For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LPG cylinder refil: గుడ్‌న్యూస్, ఒక్క మిస్డ్ కాల్‌తో కొత్త గ్యాస్ కనెక్షన్

|

ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ బుకింగ్ సౌకర్యాన్ని ఎప్పటికప్పుడు సౌకర్యవంతం చేస్తున్నాయి దేశీయ చమురు రంగ మార్కెటింగ్ కంపెనీలు. ఇదివరకు గ్యాస్ బుకింగ్ కాస్త ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఒక ఫోన్ కాల్‌తో , వాట్సాప్ ద్వారా, మిస్డ్ కాల్ ద్వారా ఇలా వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నాయి. తాజాగా ఇండియా ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ తన కస్టమర్లకు ఓ శుభవార్తను అందించింది. ఈ ప్రభుత్వరంగ సంస్థ ఎల్పీజీ ఇండేన్ గ్యాస్ పేరుతో సిలిండర్ సరఫరా చేస్తోంది. ఇప్పుడు మిస్డ్ కాల్ ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే ఇండేన్ గ్యాస్ అందుబాటులోకి తెచ్చిన నెంబర్ ద్వారా మీరు ఏజెన్సీ వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు.

మీ డోర్ స్టెప్స్ వద్దకు...

మీ డోర్ స్టెప్స్ వద్దకు...

'మీ కొత్త ఇండేన్ ఎల్పీజీ కనెక్షన్ కేవలం మిస్డ్ కాల్ దూరంలోనే ఉంది. మీరు 8454955555 డయల్ చేయడం ద్వారా కొత్త ఎల్బీజీ కనెక్షన్ తీసుకోవచ్చు. మీ డోర్ స్టెప్స్ వద్దకే కనెక్షన్. అలాగే, ఎగ్జిస్టింగ్ ఇండేన్ గ్యాస్ కస్టమర్లు కూడా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా గ్యాస్ రీఫిల్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా గ్యాస్‌ను బుక్ చేసుకోవచ్చు'నని ఇండియన్ ఆయిల్ ట్వీట్ చేసింది.

మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బుకింగ్ ఇలా

మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బుకింగ్ ఇలా

- ఇప్పటికే మీరు ఇండేన్ గ్యాస్ కస్టమర్ అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం 8454955555 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి.

- కస్టమర్లు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా మిస్డ్ కాల్ ఇవ్వాలి.

- ఇండేన్ కేవలం గ్యాస్ రీఫిల్ కోసమే కాకుండా, కొత్త ఎల్పీజీ కనెక్షన్ కోసం కూడా మిస్డ్ కాల్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇదే నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా కనెక్షన్ తీసుకోవచ్చు.

- మిస్డ్ కాల్ ఆప్షన్ ద్వారా కస్టమర్లకు ప్రయోజనాలు ఉంటాయి.

- మిస్డ్ కాల్ ఆఫ్షన్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ రీఫిల్లింగ్ సజావుగా బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.

- మిస్డ్ కాల్ ద్వారా బుకింగ్ లేదా కొత్త కనెక్షన్ తీసుకునే సౌకర్యం ద్వారా కస్టమర్లకు కాల్ పైన ఉండవలసిన అవసరం లేదు.

- మిస్డ్ కాల్ సిస్టంలో కస్టమర్లకు ఒక్క పైసా ఛార్జీ ఉండదు.

- ఇతర సేవలను వినియోగించుకునేటప్పుడు IVRS కాల్స్ కోసం మాత్రం చెల్లించవలసి ఉంటుంది.

- IVRS నైపుణ్యం లేని వ్యక్తులకు మిస్డ్ కాల్ సౌకర్యం ఉత్తమం.

- ఉదాహరణకు IVRS సదుపాయన్ని ఉపయోగించడంలో సమస్యలు ఎదుర్కొనే వృద్ధులు మిస్డ్ కాల్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

- మిస్డ్ కాల్ వెసులుబాటు ద్వారా గ్రామీణ గ్యాస్ వినియోగదారులకు కూడా ఈజీ అవుతుంది.

- మిస్డ్ కాల్ ద్వారా ఎల్పీజీ రీఫిల్లింగ్ బుకింగ్ సేవలను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జనవరి 2021లో ప్రారంభించారు.

వాట్సాప్ ద్వారా...

వాట్సాప్ ద్వారా...

ఇదిలా ఉండగా, ఇప్పటికే వాట్సాప్‌లో రిజిస్టర్ అయిన వినియోగదారులకు రీఫిల్ అని టైప్ చేసి సెండ్ చేయగానే గ్యాస్ బుకింగ్ చేస్తున్నారు. అలాగే, బయటకు వచ్చి కొత్త కాపురం పెట్టే వారికి ఎలాంటి చిరునామా ధ్రువీకరణపత్రం లేకుండానే గ్యాస్ కనెక్షన్ ఇవ్వనున్నారు.

English summary

LPG cylinder refil: గుడ్‌న్యూస్, ఒక్క మిస్డ్ కాల్‌తో కొత్త గ్యాస్ కనెక్షన్ | Get LPG cylinder refilled by just giving a missed call

“Your new Indane LPG connection is only a Missed Call away! Dial 8454955555 and get an LPG connection at your doorsteps. Existing Indane customers can book a refill by giving us a missed call from their registered phone number,” Indian Oil has tweeted.
Story first published: Monday, August 9, 2021, 8:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X