For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EPF Withdraw: ఈపీఎఫ్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఉపసంహరణ ఎలా?

|

ఉద్యోగులు ఎవరికైనా నగదు అత్యవసరమైతే పర్సనల్ లోన్, గోల్డ్ లోన్‌తో పాటు ఈపీఎఫ్ ఉపసంహరణ వైపు కూడా చూస్తారు. సాధారణంగా పీఎఫ్ మొత్తాన్ని పదవీ విరమణ తర్వాత లేదా ఉద్యోగం మానివేసిన రెండు నెలల తర్వాత తీసుకుంటారు. అలాగే, హాస్పిటల్ ఖర్చులు, పెళ్లి, ఉన్నత చదువుల కోసం, ఇంటి కొనుగోలు కోసం పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంది. ఈపీఎఫ్ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా తీసుకోవచ్చు. అయితే ఇందుకు UAN నెంబర్ పొందడం, దీనిని ఆన్ లైన్‌లో యాక్టివేట్ చేసుకోవడం, KYC పూర్తి, ఈ-నామినేషన్ దాఖలు, మొబైల్ నెంబర్ అప్ డేట్ వంటివి అవసరం. ఇందులో ఏ ఒక్కటి పూర్తి కాకపోయినా ఆన్‌లైన్‌లో ఉపసంహరణ చేసుకోవడం సాధ్యం కాదు. ఈపీఎఫ్ ఉపసంహరణ ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా చేసుకోవచ్చు.

ఆఫ్ లైన్ ఉపసంహరణ

ఆఫ్ లైన్ ఉపసంహరణ

ఈపీఎఫ్ ఆఫ్ లైన్ ఉపసంహరణకు కింది విధంగా చేయాలి.

- కాంపోజిట్ క్లెయిమ్ ఫామ్ (ఆధార్ లేదా నాన్-ఆధార్)ను డౌన్ లోడ్ చేయాలి.

- కాంపోజిట్ క్లెయిమ్ ఫామ్ (ఆధార్) ద్వారా దరఖాస్తు చేసే ఇండివిడ్యువల్స్... ఆధార్‌ను ప్రైమరీ బ్యాంకు అకౌంట్ నెంబర్‌తో లింక్ చేయవలసి ఉంటుంది. బ్యాంకు అకౌంట్ వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత పోర్టల్ ద్వారా యాక్టివేషన్ ప్రాసెస్ అవసరమవుతుంది.

- అలాగే, కాంపోజిట్ క్లెయిమ్ ఫామ్ (నాన్-ఆధార్) ద్వారా దరఖాస్తు చేసేవారు ఆధార్ సీడింగ్ ప్రాసెస్ అవసరం లేదు.

- ఇండివిడ్యువల్స్ ఒకసారి డేటా ఫిల్-అప్ చేస్తే వారు తప్పనిసరిగా సంబంధిత అధికార పరిధిలోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి సమర్పించాలి. ఇక్కడ ఎంప్లాయర్ అటెస్టేషన్ అవసరం.

ఆన్‌లైన్ ఈఫీఎఫ్ ఉపసంహరణ

ఆన్‌లైన్ ఈఫీఎఫ్ ఉపసంహరణ

- మొదట ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోని e-Sewa portal లోకి విజిట్ చేయాలి.

- పాస్ వర్డ్, యూఏఎన్, క్యాప్చా కోడ్ ద్వారా సైన్-ఇన్ కావాలి.

- 'Online Services'లోని Claim (Form-19, 31, 10C & 10D)' ఫాంను ఎంచుకోవాలి.

- కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. యూఏఎన్‌తో లింక్ అయిన సరైన బ్యాంకు అకెంట్ నెంబర్ వివరాలు ఇవ్వాలి.

- Verify పైన క్లిక్ చేయాలి.

- బ్యాంకు అకౌంట్ వివరాలు వెరిఫై చేశాక, టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను కన్‌ఫర్మ్ చేయాలి.

- Proceed For Online Claimను సెలక్ట్ చేసుకోవాలి.

- ఆ తర్వాత మీరు డ్రాప్ డౌన్ ద్వారా నగదును ఉపసంహరించుకునే కారణాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. మీ అర్హత పైన ఆధారపడి ఉంటుంది.

- ఓసారి ఇండివిడ్యువల్స్ కారణాన్ని వెల్లడించాక, కారణాన్ని పేర్కొన్న తర్వాత వారు తమ చిరునామాను ఇవ్వాలి.

- ఇక్కడ గుర్తించాల్సిన మరో విషయం ఉంది. ఇండివిడ్యువల్స్ క్లెయిమ్ చేసే మొత్తాన్ని పేర్కొనాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.

- టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేయాలి.

- Get Aadhaar OTP కార్డు పైన క్లిక్ చేయాలి.

- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. సంబంధిత బాక్సులో ఓటీపీ నెంబర్ ఎంటర్ చేయాలి.

- ఓటీపీ ఎంటర్ చేశాక, ఈపీఎఫ్ ఉపసంహరణ కోసం ఆన్ లైన్ లైన్ క్లెయిమ్ సమర్పించబడుతుంది.

ఆ తర్వాతే..

ఆ తర్వాతే..

ఆన్ లైన్ ద్వారా ఈపీఎఫ్‌ని ఉపసంహరించుకోవడానికి యూఏఎన్‌ని యాక్టివేట్ చేయాలి. కేవైసీ అంటే ఆధార్, పాన్, బ్యాంకు వివరాలతో లింక్ చేయాలి. అన్ని షరతుల తర్వాత వ్యక్తులు ఈపీఎఫ్ ఉపసంహరణను సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.

English summary

EPF Withdraw: ఈపీఎఫ్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఉపసంహరణ ఎలా? | How to Withdraw EPF: Know the Process

Individuals willing to withdraw EPF must note that withdrawal is possible both partially and fully. Similarly, you can choose to withdraw the amount through an offline or online mode.
Story first published: Friday, March 4, 2022, 19:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X