For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాన్ కార్డు పోయినా.. తక్షణ ఈ-పాన్ ఇలా పొందండి

|

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్, బ్యాంకు ఖాతా ఓపెనింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం మొదలైన వాటికి KYC పూర్తి చేయడానికి పాన్ కార్డు తప్పనిసరి. అయితే పాన్ కార్డును పోగొట్టుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తక్షణమే పాన్ కార్డు అవసరం ఏర్పడితే.... ఈ-పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం ఆదాయ పన్ను శాఖ విభాగం కల్పిస్తోంది. ఆదాయ పన్ను వెబ్ సైట్‌లోకి లాగిన్ కావడం ద్వారా ఈ-పాన్ కార్డును పొందవచ్చు. పాన్ కార్డు నెంబర్ గుర్తుకు లేకపోతే ఆధార్ నెంబర్‌తో దీనిని పొందవచ్చు. ఇందుకు ఆధార్-పాన్ అనుసంధానం చేసుకొని ఉండాలి.

పాన్ నెంబర్ గుర్తుకు లేకుంటే ఆధార్-పాన్ అనుసంధానం ఇదివరకే పూర్తయితే ఆధార్ నెంబ‌ర్‌తో క్లెయిమ్ చేసుకోవ‌చ్చును. ఆధార్ పాన్ లింక్ లేకపోతే కొత్త ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ నుండి ఈ-పాన్‌ను డౌన్‌లోడ్ చేయలేరు.

కొత్త‌ ఆదాయపు పన్ను పోర్టల్ నుంచి తక్షణ ఇ-పాన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, మొదట పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.

Instant PAN card apply online with Aadhaar

- అధికారిక కొత్త ఆదాయ వెబ్‌సైట్లో లాగ్-ఇన్ కావాలి.
- ఎడమ దిగువ భాగంలోని Our Services పైన క్లిక్ చేయండి
- అక్క‌డ‌ Instant E-PAN క్లిక్ చేయాలి.
- New E PAN వద్ద క్లిక్ చేయండి
- మీరు కోల్పోయిన పాన్ కార్డు నెంబర్ మీకు గుర్తు లేకుంటే ఆధార్ కార్డు నెంబర్‌ను నమోదు చేయాలి.
- నిబంధనలు, షరతులను చదివిన అనంతరం Accept పైన క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ పైన OTP వస్తుంది.
- OTPని నమోదు చేయాలి.
- వివరాలను జాగ్రత్తగా చేక్ చేసుకొని, మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి, Confirm పైన క్లిక్ చేయాలి.
- ఈ-మెయిల్ ఐడీకి మీ ఈ-పాన్ వ‌స్తుంది. అక్క‌డ‌ ఈ-పాన్ PDFను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

English summary

పాన్ కార్డు పోయినా.. తక్షణ ఈ-పాన్ ఇలా పొందండి | Instant PAN card apply online with Aadhaar

The process of getting a PAN Card is also being made simpler and easy. Now there is no need to stand in queues for hours to get your PAN, you can get it made within 10 minutes.
Story first published: Wednesday, June 16, 2021, 18:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X