For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విడాకులు తీసుకోవాల్సి వస్తే... మహిళ ఫైనాన్సియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?

|

వివాహ బంధంతో ఒక్కటైన జంట ఏదేని బలమైన కారణం వల్ల విడిపోవాల్సి వస్తే... అది విడాకులకు దారి తీస్తుంది. విడాకులు అనే విషయం చాలా బాధాకరం. అయినా సరే ఇక తప్పదు అనుకున్నపుడు భాగస్వాములు ఇద్దరూ చట్టబద్ధంగా విడిపోవచ్చు. అయితే, అలాంటి సమయంలో ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే... ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ కొనసాగిస్తూ భద్రంగా జీవనం కొనసాగించాలంటే ఎం చేయాలో చాలా మందికి తెలియదు. భర్తతో విడిపోవాల్సి వస్తే తొలుత మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. తర్వాత కోర్టులు, కౌన్సిలింగ్ అంటూ తిరగాల్సి వస్తుంది. ఒక వైపు ఉద్యోగం, మరో వైపు ఇలాంటి ఇబ్బందులు వారిని కుదురుగా ఆలోచించనీయవు. కానీ, మహిళలు ఇక తప్పనిసరిగా విడాకులు తీసుకోవాల్సిందే అని నిర్ణయం తీసుకుంటే మాత్రం.. లాయర్ కంటే ముందు ఒక ఫైనాన్సియల్ ప్లానర్ సలహాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ లో ఒక కథనం ప్రచురితమైంది. దాని ఆధారంగా మహిళల కోసం ఈ ప్రత్యేక వ్యాసం.

-విడిపోవటం ఖరారు ఐపోయినప్పుడు మహిళలు ముందుగా చేయాల్సిందేమిటంటే ఆదాయం, ఆస్తులకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ సేకరించిపెట్టుకోవాలి. మీ శాలరీ స్టేట్మెంట్స్, అద్దె రెసిప్ట్స్, ప్రాపర్టీ డాకుమెంట్స్, ఇంటి కోసం కొనుగోలు చేసిన విలువైన వస్తువులకు సంబంధించిన బిల్లులు, నెల వారి ఖర్చుల జాబితా, ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ సేకరించి పెట్టుకోవాలి. వాటిని అలాగే వదిలేస్తే... తర్వాత భర్త నుంచి అలాంటి ఆధారాలు సేకరించటం కష్టతరమవుతుంది.

How a woman can prepare financially for divorce

-మీ పేరుమీద కొనుగోలుచేసి విలువైన నగలు, వజ్రాభరణాలు, సహా ఏదైనా బాండ్స్ పత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ సొంత పేరుమీద ఉన్న లాకర్ లో భద్రపరచుకోండి. కేవలం మీ పేరుతో ఉన్న లాకర్ లేదా.. మీ పేరెంట్స్ పేరుతో ఉన్న లాకర్ల లో మాత్రమే వాటిని భద్రపరచుకోండి.

-భర్తతో కలిసి మీకు ఒక ఉమ్మడి బ్యాంకు ఖాతా (జాయింట్ అకౌంట్) ఉన్నట్లయితే.. అందులో మీ వైపు నుంచి సొమ్ము జమచేయటం నిలిపివేయటం మంచిది.

-లాయర్ కంటే ముందు ఒక ఫైనాన్సియల్ ప్లానర్ ను కలిసి, భవిష్యత్ లో ప్రస్తుత లైఫ్ స్టయిల్ కు తగ్గట్లు జీవించాలంటే ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు అవసరమో తెలుసుకోండి. మైంటెనెన్సు లభిస్తే దానిని ఏ ఏ పెట్టుబడి సాధనాల్లో మదుపు (ఇన్వెస్ట్) చేయాలో తెలుసుకోండి.

-భరణం గా లభించే మొత్తాలను ఏక మొత్తం (లంసామ్) ఉండేలా జాగ్రత్త పడండి. నెల వారీ చెల్లించే పద్ధతిలో భవిష్యత్ ద్రవ్యోల్బణం, ఇతరత్రా కారణాల వల్ల మీకు వచ్చే సొమ్ము అప్పటి పరిస్థితులకు తగినంతగా ఉండదు. మరోవైపు ఏక మొత్తంగా వచ్చే భరణం పై ఆదాయ పన్ను వర్తించదు. అధిక మొత్తంలో ఒకేసారి సొమ్ము చేతిలో వస్తే భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు ఒకేసారి విభిన్న రకాల పెట్టుబడులు చేసేందుకు వీలు చిక్కుతుంది.

-ఆస్తులను కొనుగోలు చేసేప్పుడు, భవిష్యత్లో వాటి మైంటెనెన్సు కూడా పరిగణన లోకి తీసుకోండి. ఉదాహరణకు ఒక ఇల్లు కొనుగోలు చేస్తే.. తర్వాత దాని మైంటెనెన్సు కోసం మీ వద్ద తగినంత సొమ్ము లేకపోతే మీకు ఆర్థికంగా భారం అవుతుంది. కాబట్టి చేతిలో కొంత నగదు నిల్వలు ఉండేలా జాగ్రత్త వహించండి.

-ఒకవేళ పిల్లల బాగోగులు కూడా మీరే చూసుకోవాల్సి వస్తే వారి భవిష్యత్ చదువులు, ఇతరత్రా అవసరాల కోసం కూడా తగినంత సొమ్మును పెట్టుబడి రూపంలోనూ, ఎల్ ఐ సి పాలసీ రూపంలోనూ మదుపు చేయటం మంచిది. మీ జీవన విధానం, పిల్లల పెంపకం రెండూ వేర్వేరు విషయాలు కాబట్టి, వాటికి అనుగుణంగా మీ పెట్టుబడులు, నగదు నిల్వలు ఉండేలా జాగ్రత్త పడండి.

ఇలా చేస్తే .. విడాకుల సందర్భంలో ఆర్థికపరమైన చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గౌరవప్రదమైన జీవన కోసం క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళిక అత్యవసరం అని గుర్తించటం అన్నిటికంటే ముఖ్యం. పైన సూచించిన విధంగా చిన్న చిన్న చిట్కాలను పాటించి భవిష్యత్ ను చక్కగా తీర్చిదిద్దుకోండి.

Read more about: woman finance plan money మహిళ
English summary

విడాకులు తీసుకోవాల్సి వస్తే... మహిళ ఫైనాన్సియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి? | How a woman can prepare financially for divorce

Divorce can be painful but you should not let it wreck havoc with your finances. A woman should keep a few things in mind to ensure she is financially safe. This includes hiring a financial planner and gathering all the necessary documents. Here are six financial tips that women should keep in mind before a divorce.
Story first published: Friday, January 31, 2020, 21:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X