలి | IRDAI asks insurers to issue Digilocker to policyholders

Insurance sector regulator Irdai has asked insurers to issue digital policies to their policyholders and also tell them how to use these documents. The regulator has reasoned that the step will not only bring down the cost but also help speed up claim settlement process.
Story first published: Monday, February 15, 2021, 14:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X