For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అకౌంట్లోకి EPF వడ్డీ రేటు, మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఈ 4 మార్గాల్లో చెక్ చేసుకోండి

|

ఉద్యోగుల పీఎఫ్ వడ్డీ రేటు పెంపు అనంతరం 21.28 కోట్ల అకౌంట్లకు 8.5 శాతం వడ్డీ చొప్పున వడ్డీ జమ చేసినట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తెలిపింది. నివేదిక ప్రకారం వచ్చే నెలాఖరు నాటికి ఆరు కోట్ల మంది ఖాతాదారులు ప్రయోజనం పొందుతారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈపీఎఫ్ఓ సోమవారం 21.38 కోట్ల ఖాతాలకు 8.50 శాతం వడ్డీ చొప్పున ఫండ్ క్రెడిట్ అయినట్లు ట్వీట్ చేసింది.

కరోనా నేపథ్యంలో వడ్డీ రేటును స్థిరంగా కొనసాగించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. FY2020-21లో వడ్డీ రేటు ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఉంది. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు క్రెడిట్ నేపథ్యంలో ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓకు చెందిన ఈ-సేవా వెబ్ సైట్, ఎస్సెమ్మెస్, మిస్డ్ కాల్ వంటి వాటి ద్వారా మీ పీఎఫ్ మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు.

ఈ-సేవా పోర్టల్

ఈ-సేవా పోర్టల్

- ఈపీఎఫ్ఓకు చెందిన పోర్టల్ ఈ-సేవా పోర్టల్ ద్వారా మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇందుకు మీ యాక్టివేటెడ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్(UAN) అవసరం.

- ఈ పోర్టల్ ద్వారా మీరు ఈ-పాస్ బుక్‌ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

- www.epfindia.gov.in పోర్టల్‌లోకి లాగ్-ఇన్ కావాలి.

- Our Services మెనులోని For Employees ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

- Services ఆప్షన్ కింది Member Passbook పాస్ బుక్ పైన క్లిక్ చేయాలి.

- ఇక్కడ మీ యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్‌ను ఎంటర్ చేయాలి. యాక్టివేటెడ్ యూఏఎన్ నెంబర్ అవసరం.

- యూఏఎన్ నెంబర్ లేకుంటే epfoservices.in/epfo/ లింక్ పైన క్లిక్ చేయాలి.

- అక్కడ మీ పీఎఫ్ అకౌంట్ నెంబర్, మీ పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి, Submit పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది.

ఎస్సెమ్మెస్ ద్వారా

ఎస్సెమ్మెస్ ద్వారా

- ఎస్సెమ్మెస్ ద్వారా కూడా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

- 7738299899 నెంబర్‌కు 'EPFOHO UAN ENG' సందేశాన్ని పంపించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ENG అంటే మీ భాష. మీకు తెలుగులో సందేశం కావాలనుకుంటే TEL అని టైప్ చేయాలి. ఈ సేవలు పది వివిధ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

- ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమంటే మీ బ్యాంకు అకౌంట్, ఆదార్, పాన్ నెంబర్‌తో యూఏఎన్ నెంబర్‌ను సింక్ చేయాలి.

మిస్డ్ కాల్ ద్వారా

మిస్డ్ కాల్ ద్వారా

- 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

- అయితే ఇందుకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వాలి.

ఉమాంగ్ యాప్ ద్వారా

ఉమాంగ్ యాప్ ద్వారా

ఉమాంగ్ యాప్ ద్వారా కూడా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. వివిధ ప్రభుత్వ సేవల కోసం దీనిని ఉపయోగించవచ్చు. దీని ద్వారా ఈపీఎఫ్ పాస్ బుక్ చూడవచ్చు. మీ ప్రావిడెంట్ ఫండ్‌ను క్లెయిమ్ చేయవచ్చు. మీ క్లెయిమ్‌ను ట్రాక్ చేయవచ్చు. మీ మొబైల్ ద్వారా ఈ యాప్‌లోకి రిజిస్టర్ కావాలి.

English summary

అకౌంట్లోకి EPF వడ్డీ రేటు, మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఈ 4 మార్గాల్లో చెక్ చేసుకోండి | EPF Interest Credited, How to Check EPF Balance With UAN, Without UAN

Days after giving sanction to increased interest rates in provident fund account, retirement body Employees Provident Fund Organisation on Monday, November 29, announced that 21.28 crore accounts have been credited with the interest rate of 8.5 per cent for FY 2021-22.
Story first published: Wednesday, December 1, 2021, 12:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X