For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ SBI కార్డు బ్లాక్ చేస్తారు, కొత్త EVM కార్డు కోసం ఇలా అప్లై చేయండి

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మ్యాగ్‌స్ట్రిప్ (మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డు) కలిగిన కార్డులను డిసెంబర్ 31వ తేదీ నుంచి బ్లాక్ చేయనుంది. వాటి స్థానంలో కొత్తగా ఈవీఎం (యూరోపే, మాస్టర్ కార్డు, వీసా) చిప్ అండ్ పిన్ బేస్డ్ డెబిట్ కార్డులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 31వ తేదీ లోపు మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులను ఎలాంటి ఛార్జీ లేకుండా మార్చుకునే వెసులుబాటు ఎస్బీఐ కల్పించింది. ఈ నేపథ్యంలో EVM చిప్ కార్డులు ఇలా మార్చుకోవచ్చు...

డిసెంబర్ 31వ తర్వాత ఈ డెబిట్ కార్డులు బ్లాక్ అవుతాయి, మార్చుకోండిడిసెంబర్ 31వ తర్వాత ఈ డెబిట్ కార్డులు బ్లాక్ అవుతాయి, మార్చుకోండి

హోమ్ బ్రాంచీకి వెళ్లి తీసుకోవచ్చు

హోమ్ బ్రాంచీకి వెళ్లి తీసుకోవచ్చు

EVM చిప్ కార్డులు లేని SBI కస్టమర్లు హోమ్ బ్రాంచీకి వెళ్లి తమ మ్యాగ్‌స్ట్రిప్ కార్డు స్థానంలో వీటిని మార్చుకోవచ్చు. మ్యాగ్‌స్ట్రిప్ కార్డుల స్థానంలో EVM చిప్ ఆధారిత కార్డులు తీసుకోవాలని ఎస్బీఐ తమ కస్టమర్లకు పదేపదే విజ్ఞప్తి చేసింది. డిసెంబర్ 31 తేదీలోపు కార్డులు మార్చుకోవాలి. ఆ తర్వాత వ్యాలిడిటీతో సంబంధం లేకుండా కార్డులు డీ-యాక్టివేట్ చేస్తారు. కాబట్టి ఈవీఎం చిప్ కార్డులు తీసుకోవాలి.

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

కొత్త EVM చిప్ కార్డుల కోసం కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏస్బీఐ కస్టమర్లు https://www.onlinesbi.com/కు వెళ్లి ATM Card Services పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో సూచనలు పాటిస్తూ దరఖాస్తు చేసుకోవాలి.

యోనో ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

యోనో ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ Yono app ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాగ్‌స్ట్రిప్‌కు బదులు ఈవీఎం చిప్ కార్డు తీసుకోవడానికి ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఉచితంగా బ్యాంకు అందిస్తుంది. కాగా, కార్డు రిజిస్టర్డ్ చిరునామాకు వస్తుంది. కాబట్టి అడ్రస్ మారితే అప్ డేట్ చేసుకోవాలి.

English summary

ఈ SBI కార్డు బ్లాక్ చేస్తారు, కొత్త EVM కార్డు కోసం ఇలా అప్లై చేయండి | How to apply for SBI's new EMV chip and pin based card

SBI customers who have not received their EMV chip cards are requested to approach the home branch for changing the Magstripe card immediately.
Story first published: Tuesday, December 10, 2019, 11:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X