For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఈ నెలాఖరులోగా వడ్డీ జమ: ఇలా చెక్ చేయండి

|

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ వడ్డీ రేటును స్థిరంగా ఉంచుతూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంగీకరించింది. ఈ నెల చివరి నాటికి 8.5 శాతం ఈపీఎఫ్ వడ్డీ రేటు క్రెడిట్ అయ్యే అవకాశముంది. రిటైర్మెంట్ ఫండ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్ల అకౌంట్స్‌లో వేయాలని నిర్ణయించింది. కాబట్టి ఈ నెల ముగిసే ఏదైనా బిజినెస్ డేన 8.5 శాతం వడ్డీ క్రెడిట్ అవుతుంది. ఈపీఎఫ్ఓ వినియోగదారులు తమ ఈపీఎఫ్ఓ మొత్తాన్ని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఎస్సెమ్మెస్ ద్వారా

ఎస్సెమ్మెస్ ద్వారా

EPF చందాదారుడు తన పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తాన్ని ఎస్సెమ్మెస్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుసుకోవచ్చు. 7738299899 ఎస్సెమ్మెస్ పంపించడం ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ మొత్తాన్ని తెలుసుకోవచ్చు. వారు చేయవలసిందల్లా EPFOHO UAN ENG అని టైప్ చేసి పంపించాలి. అందుబాటులో ఉన్న మీ మాతృభాషను కూడా ఎంచుకోవచ్చు. HIN అంటే హిందీ, MAR అంటే మరాఠీ, TAM అంటే తమిళం. పైన కోడ్స్ టైప్ చేసి 7738299899 రిజిస్టర్డ్ మొబైల్ నుండి ఎస్సెమ్మెస్ పంపించాలి.

మిస్డ్ కాల్ ద్వారా

మిస్డ్ కాల్ ద్వారా

మిస్డ్ కాల్ ద్వారా కూడా పీఎఫ్ అకౌంట్లోని మొత్తం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్‌కు ముందు కేవైసీ వివరాలు అప్ డేట్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఈపీఎఫ్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి. అప్పుడే మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాదారు 011-22901406 అని డయల్ చేయడం ద్వారా లేదా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఈపీఎఫ్ ఖాతాను తనిఖీ చేయవచ్చు. ఈ సేవ ఉచితం.

ఆన్ లైన్ ద్వారా...

ఆన్ లైన్ ద్వారా...

మీ పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. మీ యజమని అప్రూవల్, వెరిఫైడ్ చేసిన యూఏఎన్ నెంబర్‌ను నిర్ధారించుకోవాలి. ఆన్ లైన్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తాన్ని ఇలా చెక్ చేయండి..

- https://www.epfindia.gov.in/site_en/For_Employees.php వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.

- Services డ్రాప్ మెను కింద For Employees పైన క్లిక్ చేయాలి.

- Services సెక్షన్‌లో Member Passbook పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీరు లాగ్-ఇన్ పేజీలోకి రీడైరెక్ట్ అవుతారు.

- అక్కడ మీ UAN, పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.

- సైన్-ఇన్ అవుతారు.

- సైన్-ఇన్ అయ్యాక మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇతర అకౌంట్ సంబంధ సేవలు కూడా అందుకోవచ్చు.

English summary

PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఈ నెలాఖరులోగా వడ్డీ జమ: ఇలా చెక్ చేయండి | EPF subscribers to get 8.5 percent interest in July month

The Employees' Provident Fund Organization (EPFO) has agreed to keep the EPF interest rate steady for the fiscal year 2020-21 and is likely to credit 8.5 per cent EPF interest by the end of this month.
Story first published: Monday, July 26, 2021, 18:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X