For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ రైల్వేలో పెరగనున్న భోజనం, టిఫిన్ ధరలు, ఎంతంటే? షేర్ల దూకుడు

|

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) షేర్లు మంగళవారం దూసుకెళ్లాయి. ఈ షేర్లు దాదాపు 3 శాతం పెరిగి రూ.893కు చేరుకున్నాయి. అయితే దీనికి కారణం ఉంది. IRCTC ఆహార ధరలను సవరించింది. దీంతో షేర్లు దూసుకెళ్లాయి. సవరించిన ధరలు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్లలో ఈ ధరలు అందుబాటులోకి వస్తాయి. అంటే అక్కడి ధరలు ఇక నుంచి మారనున్నాయి.

బంగారంపై రుణం తీసుకుంటున్నారా? అయితే ఈ పొరపాటు చేయకండి!బంగారంపై రుణం తీసుకుంటున్నారా? అయితే ఈ పొరపాటు చేయకండి!

రైల్వే స్టేషన్లలో కొత్త ధరలు

రైల్వే స్టేషన్లలో కొత్త ధరలు

ఆహార ధరలను సవరిస్తున్నట్లు, రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్‌లకు ఈ ధరల మార్పు వర్తిస్తుందని IRCTC ఈ రోజు (డిసెంబర్ 24) స్టాక్ ఎక్స్చేంజీకి ఫైలింగ్‌లో తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఫుడ్ కేంద్రాల్లో ప్రామాణిక ఆహార ధరలను మార్చింది అని పేర్కొంది. జనాహార్, రిఫ్రెష్‌మెంట్ రూమ్స్ వంటి వాటికి ఇది వర్తిస్తుంది.

ఈ రైళ్లలో కూడా అదే ధర

ఈ రైళ్లలో కూడా అదే ధర

మెనూకు సంబంధించి ఇతర ప్రామాణిక భోజనం, జనతా మీల్స్, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇచ్చే ఫుడ్‌కు కూడా ఈ రేట్లు వర్తిస్తాయి. ఈ ధరల పెంపు ద్వారా IRCTC, జోనల్ రైల్వేల్లో అందించే ఫుడ్ క్వాలిటీ, క్లీనింగ్ పెరగాలని సూచించింది. దీనిని అంచనా వేసేందుకు తనిఖీలు చేయనుంది.

సవరించిన కొత్త ధరలు ఇవే...

సవరించిన కొత్త ధరలు ఇవే...

సవరించిన ధరల ప్రకారం ఆహార పదార్థాల కొత్త రేట్లు ఇవే...

- వెజ్ బ్రేక్ ఫాస్ట్ - రూ.35,

- నాన్ వెజ్ బ్రేక్ ఫాస్ట్ - రూ.45,

- స్టాండర్డ్ వెజ్ మీల్ - రూ.70,

- స్టాండర్డ్ మీల్ (ఎగ్ కర్రీ) - రూ.80,

- స్టాండర్డ్ మీల్ (చికెన్ కర్రీ) - రూ.120,

- వెజ్ బిర్యానీ (350 గ్రాములు) - రూ.70,

- ఎగ్ బిర్యానీ (350 గ్రాములు) - రూ.80,

- చికెన్ బిర్యానీ (350 గ్రాములు) - రూ.100,

- స్నాక్ మీల్ (350 గ్రాములు) - రూ.50

English summary

ఇండియన్ రైల్వేలో పెరగనున్న భోజనం, టిఫిన్ ధరలు, ఎంతంటే? షేర్ల దూకుడు | IRCTC shares climb as Railways revises prices of standard meals

Shares of state-owned Indian Railway Catering and Tourism Corporation (IRCTC) gained 4 per cent at Rs 899 on the BSE on Tuesday after the Ministry of Railways revised tariff of standard meals on static units in railway stations.
Story first published: Tuesday, December 24, 2019, 15:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X