For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ICICI Bank Customers Alert: iMobile పే యాప్ ద్వారా ట్రాన్సుఫర్..

|

ICICI బ్యాంకు కస్టమర్ల కోసం ఓ కొత్త అప్‌డేట్. ఐసీఐసీఐ బ్యాంకు మొబైల్ అనువర్తనం సహాయంతో నిధులను సులభంగా బదలీ చేయగలరు. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇటీవల ఓ ట్వీట్‌లో ఐసీఐసీఐ బ్యాంకు iMobilePayByICICIBankను ట్వీట్ చేస్తూ, కస్టమర్లు మరింత సౌకర్యవంతంగా, సులభంగా ఫండ్‌ను ట్రాన్సుఫర్ చేయవచ్చునని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ మొబైల్ యాప్ డాట్ కాంలోకి వెళ్లి తొలుత యాప్ డౌన్ లోడ్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే..

ఇలా ట్రాన్సుఫర్ చేయాలి

ఇలా ట్రాన్సుఫర్ చేయాలి

- ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్ అయితే ఇలా చేయండి...

- mobile.icicibank.com/dl నుండి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

- ఐసీఐసీఐ బ్యాంకు ఐ-మొబైల్ యాప్‌ను ఉపయోగించి కస్టమర్లు తమకు ఇష్టమైన వారికి డబ్బులను పంపించవచ్చు.

- మొదట ఐసీఐసీఐ బ్యాంకు ఐమొబైల్ యాప్‌లోకి లాగ్-ఇన్ కావాలి.

- నాలుగు అంకెల లాగ్-ఇన్ పిన్‌ను ఎంటర్ చేయాలి.

- ట్రాన్సుఫర్ ఫండ్ పైన క్లిక్ చేయాలి.

- 'పేయీ'ని యాడ్ చేసిన తర్వాత Add/ Manage Payee పైన క్లిక్ చేయాలి.

ఐసీఐసీఐ కస్టమర్ అయితే...

ఐసీఐసీఐ కస్టమర్ అయితే...

- మీరు డబ్బులు ట్రాన్సుఫర్ చేసేవారు కూడా ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్ అయితే దీనిని ఎంచుకోండి. లేదా ఆ బ్యాంకును ఎంచుకోండి.

- 'పేయీ' వివరాలు ఎంటర్ చేయాలి. ఉదాహరణకు అకౌంట్ నేమ్, అకౌంట్ నెంబర్, నిక్‌నేమ్, IFSC కోడ్ ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి.

- ఓటీపీ వస్తే, దానిని ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత అమౌంట్ ఎంటర్ చేయాలి, ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి.

- ట్రాన్సాక్షన్‌ను ధృవీకరించేందుకు కన్‌ఫర్మ్ పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత మళ్లీ ఫోర్-డిజిట్ పిన్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత మనీ ట్రాన్సుఫర్ అవుతుంది.

వేరే బ్యాంకు కస్టమర్ అయితే...

వేరే బ్యాంకు కస్టమర్ అయితే...

- పేయీ మరో బ్యాంకు కస్టమర్ అయితే ఇలా చేయండి

- పేయీస్ జాబితా నుండి పేయీని ఎంచుకోవాలి.

- పే చేసే మొత్తాన్ని ఎంటర్ చేయండి.

- NEFT/RTGS/IMPS నుండి ట్రాన్సుఫర్ టైప్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సి విషయం ఏమంటే NEFT ద్వారా రూ.20 లక్షలు ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు.

- RTGS ద్వారా రూ.2 లక్షల నుండి రూ.20 లక్షల వరకు ట్రాన్సుఫర్ చేయవచ్చు.

- IMPS 365 రోజులు 24x7 అందుబాటులో ఉంటుంది.

- నౌ-లాటర్ మధ్య ఎంచుకోండి.

- పేమెంట్ టైప్, ఫ్రీక్వెన్సీ, ఇన్‌స్టాల్‌మెంట్స్ ఎంటర్ చేయాలి.

- ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి.

- ట్రాన్సుఫర్ సక్సెస్ అవుతుంది.

English summary

ICICI Bank Customers Alert: iMobile పే యాప్ ద్వారా ట్రాన్సుఫర్.. | ICICI Bank Customers Alert: how to transfer money online via iMobile pay app

There is an update for the customers of ICICI Bank as they must note that they can easily transfer funds with the help of ICICI Bank iMobile app. Notably, customers can also login to the official website at icicibank.com to know more details.
Story first published: Wednesday, July 28, 2021, 18:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X