For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI అకౌంట్ ఉందా? డిపాజిట్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..

|

2020-21 ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా మీరు ఎంత వడ్డీ రేటును ఆర్జించారో డిపాజిట్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లు బ్యాంకు బ్రాంచీని సంద‌ర్శించ‌డం ద్వారా గానీ లేదా ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ ఈ స‌ర్టిఫికేట్‌ను పొంద‌వ‌చ్చు. కొద్ది క్లిక్స్ ద్వారా ఎస్బీఐ కస్టమర్లు దీనిని పొందవచ్చు. ఎస్బీఐ క్విక్ యాప్ ద్వారా కస్టమర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు

నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు

- తొలుత ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ కావాలి.

- మెయిన్ మెనూలో అందుబాటులో ఉండే ఈ-సర్వీసెస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

స్క్రీన్ పైన కనిపించే సేవల్లో మై-సర్టిఫికెట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

మీకు ఏ రకమైన ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ కావాలో ఎంచుకోవాలి. అంటే ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

అకౌంట్‌లో సేకరించిన లేదా డిడక్ట్ చేయబడిన వడ్డీని ఇక్కడ చూసుకోవచ్చు. సర్టిఫికెట్ కింద డౌన్ లోడ్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే సర్టిఫికెట్ డౌన్ లోడ్ అవుతుంది.

యాప్ ద్వారా...

యాప్ ద్వారా...

- ఎస్బీఐ కస్టమర్ యాప్‌ను ఓపెన్ చేయాలి. without login section లోకి వెళ్లాలి.

- ఎస్బీఐ కస్టమర్ Account Services లోకి వెళ్లాలి.

- Deposit Interest పైన క్లిక్ చేయాలి.

- కస్టమర్ వివరాలు ఇచ్చిన తర్వాత, పాస్ వర్డ్‌ను పెట్టుకోవాలి.

- కస్టమర్లు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే డిపాజిట్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు వస్తుంది.

వడ్డీ రేట్లు ఇలా

వడ్డీ రేట్లు ఇలా

ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన కనీసం 2.9 శాతం, గరిష్టంగా 5.4 శాతం వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తుంది. డిపాజిట్ కాల‌ప‌రిమితిపై ఆధార‌ప‌డి వ‌డ్డీ రేట్లు ఉంటాయి. 7 రోజుల నుండి 45 రోజుల డిపాజిట్ల‌పై 2.9 శాతం, 45 రోజుల నుండి 179 రోజుల ట‌ర్మ్ డిపాజిట్ల‌పై 3.9 శాతం, 180 రోజుల నుండి ఏడాది లోపు డిపాజిట్ల‌పై 4.4 శాతం, ఏడాది నుండి రెండేళ్ల డిపాజిట్ల‌పై 5 శాతం, రెండు నుండి మూడేళ్ల లోపు కాల‌ప‌రిమితి డిపాజిట్ల‌పై 5.1 శాతం, మూడేళ్ల నుండి అయిదేళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ల‌పై 5.3 శాతం, 5 సంవత్సరాల నుండి 10 సంవ‌త్స‌రాల ట‌ర్మ్ డిపాజిట్ల‌పై 5.4 శాతం వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తుంది.

English summary

SBI అకౌంట్ ఉందా? డిపాజిట్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా.. | Download Deposit Interest Certificate Online, Follow these simple steps

SBI customers can get their deposit interest certificate either by visiting their bank branch or by downloading the same from internet banking.
Story first published: Thursday, June 24, 2021, 14:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X