For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Yono Cash: ఏటీఎం కార్డ్‌లేకుండా డబ్బులు డ్రా చేయండి ఇలా...

|

కరోనా సమయంలో చాలామంది ఏటీఎం నుండి డబ్బులు ఉపసంహరణ విషయంలోను జాగ్రత్తగా ఉంటున్నారు. ఎస్బీఐ యోనో యాప్ సహకారంతో కార్డు లేకుండానే ఏటీఎం నుండి నగదును ఉపసంహరించుకోవచ్చు. ఇందుకు మొదట ఎస్బీఐ యోనో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. SBI కొత్త ఏటీఎంలలో యోనో క్యాష్ ఆప్షన్ ఉంటుంది.

యోనో క్యాష్ ఆప్షన్ 500 డినామినేషన్‌లో మాత్రమే వర్క్ చేస్తుంది. మీరు యాప్‌లో ఇచ్చిన అమౌంట‌్‌ను ఏటీఎంలో తప్పుగా నమోదు చేస్తే మీరు ఇచ్చిన రిక్వెస్ట్ క్యాన్సిల్ అవుతుంది. అమౌంట్ డెబిట్ కాదు. యోనో క్యాష్ ద్వారా నగదు ఉపసంహరణకు ఇలా చేయండి...

మొబైల్‌లో ఏం చేయాలి?

మొబైల్‌లో ఏం చేయాలి?

- ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్టర్ అయి ఉండాలి.

- యోనో ఎస్బీఐ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

- మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్‌తో లాగిన్ కావాలి.

- ఆ తర్వాత యోనో పే పైన క్లిక్ చేయాలి.

- యోనో క్యాష్ పైన క్లిక్ చేయాలి.

- ఏటీఎం అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

- మీరు ఉపసంహరణ చేసుకోవాలనుకునే అమౌంట్‌ను ఎంటర్ చేయాలి.

- నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి.

- ఆరు అంకెల తాత్కాలిక పిన్ మీరు సొంతగా సెట్ చేసుకోవాలి.

- ఐ అగ్రీ అనే బాక్స్ పైన క్లిక్ చేయాలి.

- యాప్‌ను క్లోజ్ చేయాలి.

ఇవి గుర్తుంచుకోండి..

ఇవి గుర్తుంచుకోండి..

- మీరు రిక్వెస్ట్ ఇచ్చిన వెంటనే బ్యాంకు నుండి సందేశం వస్తుంది. ఇది బ్యాంకు పంపిన తాత్కాలిక పిన్ నెంబర్.

- మీరు ఇది వరకు ఓన్‌గా సెట్ చేసిన తాత్కాలిక పిన్ నెంబర్, మీరు రిక్వెస్ట్ పంపిన అమౌంట్ గుర్తుంచుకోవాలి.

ATMలో చేయాల్సినవి...

ATMలో చేయాల్సినవి...

- ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లి ఏటీఎం స్క్రీన్‌లో బిలో రైట్ కార్నర్‌లో యోనో క్యాష్ పైన క్లిక్ చేయాలి.

- ఎస్బీఐ పంపించిన ఆరు అంకెల పిన్ నెంబర్‌ను నమోదు చేయాలి.

- మీరు రిక్వెస్ట్ పంపిన అమౌంట్‌ను నమోదు చేయాలి.

- మీరు సొంతగా సెట్ చేసుకున్న తాత్కాలిక పిన్‌ను నమోదు చేయాలి.

- ఆ తర్వాత అమౌంట్ ఉపసంహరించుకోవాలి.

- అమౌంట్ ఉపసంహరించుకున్న తర్వాత మీరు సెట్ చేసుకున్న పిన్, ఎస్బీఐ పంపిన పిన్ పిన్ ఎక్స్‌పైరీ అవుతుంది.

English summary

Yono Cash: ఏటీఎం కార్డ్‌లేకుండా డబ్బులు డ్రా చేయండి ఇలా... | How to withdraw cash from SBI ATM without SBI debit card?

SBI customers need to Login to the YONO App Using 6 Digit MPIN. Then on Home page of SBI Yono App, you need to click on the YONO Pay button and select YONO Cash.
Story first published: Wednesday, July 21, 2021, 15:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X