For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC కస్టమర్లకు అలర్ట్: మే 10 నుండి వారానికి 5 రోజులే వర్కింగ్ డేస్

|

ఎల్ఐసీ వినియోగదారులకు అలర్ట్! ప్రభుత్వరంగ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసీ వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయనుంది. ఇక పైన శనివారం ఎల్ఐసీ కార్యాలయాలు పని చేయబోవని ఆ సంస్థ పబ్లిక్ నోటీసులో పేర్కొంది. మే 10వ తేదీ నుండి ఐదు రోజుల పని విధానం అమలులోకి రానుంది. ఎల్ఐసీ ఉద్యోగులకు సంబంధించి కొన్ని డిమాండ్ల పరిష్కారంలో భాగంగా ప్రతి శనివారం సెలవు ప్రకటించాలనే డిమాండ్‌కు ఏప్రిల్ 15వ తేదీన ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో మే 10వ తేదీ నుండి వర్కింగ్ డేస్ మారనున్నాయి. సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే ఎల్ఐసీ కార్యాలయాలు పని చేస్తాయి. ఆయా రోజుల్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేస్తాయని ఎల్ఐసీ తెలిపింది. పాలసీదారులు, ఇతర భాగస్వామ్యపక్షాలు దీనిని గమనించాలని సూచించింది.

Insurance giant LIC to have five working days starting from May 10

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్(LIC) ఉద్యోగులకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం బంపర్ బొనాంజా ప్రకటించింది. ఉద్యోగులకు 16 శాతం వేతన పెంపుకు ఆమోదం తెలిపింది యాజమాన్యం. ఉద్యోగులకు ఇది తీపి కబురే. 2017 ఆగస్ట్ నుండి ఈ పెంపు అమలులోకి వస్తుంది. సంస్థ పబ్లిక్ ఇష్యూ కంటే ముందు తమ వేతన సవరణ తేల్చాలని LIC ఉద్యోగులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేతనాలు 16 శాతం పెంచింది. అదే సమయంలో వారానికి ఐదు రోజుల పని విధానానికి కూడా మేనేజ్‌మెంట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు దానిని అమలు చేయనున్నారు.ో

English summary

LIC కస్టమర్లకు అలర్ట్: మే 10 నుండి వారానికి 5 రోజులే వర్కింగ్ డేస్ | Insurance giant LIC to have five working days starting from May 10

State-owned LIC will have five working days starting from May 10 since Saturdays have been declared as a holiday for the insurer.
Story first published: Thursday, May 6, 2021, 19:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X