i
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేమెంట్ నుండి ల్యాండ్‌లైన్ గ్యాస్ ధర వరకు, ఆ యాప్స్‌పై ఛార్జీ: జనవరి 1 నుండి ఇవి మారుతున్నాయి

|

కొత్త ఏడాదిలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. జనవరి 1, 2021 నుండి చెక్కు పేమెంట్స్, ఎల్పీజీ సిలిండర్ ధరలు, జీఎస్టీ నుండి యూపీఐ ట్రాన్సాక్షన్స్ వరకు పలు కీలక మార్పులు ఉండనున్నాయి. దైనందిన జీవితంలో ఉపయోగించే లేదా ప్రభావంపడే ఈ మార్పుల గురించి తెలుసుకోవడం అవసరం. జనవరి 1 నుండి మారే కొన్ని అంశాలు తెలుసుకుందాం..

చెక్కు మోసాలకు ఇలా చెక్: ఆర్బీఐ పాజిటివ్ పే ఏమిటి, ఎలా పని చేస్తుంది?

చెక్కు చెల్లింపుల్లో మార్పులు

చెక్కు చెల్లింపుల్లో మార్పులు

RBI పాజిటివ్ పే సిస్టంను ప్రవేశపెడుతోంది. కొత్త నిబంధనల ప్రకారం చెక్కులు జారీ చేసే వ్యక్తి చెక్కు తేదీని ఎలక్ట్రానిక్ పద్ధతిలో గ్రహీత పేరు, చెల్లింపు మొతతాన్ని తిరిగి చేయవలసి ఉంటుంది. చెక్కు జారీ చేసే వ్యక్తి ఎస్సెమ్మెస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా ఈ సమాచారాన్ని అందించవచ్చు. చెక్ చెల్లింపుకు ముందు ఈ వివరాలను బ్యాంకు సిబ్బంది క్రాస్ చెక్ చేస్తారు. రూ.50,000కు పైగా ఉన్న చెక్కుల్ని అవసరమైన సమాచారం కోసం మళ్లీ నిర్ధారించనున్నారు. ఈ విధానంతో చెక్కు చెల్లింపులు మరింత సురక్షితం కానున్నాయి. రూ.5 లక్షలకు మించిన చెక్కులపై తప్పనిసరి చేయాలని బ్యాంకులకూ సూచించింది.

ట్రాన్సాక్షన్స్ పరిమితి పెంపు

ట్రాన్సాక్షన్స్ పరిమితి పెంపు

- కాంటాక్ట్‌లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రోత్సహించేందుకు RBI చెల్లింపుల పరిమితిని పెంచనుంది. ఈ నిబంధన కూడా 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుతమున్న రూ.2,000 ట్రాన్సాక్షన్ పరిమితిని రూ.5,000కు పెంచనుంది.

ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేయాలంటే..

ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేయాలంటే..

ల్యాండ్ లైన్ నుంచి మొబైల్‌కు ఫోన్ చేయాలంటే జనవరి 1 నుండి నెంబర్‌కు ముందు జీరోను జత చేయాల్సి ఉంటుంది. ట్రాయ్ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. టెలికం రంగంలో ఎక్కువ నెంబర్లను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఫాస్టాగ్ తప్పనిసరి

ఫాస్టాగ్ తప్పనిసరి

టోల్ చెల్లింపులను నగదురహితం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. జనవరి 1వ తేదీ నుండి టోల్ గేట్ల వద్ద 100 శాతం వసూళ్లను ఫాస్టాగ్ ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం టోల్ చెల్లింపుల్లో దాదాపు 75 శాతం ఫాస్టాగ్స్ ద్వారా జరుగుతున్నాయి. ఒక లైన్‌లో మాత్రమే నగదు రూపంలో చెల్లింపులకు అనుమతి ఉంది. వచ్చే ఏడాది ప్రారంభం నుండి వంద శాతం ఫాస్టాగ్ ఉండే అవకాశముంది. అంటే నగదు తీసుకునే అవకాశం లేదు. కాబట్టి వాహనదారులు ముందే జాగ్రత్తపడటం మంచిది. అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి.

జీఎస్టీ రిటర్న్స్

జీఎస్టీ రిటర్న్స్

రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారాలు ప్రస్తుతం ట్రేడర్లు ఏడాదికి 12 రిటర్న్స్ దాఖలు చేయడానికి బదులు జనవరి1 నుంచి 4 జీఎస్టీ సేల్స్ రిటర్న్స్ దాఖలు చేస్తే చాలు. కొత్త రూల్స్ అమల్లోకి వచ్చినప్పటి నుండి పన్ను చెల్లింపుదారులు కేవలం 8 రిటర్న్స్ మాత్రమే దాఖలు చేయవచ్చు. ఇందులో 4 జీఎస్టీఆర్ 3జీ, 4 జీఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఉంటాయి. ఇది లక్షలాది మంది జీఎస్టీ చెల్లింపుదారులకు ఊరట.

ఇంకా ఈ 5 కూడా...

ఇంకా ఈ 5 కూడా...

- చమురు రంగ సంస్థలు ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ ధరలను సవరిస్తారు. ఇందులో భాగంగా జనవరి 2021న సవరించనున్నారు.

- గూగుల్ తన పేమెంట్ అప్లికేషన్ గూగుల్ పే వెబ్ యాప్‌ను జనవరి 1 నుండి నిలిపివేయనుందని తెలుస్తోంది. గూగుల్ పే ఇన్‌స్టంట్ మనీ ట్రాన్సుఫర్ పేమెంట్ సిస్టంను తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ఇలా మనీ ట్రాన్సుఫర్ చేసే సమయంలో ఛార్జీలు చెల్లించాలి. దీనిపై గూగుల్ స్పందించాల్సి ఉంది.

- అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే నుండి ట్రాన్సాక్షన్స్ పైన కస్టమర్లు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1వ తేదీ నుండి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు నిర్వహిస్తున్న యూపీఐపై అదనపు ఛార్జీ విధించాలని NPCI భావిస్తోందని, కొత్త ఏడాది నుండి థర్డ్ పార్టీ యాప్స్ పైన 30 శాతం పరిమితిని విధించింది.

- మహీంద్రా, మారుతీ సుజుకీ వాహనాల ధరలు జనవరి 1వ తేదీ నుండి పెరగనున్నాయి.

- జనవరి 1వ తేదీ నుండి కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్ 4.0.3, ఐఫోన్ ఐవోఎస్ 9 కంటే పాత ఆఫరేటింగ్ సిస్టంపై పని చేస్తున్న మొబైల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిపివేస్తుంది. వాట్సాప్ కొత్తగా తీసుకు వస్తున్న ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు వినియోగదారులు కొత్త ఆపరేటింగ్ సిస్టంను ఉపయోగించాలని వాట్సాప్ తెలిపింది.

English summary

From cheque and UPI payment to GST, these 10 rules are changing from January 1

Many rules ranging from Cheque payment, LPG Cylinder prices, GST to UPI Transaction payment that have a major impact in the lives of common man are going to change from January 1.
Story first published: Sunday, December 20, 2020, 14:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X