For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IRCTC గుడ్‌న్యూస్, ఆన్‌లైన్‌లో బస్సు బుకింగ్ కూడా... ఇలా చేయండి

|

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ లిమిటెడ్ (IRCTC) ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్ బస్ బుకింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సేవలు ఇప్పటికే జనవరి 29న దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు IRCTC శుక్రవారం వెల్లడించింది ఇప్పటి వరకు రైల్వే టిక్కెట్ బుకింగ్, విమానం, ఈ-కేటరింగ్ సర్వీసులకు పరిమితం కాగా ఇప్పుడు బస్సు ప్రయాణీకులకు ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

22 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ ఆన్‌లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. బస్సు టిక్కెట్ బుకింగ్ కోసం http://bus.irctc.co.in. పేరుతో కొత్త ప్లాట్ ఫాంను అందుబాటులోకి తెచ్చింది. దాదాపు 50,000 ఆర్టీసీ బస్సులతో పాటు ప్రయివేటు బస్సు ఆపరేటర్లతోను ఒప్పందం కుదుర్చుకుంది.

 IRCTC launches its online bus booking services

టిక్కెట్ బుకింగ్ ఇలా..

- IRCTC అధికారిక వెబ్ సైట్ http://bus.irctc.co.in. లోకి వెళ్లాలి.
- IRCTC లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటే నేరుగా బస్సు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. లేదంటే కొత్త లాగిన్, పాస్‌వర్డ్ అవసరం. బస్సు టిక్కెట్ బుకింగ్ సమయంలో యూజర్ ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
- పైన సూచించిన వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. అందులోని depart fromలో మీరు ఎక్కడి నుండి బయలుదేరాలి అనుకుంటున్నారో వెల్లడించాలి.
- ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారనే ప్రాంతం పేరును going to లో పేర్కొనాలి.
- ప్రయాణించే తేదీ లేదా రోజు లేదా సమయం వంటి వాటిని పేర్కొనాలి.
- ఆ తర్వాత search bus పైన క్లిక్ చేయాలి.
- మీరు వెళ్లగోరే బస్సును, సీటు నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
- డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా ఈ-వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేయాలి.
- మీకు ఇష్టం వచ్చిన బస్సును, ముందే, సులభంగా బుక్ చేసుకోవచ్చు.
- ఒకేసారి గరిష్టంగా 6గురు ప్రయాణీకులకు టిక్కెట్లు బుక్ చేయవచ్చు.
- కస్టమర్లు తమ పికప్, డ్రాప్ పాయింట్స్, సమయం ఎంచుకోవచ్చు.
- 1800110139 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి బుకింగ్‌కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
- ఏసీ క్లాస్ టికెట్ పైన రూ.20+జీఎస్టీ, నాన్ ఏసీ క్లాస్ టికెట్ పైన రూ.10+జీఎస్టీ ఛార్జీ ఉంటుంది. పేమెంట్ సేవల సంస్థల ఛార్జీల భారం కస్టమర్లదే.
- ప్రతి ప్రయాణీకుడికి 10 కిలోల వరకు ఒక బ్యాగ్, ల్యాప్‌టాప్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ లేదా 5 కిలోల బ్రీఫ్ కేస్ వంటి వాటికి అనుమతి ఉంటుంది.

English summary

IRCTC గుడ్‌న్యూస్, ఆన్‌లైన్‌లో బస్సు బుకింగ్ కూడా... ఇలా చేయండి | IRCTC launches its online bus booking services

The Indian Railway Catering and Tourism Corporation Limited (IRCTC) has launched its online bus booking services that went live for the service of the nation on January 29, IRCTC informed on Friday.
Story first published: Saturday, February 6, 2021, 21:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X