For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎప్పుడు అవసరం? ఆ విషయంలో జాగ్రత్త, అలా రెండో క్రెడిట్ కార్డుకు దూరంగా ఉండండి

|

క్రెడిట్ కార్డు.. ఆర్థిక సంస్థలు జారీ చేసే కార్డు ఇది. మీ అకౌంట్లో డబ్బులు ఉంటే ఉపయోగపడేది డెబిట్ కార్డు. ఇది బ్యాంకు అకౌంట్ ఉన్న అందరు కస్టమర్లకు దాదాపు ప్రతి బ్యాంకు ఇష్యూ చేస్తుంది. కానీ ఆర్థిక సంస్థలు వారి వారి నిబంధనల మేరకు అర్హత కలిగిన వ్యక్తులకు ఇచ్చేదే క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డును ఉపయోగించే పద్ధతిలో ఉపయోగిస్తే అంతకు మించిన ప్రయోజనం లేదు. కానీ ఒక్క పొరపాటు చేసినా, అంతకు మించిన ఆర్థిక నష్టం ఉండదు! అందుకే క్రెడిట్ కార్డును చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇది ఎలాంటి రుణం లేకుండానే ఆయా కార్డు ఆధారంగా డబ్బును అప్పుగా తీసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్, హిస్టరీ ఆధారంగా కార్డు జారీ చేసే సంస్థ ద్వారా మీ క్రెడిట్ పరిమితి నిర్ణయించబడుతుంది. సాధారణంగాక్రెడిట్ స్కోర్ ఎక్కువగా, క్రెడిట్ హిస్టరీ మెరుగ్గా ఉంటే పరిమితి ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మధ్య ముఖ్యమైన తేడా ఏమంటే డెబిట్ కార్డు ద్వారా మీ అకౌంట్‌లోని డబ్బులు డెబిట్ అవుతాయి. అంటే అకౌంట్లో డబ్బులు ఉంటేనే ఉపయోగం. క్రెడిట్ కార్డు అయితే ఆ కార్డు పరిమితి మేరకు అకౌంట్లో డబ్బు లేకున్నా ప్రయోజనం పొందవచ్చు. ఒకవిధంగా ఇది ఓ రుణం అని చెప్పవచ్చు.

ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండాలంటే

ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండాలంటే

నేటి ప్రపంచంలో క్రెడిట్ కార్డు అవసరమైన సాధనం. క్రెడిట్ కార్డు ద్వారా వడ్డీ లేని రుణాన్ని పొందవచ్చు. క్రెడిట్ కార్డు అంటే స్వల్పకాలిక రుణం తీసుకోవడం. క్రెడిట్ కార్డును సక్రమంగా వినియోగిస్తే మంచి క్రెడిట్ హిస్టరీ, స్కోర్‌ను నిర్మించడంలో సాయపడుతుంది. అదనపు రివార్డ్స్, క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్స్ ఉంటాయి. మీ ఇంటి అవసరాల కోసం ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా షాపింగ్ చేయవచ్చు. బిల్లులు, యుటిలిటీ చెల్లింపులు చేయవచ్చు. ఫీజులు, సబ్‌స్క్రిప్షన్ వరకు ఎంత ఖర్చయినా క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించడం ద్వారా చేయవచ్చు. క్రెడిట్ కార్డు ఉపయోగం సులభమే కాకుండా, ప్రయోజనకరం. అయితే ఇలాంటి క్రెడిట్ కార్డులు ఎన్ని ఉండాలి అనే ప్రశ్న మదిలో ఉండవచ్చు. ఇందుకు కొన్ని సమాధానాలు కింద చూడవచ్చు.

ఒకటికి మించి కార్డులుంటే ప్రయోజనం

ఒకటికి మించి కార్డులుంటే ప్రయోజనం

ఒకటికి మించి క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఎక్కువ మార్గాల్లో రివార్డ్స్ పొందవచ్చు. అయితే క్రెడిట్ కార్డును సక్రమంగా వినియోగిస్తేనే ప్రయోజనకరం లేదంటే ఆర్థికంగా ఎక్కువ నష్టం జరుగుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డును వినియోగిస్తే గడువులోగా చెల్లింపులు చేయడం చాలా ముఖ్యమైన విషయం. గడువు దాటితే మాత్రం అప్పుడు చక్రవడ్డీ వసూలు ఉంటుంది. కాబట్టి ఒక క్రెడిట్ కార్డు ఉన్నా, రెండు అంతకుమించి ఉన్నా గడువులోగా చెల్లింపులు చేయాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

- ఒకటికి మించి క్రెడిట్ కార్డ్స్ ఉంటే మీకు ఎక్కువ క్రెడిట్ పరిమితి ఉంటుంది. సాధారణంగా నో-ఫ్రిల్స్ కార్డు రూ.1 లక్ష వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తుంది. అయితే వాటిలో రెండింటితో మీరు యాక్సెస్ చేయగల మొత్తం రూ.2 లక్షలు అవుతుంది. రూ.75,000 కంటే తక్కువ క్రెడిట్ పరిమితి కలిగి ఉన్నప్పటికీ మీకు రూ.1.5 లక్షల పరిమితి ఉంటుంది. హఠాత్తుగా ఆసుపత్రిపాలయితే లేదా ఇతర అనుకోని ఖర్చులు వస్తే లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. అలాంటి సమయంలో ఇది ప్రయోజనకరం.

వినియోగం విషయంలో జాగ్రత్త

వినియోగం విషయంలో జాగ్రత్త

- క్రెడిట్ కార్డును వినియోగించే సమయంలో అత్యవసరమైతే తప్పు ఓ కార్డు పైన 40 శాతం కంటే ఎక్కువగా వినియోగించడం మానివేయాలి. అయితే ఒక క్రెడిట్ కార్డుతో ఈ రేషియోను నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో 80 శాతం నుండి 90 శాతం క్రెడిట్ లిమిట్‌కు చేరుకోవచ్చు. అలాంటప్పుడు మీకు అలర్ట్ మెసేజ్‌లు వస్తాయి. క్రెడిట్ కార్డ్ అధిక వినియోగం మీకు అధిక రిస్క్ అని చెప్పవచ్చు. అదనపు కార్డు అంటే అధిక క్రెడిట్ పరిమితి. కాబట్టి నిర్వహణ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ వినియోగ నిష్పత్తిని 30 శాతం దాటకుండా చూసుకోవాలి.

క్రెడిట్ స్కోర్ మెరుగు

క్రెడిట్ స్కోర్ మెరుగు

తక్కువ క్రెడిట్ పరిమితి వినియోగ నిష్పత్తితో మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. భవిష్యత్తులో మీరు పెద్ద రుణాలకు అర్హులు అవుతారు. మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉంటే మీ క్రెడిట్ యోగ్యత పెరుగుతుంది. ఇది మంచి ఫైనాన్షియల్ డీల్‌కు ఉపయోగపడుతుంది. కొనుగోళ్లు, చెల్లింపులు విస్తరించడం, ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉన్నప్పటికీ వాటిని సజావుగా నిర్వహించడం వలన భవిష్యత్తులో బహుళశ్రేణి క్రెడిట్స్‌ను నిర్వహించడానికి మీకు తగినంత అభ్యాసం అవుతుందని కూడా చెప్పవచ్చు.

విభిన్న బిల్లింక్ సైకిల్స్ ద్వారా మీ రీ-పేమెంట్ టైమ్ స్పాన్ దాదాపు పదిహేను రోజులు ఉంటుంది. ఇలా ఒకే నెలలో రెండు కార్డ్స్ వినియోగిస్తున్నప్పుడు, చెల్లింపులు కూడా అలాగే ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ ఉపయోగం, బిల్లు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. క్రెడిట్ కార్డ్ పరిమితి లిమిట్ ఎక్కువగా కనిపిస్తే రెండో కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు సక్రమ వినియోగం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అవసరమైతేనే తీసుకోవడం మంచిది.

ఇలా అయితే దూరంగా ఉండండి

ఇలా అయితే దూరంగా ఉండండి

మీరు అప్పుల్లో ఉంటే, అదనపు క్రెడిట్ కార్డు మీ రుణ భారాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అదనపు క్రెడిట్ కార్డుకు దూరంగా ఉండాలి.

మీరు సమీప భవిష్యత్తులో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే హెల్తీ క్రెడిట్ స్కోర్ ఉండేలా చూసుకోవాలి. హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే కొత్తగా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోకపోవడం మంచిది.

ఫైనాన్షియల్ పరంగా మీరు డిసిప్లేన్‌గా లేకుంటే అదనపు క్రెడిట్ కార్డుకు దూరంగా ఉండటం మంచిది.

English summary

ఎప్పుడు అవసరం? ఆ విషయంలో జాగ్రత్త, అలా రెండో క్రెడిట్ కార్డుకు దూరంగా ఉండండి | Do you want second Credit Card, How should you get?

The ease of accessing an interest free short term borrowing through credit cards not only adds convenience to our lifestyle but a responsible usage of this facility helps build a good credit history and score.
Story first published: Monday, October 18, 2021, 16:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X