For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు UAN నెంబర్లు ఉన్నాయా, అయితే ఇలా మెర్జ్ చేయండి

|

ఉద్యోగులు ఉద్యోగాలు మారిన సమయంలో ఇదివరకు 2 యూనివర్సల్ అకౌంట్ నంబర్స్(UAN) ఉంటాయి. ఇంత‌కుముందు చేసిన ఉద్యోగంలో ఒక UANతో పాటు, మ‌రో కంపెనీలో చేరిన‌ప్పుడు కొత్త‌గా UAN ఉంటుంది. అయితే అలా కాకుండా ముందు ఉన్న UAN కొత్త కంపెనీకి ఇస్తే అదే EPF ఖాతాలో ప్ర‌తి నెల PF డిపాజిట్ అవుతుంది. ఒక ఉద్యోగి ఎన్ని సంస్థ‌లు మారినా ఒకే UANతో అనుసంధానించిన PF ఖాతాను నిర్వ‌హించుకునే సదుపాయం ఉంది. ఈపీఎఫ్ఓ వెబ్ సైట్‌కు వెళ్లి రెండు యూఏఎన్ నెంబర్‌లను మెర్జ్ చేయవచ్చు.

ఇలా రెండు UAN నెంబర్లు

ఇలా రెండు UAN నెంబర్లు

ప్రస్తుత UANను కొత్త యజమానికి వెల్లడించకపోయిన పక్షంలో, అక్కడ కొత్త UAN జారీ అవుతుంది. గత యజమాని సకాలంలో సమ్మతించకపోతే రెండు UANలు జారీ అయ్యే అవకాశముంది. ఉద్యోగం మారిన‌ప్పుడు కంపెనీ యజమానులు వారి చివ‌రి తేదీని EPFOకు తెలియ‌జేయాలి. వారు దానిని నెలవారీ దాఖలు చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ చలాన్ అండ్ రిటర్న్(ECR)లో పేర్కొంటారు. ఈ విధానం సకాలంలో చేయకపోతే కొత్త యజమాని ఉద్యోగికి తాజా UAN కేటాయిస్తాడు.

రెండు మెర్జ్ చేయడం ఇలా...

రెండు మెర్జ్ చేయడం ఇలా...

రెండు విధాలుగా UANలను విలీనం చేయవచ్చు. ఒక‌టి సభ్యుడు EPFO UAN పోర్ట‌ల్‌కు లాగిన్ కావాలి. అప్పుడే UANతో అనుసంధానం చేసిన పాత ఈపీఎఫ్ ఖాతాను కొత్త‌దానికి బ‌దిలీ చేసుకోవ‌చ్చు లేదా మెర్జ్ చేయవచ్చు. ఇదివరకటి ఖాతాలు బదిలీ అయిన తర్వాత పాత UAN డీయాక్టివేట్ అవుతుంది. EPFO దీనిని ఎస్సెమ్మెస్ ద్వారా ఇది వెల్లడిస్తుంది.

ఇలా...

ఇలా...

unifiedportal-mem.epfindia.gov.in పోర్టల్‌లోకి వెళ్లాలి. ఈ పోర్టల్‌లోకి లాగ్-ఇన్ అయి ఇండివిడ్యువల్స్ ఈపీఎఫ్ అకౌంట్ UAN నెంబర్‌ను కొత్త నెంబర్‌కు లింక్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టవచ్చు.

ఒకసారి ఇంతకుముందు అన్నీ అకౌంట్స్ ట్రాన్సుఫర్ అయ్యాక ఆ యూఏఎన్ డిజబుల్ అవుతుంది. ఇది ఎస్సెమ్మెస్ ద్వారా తెలుస్తుంది. కొన్నిసార్లు ఇంతకుముందు యజమాని గతంలోని పీఎఫ్ బకాయిలను జమ చేయవచ్చు. ఇవి కూడా కొత్త UANలో కనిపించవచ్చు. అయితే దీనికి సమయం తీసుకుంటుంది.

అయితే ఉద్యోగి వెబ్ పోర్టల్‌కు వెళ్లి ఈ-మెయిల్ పంపించడం ద్వారా ప్రస్తుత యజమానికి లేదా ఈపీఎఫ్ఓ​​కి నివేదించవచ్చు. ఈపీఎఫ్ఓ దీనిని దృవీక‌రించి పాత యూఏఎన్ బ్లాక్ చేస్తుంది. అయితే ఉద్యోగి పాత ఖాతాను కొత్త క్రియాశీల UANకి బదలీ చేసేందుకు రిక్వెస్ట్ పెట్టాలి. ఇలా చేయడానికి మీ కేవైసీ పూర్తి అప్ డేట్ చేసి ఉండాలి.

English summary

రెండు UAN నెంబర్లు ఉన్నాయా, అయితే ఇలా మెర్జ్ చేయండి | If an employee two UAN numbers, How can I merge 2 UAN number?

To merge two existing EPFO accounts, the member must visit the EPFO website and under the Services tab, click on One employee - One EPF account button.
Story first published: Wednesday, June 30, 2021, 15:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X