For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క మిస్డ్ కాల్‌తో SBI నుండి రూ.25 లక్షల రుణం: అర్హులెవరు.. ఇలా చేయండి

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుండి వేగవంత పర్సనల్ లోన్ పొందేందుకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా ఎస్సెమ్మెస్ పంపిస్తే సరిపోతుంది. వివిధ బ్యాంకులు వ్యక్తిగత రుణాలు ఇవ్వడాన్ని మరింత సులభతరం చేశాయి. దాదాపు అన్ని బ్యాంకులు కూడా కొంత పరిమితి వరకు పర్సనల్ లోన్‌ను ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా ఇస్తున్నాయి. వేతనజీవులకు వారి వేతనాన్ని బట్టి ఈ మొత్తాన్ని ఒక్కరోజులోనే అందిస్తున్నాయి. ఎస్బీఐ మరో అడుగు ముందుకేసి, మిస్డ్ కాల్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా రుణాన్ని అందిస్తోంది.

SBI యాన్యుటీ స్కీం: ఇలా చేస్తే నెలకు రూ.10,000 ఆదాయం: ఇది తెలుసుకోండి..SBI యాన్యుటీ స్కీం: ఇలా చేస్తే నెలకు రూ.10,000 ఆదాయం: ఇది తెలుసుకోండి..

వీటి కోసం రుణం

వీటి కోసం రుణం

వివాహం, విహార‌యాత్ర‌, ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి, ప్ర‌ణాళిక‌బ‌ద్ద‌మైన కొనుగోలు వంటి వివిధ సందర్భాల్లో ఎస్బీఐ క‌స్ట‌మ‌ర్లు బ్యాంకు వెబ్‌సైట్‌లో పేర్కొన్న బ్యాంక్ ఎస్బీఐ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ ప‌ర్స‌న‌ల్ లోన్ ద్వారా క‌నీస డాక్యుమెంటేష‌న్‌తో వెంటనే రుణ ఆమోదం లభిస్తుంది. కస్టమర్లు అందరు కూడా ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్ కోసం మిస్డ్ కాల్ లేదా సందేశం పంపించవచ్చు.

ఇలా రుణం పొందవచ్చు

ఇలా రుణం పొందవచ్చు

ఎస్బీఐ కస్టమర్లు ఈ కింది నెంబర్లకు మిస్డ్ కాల్ లేదా సందేశం పంపించడం ద్వారా వ్యక్తిగత రుణం పొందవచ్చునని ఎస్బీఐ ట్వీట్ చేసింది.

7208933142 ఫోన్ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా 7208933145 సందేశం పంపించడం ద్వారా రుణం పొందవచ్చు. ఎలాంటి కోట్స్, క్యాప్స్ లేకుండా 'PERSONAL' అని పంపిస్తే సరిపోతుంది.

1800-11-2211 నెంబర్‌కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు

వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు

ఎస్బీఐ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ ఇతర వివరాలు...

- తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. వడ్డీ రేటు 9.60 శాతంగా ఉంది.

- రూ.20 లక్షల వరకు రుణం పొందవచ్చు.

- రుణ బ్యాలెన్స్ పైనే వడ్డీ రేటు.

- ప్రాసెసింగ్ ఛార్జీలు తక్కువ

- అతి తక్కువ డాక్యుమెంటేషన్

- తెలియని ఖర్చులు లేవు

- రెండోసారి రుణ కేటాయింపు ఉంటుంది.

- రుణానికి సెక్యూరిటీ లేదా హామీ అవసరం లేదు

రుణ అర్హత

రుణ అర్హత

ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఉన్న వ్యక్తులు అయి ఉండాలి. కనీసం నెల ఆదాయం రూ.15,000 ఉండాలి.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లేదా పార్షల్ ప్రభుత్వాల సర్వీస్ అయి ఉండాలి.

సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, లాభాలు ఆర్జించే రాష్ట్ర పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉద్యోగులు అయి ఉండాలి.

ప్రముఖ జాతీయ విద్యా సంస్థల ఉద్యోగులై ఉండాలి.

కనీస రుణ మొత్తం రూ.25,000. గరిష్టం రూ.20 లక్షలు.

English summary

ఒక్క మిస్డ్ కాల్‌తో SBI నుండి రూ.25 లక్షల రుణం: అర్హులెవరు.. ఇలా చేయండి | Give a Missed Call To Get Cheapest and Quickest Loan from SBI

The SBI has come out with a new Xpress Credit personal loan facility for when customers need an instant loan with quick approval. Whether it’s a wedding or a vacation, unplanned emergency or planned purchase, SBI customers can now get quick approval and instant disbursal with minimal documentation through SBI’s Xpress Credit Personal Loan.
Story first published: Wednesday, February 17, 2021, 14:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X