For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్: ATM నుండి కార్డ్‌లెస్ ఉపసంహరణ ఎలా చేయాలి?

|

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్కులు ధరించడం, శానిటైజర్లు ఉపయోగించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. ఒకరు తాకిన వస్తువును మరొకరు తాకాలంటే భయపడే పరిస్థితి. కరోనా నేపథ్యంలో సాధ్యమైనంత వరకు బహిర్గత ప్రదేశాల్లో ఇష్టారీతిన ముట్టకపోవడమే మంచింది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్‌స్టీల్ పైన కరోనా 3 రోజుల వరకు జీవించగలదు. మీరు ఏటీఎం నుండి డబ్బు తీసే సమయంలో ఇవి ఉంటాయి.

కొత్త ఐటీ ఫామ్స్: కరెంట్ బిల్లు రూ.1 లక్ష దాటినా,బ్యాంకులో రూ.1 కోటి ఉన్నా ఐటీ రిటర్న్స్ తప్పనిసరికొత్త ఐటీ ఫామ్స్: కరెంట్ బిల్లు రూ.1 లక్ష దాటినా,బ్యాంకులో రూ.1 కోటి ఉన్నా ఐటీ రిటర్న్స్ తప్పనిసరి

కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ

కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ

ఇలాంటి పరిస్థితుల్లో ఏటీఎం మిషన్‌ను సాధ్యమైనన్ని తక్కువసార్లు తాకడానికి కార్డ్‌లెస్ ఉపసంహరణ ఎంతో ప్రయోజనం. కార్డు ద్వారా డబ్బు తీసుకోవాలంటే పలుమార్లు ఏటీఎం మిషన్‌లో నెంబర్లు టైప్ చేయాలి. కానీ డెబిట్ కార్డు లేదా ఏటీఎం కార్డు లేదా క్రెడిట్ కార్డు ఉపయోగించకుండానే ఏటీఎం మిషన్‌ను సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించి నగదు ఉపసంహరించుకునే వెసులుబాటును వివిధ బ్యాంకులు ఇస్తున్నాయి. బ్యాంకును బట్టి రోజుకు రూ.10,000 నుండి రూ.20,000 తీసుకోవచ్చు. ఈ సౌకర్యం ప్రస్తుతం కొన్ని బ్యాంకుల్లో ఉంది.

కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ ఇలా..

కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ ఇలా..

ఏటీఎం నుండి కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ బ్యాంకును బట్టి ఒక్కో విధంగా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు కార్డ్‌లెస్ విత్ డ్రా కోసం వారి వారి బ్యాంకుల యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలి.

ఎస్బీఐ కోసం యోనో యాప్ డౌన్ లోడ్ చేయాలి. ఇందులో యోనో క్యాష్ ఆప్షన్ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్ అయిదే ఐమొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మనీ తీసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా బీవోబీ ఎంకనెక్ట్ ప్లస్ డౌన్ లోడ్ చేసుకొని, ఇందులో క్యాష్ ఆన్ మొబైల్ ఆప్షన్ ఉపయోగించాలి.

కస్టమర్లు ఈ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ ప్రారంభించవచ్చు.

ఇలా చేయాలి..

ఇలా చేయాలి..

కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ కోసం కస్టమర్ ఆయా బ్యాంకు యాప్స్‌కు వెళ్లిన తర్వాత తాము ఉపసంహరించుకోవాలనుకునే మొత్తాన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత యాప్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు ఓటీపీ లేదా పిన్ వస్తుంది. అయితే ఇది పరిమిత కాలం మాత్రమే ఉంటుంది. బ్యాంకును బట్టి కొద్ది నిమిషాల నుండి గంటల్లోనే ఉంటుంది.

నగదు ఉపసంహరణ

నగదు ఉపసంహరణ

ఏటీఎం సెంటర్‌కు వెళ్లి మీకు వచ్చిన పిన్ లేదా ఓటీపీని ఎంటర్ చేసి, నగదుని ఉపసంహరించుకోవచ్చు. కొన్ని బ్యాంకులకు ఎస్సెమ్మెస్ సౌకర్యం కూడా ఉంది. ఉదాహరణకు యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు ఐఎంటీ ఆప్షన్ (ఇన్‌స్టాంట్ మనీ ట్రాన్సుఫర్)ను ఉపయోగించవచ్చు.

English summary

కరోనా ఎఫెక్ట్: ATM నుండి కార్డ్‌లెస్ ఉపసంహరణ ఎలా చేయాలి? | How To Make Cardless Cash Withdrawals At ATMs?

To maintain minimum contact with the machine and get sooner to withdrawing cash, some major banks are allowing their customers to withdraw cash from ATMs without having to use their debit card, ATM card or credit card.
Story first published: Tuesday, June 2, 2020, 15:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X