For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 నిమిషాల్లో పాన్‌కార్డు పొందవచ్చు ఇలా.. అది కూడా ఉచితంగా

|

పాన్ కార్డును తీసుకోవాలనుకుంటున్నారా? ఇందుకు పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కొద్ది నిమిషాల్లోనే మీరు పాన్ కార్డును పొందే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఆధార్, పాన్ కార్డు వంటివి ఇప్పుడు ఎంతో అవసరం. పాన్ కార్డు కనుక లేకపోతే బాధపడవలసిన అవసరం లేదు. రోజుల కొద్ది వేచి చూడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ కింది పద్ధతి ద్వారా నిమిషాల్లో పాన్ కార్డును పొందవచ్చు.

టేక్ హోం శాలరీ తగ్గుతుంది, కంపెనీలకు భారం: కొత్త వేతన చట్టం వద్దేవద్దు!టేక్ హోం శాలరీ తగ్గుతుంది, కంపెనీలకు భారం: కొత్త వేతన చట్టం వద్దేవద్దు!

త్వరగా పాన్ కార్డు తీసుకునేలా..

త్వరగా పాన్ కార్డు తీసుకునేలా..

ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వాలు అన్నింటా వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఆన్‌లైన్ ద్వారా వెసులుబాటు కల్పిస్తున్నాయి. కరోనా కారణంగా చాలామంది బయటకు వెళ్లేందుకు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పాన్ కార్డును ఈజీగా తీసుకునే సేవలను తీసుకొచ్చినట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఆదాయపన్ను శాఖ త్వరితగతిన పాన్ కార్డు పొందే సేవల్ని ప్రారంభించింది.

ఇలా పాన్ కార్డును పొందండి

ఇలా పాన్ కార్డును పొందండి

- https://www.incometaxindiaefiling.gov.in/home వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.

- హోం పేజీలోనే క్విక్ లింక్స్‌లో Instant PAN through Aadhaar ఆప్షన్ కనిపిస్తుంది.

- దీనిపైన క్లిక్ చేస్తే కొత్తగా పేజీ ఓపెన్ అవుతుంది.

- అక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. కొత్త పాన్ కార్డు కోసం Get New PAN, స్టేటస్ లేదా డౌన్ లోడ్ కోసం Check Status/Download PAN ఆప్షన్స్ ఉంటాయి.

- Get New PAN పైన క్లిక్ చేయాలి.

- కొత్త లింక్ ఓపెన్ అయి, అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది.

- ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, కాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత I confirm పైన క్లిక్ చేయాలి.

- రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. వెరిఫికేషన్ కోసం ఉపయోగించాలి.

ఛార్జీ అవసరం లేదు

ఛార్జీ అవసరం లేదు

Instant PAN through Aadhaar కింద ఆధార్ కార్డు ద్వారా ఇ-పాన్ కార్డు ఇచ్చేందుకు దాదాపు 10 నిమిషాలు పడుతుంది. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ ఆప్షన్ ద్వారా పాన్‌కార్డులు జారీ చేసింది. పాన్ కార్డును NSDL, UTITSL వెబ్‌సైట్ ద్వారా కూడా పొందవచ్చు. వీటి ద్వారా అయితే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే ఎలాంటి ఛార్జీలు అవసరం లేదు.

English summary

10 నిమిషాల్లో పాన్‌కార్డు పొందవచ్చు ఇలా.. అది కూడా ఉచితంగా | Get PAN Card Within Minutes & Free of Cost Through Aadhaar

PAN Card is one of the important documents to have with oneself in India for making any sort of financial transaction. If you don’t have a pan card, worry not. You can get an e-PAN card issued within minutes for free using this method.
Story first published: Friday, December 25, 2020, 17:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X