For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూపీఐ యాప్‌తో స్కాన్ చేయండి, ఏటీఎం నుండి డబ్బు తీసుకోండి! ఎలా పని చేస్తుందంటే

|

ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్(ATM)ను దాదాపు సగం వరకు కంట్రోల్ చేసే NCR కార్పోరేషన్ మొదటి యూపీఐ ఆధారిత ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ ఏటీఎంలను ఆవిష్కరించింది. ఎన్సీపీఐ, సిటీ యూనియన్ బ్యాంకులతో కలిసి యూపీఐ ఆధారిత ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాల్ (ICCW)ను ఆవిష్కరించింది. ఈ సౌకర్యాన్ని 1500 ఏటీఎం కేంద్రాల్లో అప్ గ్రేడ్ చేసింది. యూపీఐ యాప్ నుండి ఇది మరో సరికొత్త ఆవిష్కరణ. అంటే యూపీఐ యాప్ పైన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఏటీఎం నుండి డబ్బులను ఉపసంహరించుకోవచ్చు.

అప్ గ్రేడ్

అప్ గ్రేడ్

సాధారణంగా ఏటీఎం మెషీన్‌లో ఏటీఎం లేదా డెబిట్ కార్డును ఉంచి మనీ ఉపసంహరిస్తారు. అయితే ఇప్పుడు డెబిట్ కార్డుకు బదులు భీమ్, పేటీఎం, గూగుల్‌పే వంటి UPI ఆధారిత యాప్స్‌ను కలిగిన మొబైల్ ఫోన్లను ఉపయోగించి నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇదే ఈ ఏటీఎం ప్రత్యేకత. ఏటీఎం మిషన్‌ను అప్ గ్రేడ్ చేస్తే ఏ బ్యాంకు అయినా యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణను కల్పించవచ్చు.

రూ.5,000 పరిమితి

రూ.5,000 పరిమితి

ప్రస్తుతం యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణ పరిమితి రూ.5,000గా ఉంది. అయితే ముందు ముందు ఈ పరిమితిని పెంచే అవకాశం ఉంది. ఇది యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణ అని, కానీ ఎలాంటి అదనపు రెగ్యులేటరీ లేదా ఎన్సీపీఐ పర్మిషన్ అవసరం లేదని తెలిపింది. ఇది యూపీఐ యాప్ ఎక్స్‌టెన్షన్ మాత్రమేనని వెల్లడించింది.

కాపీ చేయడం కుదరదు

కాపీ చేయడం కుదరదు

ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకునేందుకు కస్టమర్లు ఏటీఎంలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ మొబైల్ యాప్ నుండి లావాదేవీకి అనుమతిస్తే సరిపోతుంది. ఈ క్యూఆర్ కోడ్ ఎప్పుడు ఒకేలా ఉండకుండా ప్రతి ట్రాన్సాక్షన్‌కు మారుతుంది. కాబట్టి దీనిని ఎవరు కాపీ చేయలేరు. దీంతో ట్రాన్సాక్షన్స్ నిర్వహణలో సెక్యూరిటీ ఉంటుంది. క్యూఆర్ ఆధారిత ఉపసంహరణకు సంబంధించి వివిధ బ్యాంకులతో NCR కార్పొరేషన్, NPCI చర్చలు జరుపుతున్నాయి.

English summary

యూపీఐ యాప్‌తో స్కాన్ చేయండి, ఏటీఎం నుండి డబ్బు తీసుకోండి! ఎలా పని చేస్తుందంటే | First cardless ATM facility launched: Scan QR codes on UPI app and withdraw money

NCR Corporation, the maker of automated teller machines (ATMs) said that it has launched the first interoperable cardless cash-withdrawal (ICCW) solution based on the Unified Payments Interface (UPI) platform.
Story first published: Sunday, April 4, 2021, 13:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X