For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EPF బ్యాలెన్స్ చెక్ చేయడం చాలా సులభం, ఇలా చేయండి

|

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) 65 లక్షల మంది ఈపీఎఫ్ అకౌంట్ మెంబర్స్‌కు శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ సమయంలో శుభవారంత చెప్పిన ఈపీఎఫ్ఓ... 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటు క్రెడిట్ అవుతుందని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటును ప్రభుత్వం 8.5 శాతంగా ఇస్తోంది. ఈ నేపథ్యంలో మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవాలనుకుంటే ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోండి.

వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం లేదా మీరు చెల్లించాల్సిన అత్యవసర రుణాల కోసం లేదా మీ పిల్లల ట్యూషన్ ఫీజు కోసం.. ఇలాంటి సందర్భాల్లో పీఎఫ్ మొత్తం అవసరం ఏర్పడవచ్చు. అయితే పీఎఫ్ మొత్తాన్ని అత్యవసరమైతే ఉపసంహరించుకోవడం సరికాదు. ఇల్లు, ఆటోమొబైల్, స్టడీ వంటి పెద్ద అవసరాలకు వినియోగించవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా ఈపీఎఫ్ మనీ ఉపసంహరణ

ఆన్‌లైన్ ద్వారా ఈపీఎఫ్ మనీ ఉపసంహరణ

- ఆన్ లైన్ ద్వారా ఈపీఎఫ్ఓ ద్వారా నగదును ఉపసంహరించుకోవడానికి ఇలా చేయాలి.

- తొలుత www.epfindia.gov.in వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. డ్రాప్ డౌన్ మెనూ నుండి ఆన్‌లైన్ అడ్వాన్స్ క్లెయిమ్‌ను ఎంచుకోవాలి.

- ఆ తర్వాత ఆన్‌లైన్ సర్వీస్ అండ్ సెలక్ట్ క్లెయిమ్ (Form-31,19,10C and 10D)ను ఎంచుకోవాలి.

- ఆ తర్వాత బ్యాంకు అకౌంట్ చివరి నాలుగు డిజిట్స్ ఎంటర్ చేసి, చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ క్లెయిమ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

- డ్రాప్ డౌన్ మెనూ నుండి పీఎఫ్ అడ్వాన్స్‌ను ఎంచుకోవాలి.(Form 31).

- డ్రాప్ డౌన్ ఆప్షన్ నుండి మీ కారణాన్ని ఎంచుకోవాలి. ట్రాన్సుఫర్ అమౌంట్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత స్కాన్ చేసిన కాపీని అప్ లోడ్ చేయాలి.

- ఆధార్ ఔటీపీ పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ లింక్డ్ సెల్ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా?

ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా?

- EPFOHO UAN ENG లేదా EPFOHO UAN HIN అని టైప్ చేసి 7738299899 కు సందేశం పంపించాలి. మీ మీ భాషను బట్టి చివరి మూడు అక్షరాలు మార్చుకోవచ్చు.

- సందేశాన్ని తప్పనిసరిగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి పంపించాలి.

- సందేశం పంపించిన తర్వాత పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ మెసేజ్ వస్తుంది.

మిస్డ్ కాల్ ద్వారా సందేశం

మిస్డ్ కాల్ ద్వారా సందేశం

- ఈపీఎఫ్ఓ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

- మిస్డ్ కాల్ ిచ్చిన తర్వాత ఈపీఎఫ్ఓ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు సందేశం వస్తుంది.

ఆన్‌లైన్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్

ఆన్‌లైన్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్

- ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్‌లోని ఈ-పాస్‌బుక్ పైన క్లిక్ చేయాలి.

- ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ హోల్డర్స్ UAN నెంబర్, పాస్ వర్డ్‌ను ఎంటర్ చేయాలి.

- మీ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోవడానికి డ్రాప్ డౌన్ మెనూలో పాస్ బుక్‌ను చూడాలి.

English summary

EPF బ్యాలెన్స్ చెక్ చేయడం చాలా సులభం, ఇలా చేయండి | How to check EPF balance online?

PF account holders will be especially valuable in the event of a medical emergency, if you have a loan to repay, or if you need money for your child's college tuition.
Story first published: Sunday, October 24, 2021, 13:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X