For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీపీఎఫ్ ఖాతా గడువు ముగిసిందా.. అయితే ఎలాంటి బెనిఫిట్స్‌ను కోల్పోతారు,అప్పుడు ఏం చేయాలి..?

|

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది చిన్న పొదుపు పథకాల్లో అతిముఖ్యమైన పథకంతో పాటు అత్యంత ప్రాచుర్యం పొందిన స్కీమ్. ఈ పథకం కచ్చితమైన రాబడిని అందిస్తుంది. ఎలాంటి రిస్క్‌ లేకుండా లేదా తక్కువ రిస్క్ కలిగి ఉంటే చాలనుకునే చాలామంది ఈ పథకం వైపు మొగ్గు చూపుతారు. ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు ఇష్టపడతారు. ఒకవేళ మీ పీపీఎఫ్ ఖాతా గడువు ముగిసిందనే విషయం మీ దృష్టికొస్తే అందుకు ఆందోళన చెందాల్సిన పనిలేదు. దీనికి సంబంధించిన ఓ దరఖాస్తును పూర్తి చేసి ఇస్తే చాలు, రెన్యువల్ జరిగిపోతుంది.

 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వివరాలు

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వివరాలు

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది ప్రభుత్వ పథకం. ఇందుకు ఎవరైనా అర్హులే. అయితే ఇది వ్యక్తిగతంగా మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీసు లేదా బ్యాంకుల్లో తెరవచ్చు. అయితే అంతకు ముందు దీని గురించి కాస్త అవగాహన కలిగి ఉండాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులపై లాభం, సులభతరమైన సేవల గురించి ఓ సారి వాకాబు చేసుకుంటే మంచిది.అయితే పీపీఎఫ్‌ ఖాతాదారుల్లో చాలామందికి ఓ సందేహం రావొచ్చు. ఈ ఖాతను మధ్యలో నిలిపివేయొచ్చా అనే సందేహం చాలామందిలో ఉంది. మీ ఖాతా ఎప్పుడు నిలిపివేయబడుతుందో తెలుసా..? దాన్ని తిరిగి పునరుద్దరించేందుకు ఏం చేయాలో తెలుసా..?

కనీస డిపాజిట్ లేకుంటే ఏం జరుగుతుంది..?

కనీస డిపాజిట్ లేకుంటే ఏం జరుగుతుంది..?

ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 అయినా మీ పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేయకుంటే ఖాతా నిలిపివేయడం జరుగుతుంది. ఇదే జరిగితే ఖాతాదారుడు డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కోల్పోతాడు. అంతేకాదు పీపీఎఫ్ పై రుణాలు కూడా తీసుకునే అవకాశం ఉండదు. అత్యవసర ఆర్థిక అవసరాలు ఉన్న సమయంలో లోన్ తీసుకోలేకపోవడం పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. అందుకే పీపీఎఫ్ ఖాతాలో కనీసం రూ.500 డిపాజిట్ చేసేలా జాగ్రత్తలు తీసుకోండి. ఇక నిలిపివేయబడ్డ ఖాతాను తిరిగి పునరుద్ధరించేందుకు ఖాతాదారుడు కనీస డిపాజిట్ అయిన రూ.500 చెల్లించడంతో పాటు ఎన్ని ఆర్థిక సంవత్సరాలైతే డిపాజిట్ చేయలేదో అన్ని రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా మెచ్యూరిటీ కాకముందే చేయాల్సి ఉంటుంది.

సమాచారం

సమాచారం

పీపీఎఫ్‌కు అకౌంట్‌కు సంబంధించి సమాచారం ఇక్కడ చూడండి:

* ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ.500 ఉండాల్సి ఉండగా... గరిష్ట డిపాజిట్ రూ.1.50 లక్షల వరకు ఉండొచ్చు

* అతని / ఆమె సొంత ఖాతాలో మరియు మైనర్ తరపున తెరిచిన ఖాతాలో చేసిన డిపాజిట్లతో కలిపి గరిష్టంగా రూ .1.50 లక్షలు ఉండాలి.

* ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని వాయిదాలలోనైనా రూ .50 కంటే ఎక్కువ మొత్తంలో జమ చేయవచ్చు.

*నగదు / చెక్ ద్వారా ఖాతాను తెరవవచ్చు

English summary

పీపీఎఫ్ ఖాతా గడువు ముగిసిందా.. అయితే ఎలాంటి బెనిఫిట్స్‌ను కోల్పోతారు,అప్పుడు ఏం చేయాలి..? | If your PPF account expires then what will happen, what are the benefits that you lose?

Public Provident Fund (PPF) is one of the most popular small savings scheme (SSS) which offers assured returns without any undue risks.
Story first published: Tuesday, December 15, 2020, 11:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X