For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ సమస్యల పరిష్కారం కోస హెల్ప్‌లైన్ నెంబర్ ఇదే!

|

ఆధార్ కార్డుకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? మార్పులు చేస్తున్నారా? కార్డులో ఏమైనా తప్పులు ఉన్నాయా? ప్రతి సందేహాన్ని తీర్చుకోవడం కోసం మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. ఆధార్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఒక్క ఫోన్ కాల్ చేసి మీ సందేహాలను తీర్చుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఆధార్ సమస్యల పరిష్కారం కోసం హెల్ప్‌లైన్ ఉంది. ఈ నెంబర్‌కు ఫోన్ చేసి పరిష్కారం అడగవచ్చు.

LVB crisis: లక్ష్మీ విలాస్ బ్యాంకు నుండి రూ.5 లక్షలు తీసుకోవచ్చు.. ఇలాLVB crisis: లక్ష్మీ విలాస్ బ్యాంకు నుండి రూ.5 లక్షలు తీసుకోవచ్చు.. ఇలా

ఆధార్ హెల్ప్‌లైన్ సమయం

ఆధార్ హెల్ప్‌లైన్ సమయం

ఆధార్ హెల్ప్ లైన్ వారమంతా అందుబాటులో ఉంటుంది. ఏజెంటుతో మాట్లాడేందుకు 1947కు కాల్ చేయాలి.

ఆధార్ సంబంధ సందేహాల్ని తీర్చుకోవడం కోసం సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు 1947కు ఫోన్ చేయవచ్చు. ఆధివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

ఆధార్ హెల్ప్ లైన్ 1947 హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాళీ, అసామీ, ఉర్దూ భాషలలో సేవలు అందిస్తోంది.

IVRS ఇప్పుడు 24x7 అందుబాటులో ఉంటుంది.

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి

ఒకరోజులో లక్షన్నర కాల్స్ స్వీకరించే సామర్థ్యం UIDAI కాల్ సెంటర్‌కు ఉంది. మీ మొబైల్ నుండి లేదా ల్యాండ్ లైన్ నుండి కాల్ చేయవచ్చు. మీ ఆధార్ నెంబర్‌ను చెప్పి, మీ సందేహాన్ని తీర్చుకోవచ్చు. దగ్గరలోని ఆధార్ సెంటర్ వివరాలు, ఎన్‌రోల్‌మెంట్ స్టేటస్, ఆధార్ కార్డు డెలివరీ స్టేటస్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఆధార్ ప్రతినిధి మీ సందేహాలకు సమాధానం ఇస్తారు. ఆధార్ కార్డు హోల్డర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

1947 డయల్ చేయడం

1947 డయల్ చేయడం

ఆధార్ అఫీషియల్ హైదరాబాద్ ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 'మీ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నుండి 1947 డయల్ చేయడం ద్వారా మీరు మీ సమీప ఆధార్ కేంద్రాన్ని వివరాలు పొందవచ్చు . మీరు ప్రాంతంలోని అథరైజెడ్ ఆధార్ కేంద్రాల చిరునామాలు వంటి వివరాలను పొందవచ్చు. మీరు కేంద్రం యొక్క వివరాలను mAadhaar App నుండి కూడా పొందవచ్చు.' అని పేర్కొంది.

English summary

ఆధార్ సమస్యల పరిష్కారం కోస హెల్ప్‌లైన్ నెంబర్ ఇదే! | Helpline Number For Aadhaar Related Queries

You can also know the status of linking new mobile number from aadhaar by calling toll free number 1947 of UIDAI.
Story first published: Thursday, November 19, 2020, 14:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X