కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత బంగారం వంటి అతి విలువైన వాటిపై పెట్టుబడులు పెడుతుండటంతో వాటి ధరలు పెరుగుతున్నాయి. బుధవారం ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు 10 గ్రాములకు 0.5 శాతం (రూ.213) పెరిగి రూ.43,687గా ఉంది. అంతకుముందు సెషన్‌లో రూ.1,544 (3.6 శాతం) పెరిగింది. వెండి ధర 1 శాతం పెరిగి రూ.46,798కి చేరుకుంది. గత సెషన్‌లో వెండి రూ.1,295 (3 శాతం) పెరిగింది.

ఫెడ్ రేట్లలో కోత... బంగారంపై ప్రభావం
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆర్థిక వ్యవస్థకు మద్దతిచ్చేందుకు వీలుగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లలో అర శాతం కోత విధించింది. దీంతో ఫెడరల్ ఫండ్స్‌పై ప్రస్తుత వడ్డీ రేట్ల లక్ష్యిత శ్రేణి 1.0 శాతం నుండి 1.25 శాతానికి చేరుకుంది. గత ఏడాది నుండి ఫెడ్ తొలిసారిగా వడ్డీ రేట్లు తగ్గించింది. విధాన సమావేశాల మధ్యలో కీలక వడ్డీ రేట్లను తగ్గించడం 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం ఇదే తొలిసారి. ఫెడ్ రేట్లు తగ్గించడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ ప్రభావం బంగారంపై పడింది.

బంగారం రికార్డ్ ధర
బంగారంపై 12.5 శాతం ఇంపోర్ట్ డ్యూటీ, 3 శాతం జీఎస్టీ ఉంటుంది. అలాగే డాలరు మారకంతో రూపాయి 73.50కు పడిపోయింది. మంగళవారం 73.29 వద్ద రూపాయి క్లోజ్ అయింది. వీటికి కరోనా తోడయింది. దీంతో బంగారం ధర రూ.43,788 రికార్డ్ ధరకు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.3 శాతం పెరిగి 1,643.76 డాలర్లకు చేరుకుంది. వెండి ధర కూడా ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 17.21 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం ధర 0.9 శాతం పెరిగి 882.50 డాలర్లకు చేరుకుంది.

రెండు రోజుల్లో 1,800 పెరుగుదల
ఫెడ్ రేట్ కట్, కరోనా వైరస్, దేశీయ జ్యువెల్లర్స్, రిటైలర్ల నుండి డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర పెరుగుతోంది. రూపాయి పతనం కూడా పెరుగుదలకు కారణం. బంగారం ధర రెండు రోజుల్లో రూ.1,800 వరకు పెరిగింది.

హైదరాబాద్‌లో ఎంత ఉందంటే?
బుధవారం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర రూ.160 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.39,980 నుండి రూ.40,140కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం స్వల్పంగా పెరిగి రూ.43,790గా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.



Click it and Unblock the Notifications