For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేమెంట్ కోసం 'ఫేస్‌బుక్ పే': ఎలా ఉపయోగించాలంటే...?

|

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం పేస్‍‌బుక్ కొత్త సాధనాన్ని అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఆన్ లైన్ చెల్లింపుల సేవల కోసం 'ఫేస్‌బుక్ పే'ను తీసుకు వచ్చింది. ప్రజలు సులభంగా, సురక్షితంగా చెల్లింపులు జరిపేందుకు వీలుగా తాము ఈ సేవను ప్రారంభిస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది.
'ఫేస్‌బుక్ పే' ద్వారా కొనుగోళ్లు, చెల్లింపులు జరపవచ్చునని తెలిపింది. అలాగే విరాళాలు, నగదు లావాదేవీలను కూడా చేసుకోవచ్చునని ఫేస్‌బుక్ తెలిపింది. దీనిని ఫేస్‌బుక్‌తో పాటు మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో కూడా వినియోగించుకోవచ్చునని తెలిపింది.

రూ.5 బిస్కట్ కూడా కొనడం లేదా?: బ్రిటానియా లాభం రూ.403 కోట్లురూ.5 బిస్కట్ కూడా కొనడం లేదా?: బ్రిటానియా లాభం రూ.403 కోట్లు

'ఫేస్‌బుక్ పే' వినియోగం

'ఫేస్‌బుక్ పే' వినియోగం

- 'ఫేస్‌బుక్ పే' ఉపయోగించాలంటే తొలుత మీ ఫేస్‌బుక్ ఖాతాలోని సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.

- అక్కడ 'ఫేస్‌బుక్ పే' అనే ఆప్షన్ ఉంటుంది. దానిని సెలక్ట్ చేసుకోవాలి.

- ఆ తర్వాత పేపాల్ లేదా మీకు ఇష్టమైన ఇతర చెల్లింపుల విధానాన్ని ఎంచుకోవాలి. అనంతరం యాడ్ చేసుకోవాలి.

- 'ఫేస్‌బుక్ పే' దాదాపు అన్ని పెద్ద బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో, పేపాల్‌తో పని చేస్తుంది.

ఖర్చులు తెలుసుకోవచ్చు

ఖర్చులు తెలుసుకోవచ్చు

మనం ఎక్కడ ఖర్చు చేస్తున్నాం, ఎలా ఖర్చు చేస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నామో దీని ద్వారా తెలుసుకోవచ్చు. 'ఫేస్‌బుక్ పే' ఉపయోగించాలంటే ఫేస్‌బుక్ ఖాతా తప్పనిసరి.

- త్వరలో ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్, వాట్సాప్‌లలో ఇది అందుబాటులోకి వచ్చినప్పుడు ఫేస్‍‌బుక్ అకౌంటుతో పని ఉండదని ఫేస్‌బుక్ తెలిపింది.

పిన్ లేదా బయోమెట్రిక్స్ ఆప్షన్ ద్వారా

పిన్ లేదా బయోమెట్రిక్స్ ఆప్షన్ ద్వారా

ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఎవరు కూడా డబ్బులు జేబుల్లో పెట్టుకొని తిరగడం లేదు. ఏది కొనుగోలు చేసినా కార్డు స్వైపింగ్, దానిని దాటి డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్ కోసం ఎన్నో యాప్స్ వచ్చాయి. ఇప్పటికే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వచ్చాయి. ఇప్పుడు 'ఫేస్‌బుక్ పే' అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్లలో పిన్ లేదా బయోమెట్రిక్స్ వంటి ఆప్షన్ ద్వారా డబ్బు పంపించడానికి లేదా చెల్లించడానికి ఈ యాప్ అనుమతిస్తుంది.

ట్రాన్సాక్షన్ జరిపేటప్పుడు వివరాలు..

ట్రాన్సాక్షన్ జరిపేటప్పుడు వివరాలు..

ట్రాన్సాక్షన్ జరిపినప్పుడు చెల్లింపు విధానం, తేదీ, బిల్లింగ్, ఫోన్ నెంబర్ వంటి సమాచారం అడుగుతుంది. వాటిని ఎంటర్ చేస్తే ఈజీగా ఫేస్ బుక్ నుంచి డబ్బులు చెల్లించవచ్చు లేదా స్వీకరించవచ్చు. ఈ కొత్త ఫీచర్ అమెరికాలో ఈ వారం అందుబాటులో ఉంటుంది.

English summary

పేమెంట్ కోసం 'ఫేస్‌బుక్ పే': ఎలా ఉపయోగించాలంటే...? | Facebook unites payment service across apps with Facebook Pay

Facebook Inc on November 12 launched Facebook Pay, its unified payment service, through which users across its platforms including WhatsApp and Instagram can make payments without exiting the app.
Story first published: Wednesday, November 13, 2019, 12:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X