For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Savings Account: సేవింగ్స్ అకౌంట్ రకాలు, ఫీచర్స్, ప్రయోజనాలు

|

కస్టమర్ల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు ప్రత్యేక సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్లకు, పిల్లలకు, సాధారణ సేవింగ్స్ ఖాతాలు ఇలా వివిధ రకాలు ఉన్నాయి. సేవింగ్స్ ఖాతాలు సెక్షన్ 80టీటీఏ కింద రూ.10,000 వరకు పన్నురహిత వడ్డీ ప్రయోజనం కలిగి ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్ ఫీచర్స్, ప్రయోజనాలు, అందుబాటులోని సౌకర్యాలు, వివిధ సేవింగ్స్ ఖాతాలు తెలుసుకుందాం.

సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు

సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు

వేతనజీవులు తమ నెలవారీ వేతనాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయవచ్చు.

డిపాజిట్స్ పైన వడ్డీని పొందుతారు. సేవింగ్స్ ఖాతాలో వడ్డీని మూడు నెలలు లేదా ఆరు నెలలకు ఓసారి జమ చేస్తారు.

ఒక వ్యక్తి తన సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత కాలం డబ్బులు ఉంచాలనే పరిమితి లేదు.

సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటుంది. కస్టమర్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, ఫండ్ ట్రాన్సుఫర్ కోసం, చెక్కు బుక్ రిక్వెస్ట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

కస్టమర్లు తమ క్రెడిట్ కార్డును, డెబిట్ కార్డును ఉపయోగించి లేదా ఆన్ లైన్ మర్చంట్ వెబ్ సైట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

కస్టమర్లు తమ షార్ట్ టర్మ్ సేవింగ్స్‌ను చేసుకోవచ్చు.

సేవింగ్స్ అకౌంట్ ద్వారా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎన్‌రోల్ కావొచ్చు.

ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేయవచ్చు. కనీస పరిమితి లేదు.

వేతనం లేదా పెన్షన్ ఖాతాలు అయితే తాత్కాలిక ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు.

సేవింగ్స్ అకౌంట్ సౌకర్యాలు

సేవింగ్స్ అకౌంట్ సౌకర్యాలు

కస్టమర్లు బిల్లు పేమెంట్స్ చేయవచ్చు. మొబైల్స్ రీచార్జ్ చేయవచ్చు. డీటీహెచ్ టాప్-అప్స్ వంటివి వేసుకోవచ్చు.

నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ సౌకర్యం ద్వారా ఫండ్ ట్రాన్సుఫర్ చేయవచ్చు.

దేశవ్యాప్తంగా ఏటీఎంల నుండి ఉపసంహరణ చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా ఉత్పత్తులను పర్చేజ్ చేయవచ్చు.

ఈ-బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయవచ్చు.

సేవింగ్స్ అకౌంట్ ద్వారా కస్టమర్లు తమ ఈఎంఐ పే చేయవచ్చు. డ్యూస్ క్లియర్ చేయవచ్చు.

ట్రాన్సాక్షన్ వివరాలు చెక్ చేసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు.

మనీ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం, షాపింగ్ టెర్మినల్స్ వద్ద డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వినియోగం, ఉచిత ఏటీఏం ట్రాన్సాక్షన్స్, స్థానిక చెక్కుల క్లియరెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్ పొదుపు ఖాతాతో అనుసంధానం, ఫోన్ బ్యాంకింగ్ సేవలు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఉన్నాయి.

సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి డాక్యుమెంట్స్

సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి డాక్యుమెంట్స్

సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఐడెంటిటీ ప్రూఫ్ (పాస్‌పోర్ట్, వోటర్ ఐడీ, ఆధార్ కార్డు వంటివి), అడ్రస్ ప్రూఫ్ (పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు వంటివి), పాన్ కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం.

సేవింగ్స్ అకౌంట్ రకాలు

సేవింగ్స్ అకౌంట్ రకాలు

వివిధ రకాల సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి.

1. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్,

2. శాలరీ సేవింగ్స్ అకౌంట్,

3. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ అకౌంట్,

4. చిల్డ్రన్ లేదా మైనర్ సేవింగ్స్ అకౌంట్,

5. వుమెన్ సేవింగ్స్ అకౌంట్.

6. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా.

ఆరు సేవింగ్స్ ఖాతా డిటైల్స్

ఆరు సేవింగ్స్ ఖాతా డిటైల్స్

- రెగ్యులర్ సేవింగ్స్ ఖాతా: ప్ర‌స్తుతం బ్యాంకుల‌కు సంబంధించి ఏలాంటి ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా సేవింగ్స్ ఖాతా అవసరం. ఈ ఖాతాను ఎవ‌రైనా ఓపెన్ చేయవచ్చు. KYC నిబంధనల ప్ర‌కారం వ్యక్తులు, వ్యక్తిగత, చిరునామా గుర్తింపు పత్రాలను బ్యాంకులో సమర్పించి, రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాను తెరువవచ్చు. సేవింగ్స్ ఖాతాను నిర్వహించేందుకు కనీసం 3 నెలలకు ఒకసారైనా ట్రాన్సాక్షన్ నిర్వహించాలి. ఖాతాలో కనీస నిల్వ అవసరం. ఈ మినిమం బ్యాలెన్స్ కంటే తక్కువ మొత్తం ఉంటే బ్యాంకులు ఛార్జీని విధిస్తాయి. సేవింగ్స్ ఖాతాలో నిల్వ చేసిన మొత్తంపై వ‌డ్డీ వస్తుంది. వివిధ బ్యాంకులు వివిధ వడ్డీ రేట్లు అందిస్తాయి.

- శాలరీ సేవింగ్స్ ఖాతా: కంపెనీలు త‌మ ఉద్యోగుల కోసం శాలరీ సేవింగ్స్ అకౌంట్స్ తెరుస్తాయి. నెల‌వారి ప్రాతిప‌దిక‌న ఉద్యోగుల వేతనాన్ని ఈ ఖాతాలో జ‌మ చేస్తారు. ఈ ఖాతాల‌కు కొన్ని ప్రాధాన్య‌త‌లు, నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. వేతనం చెల్లించే స‌మ‌యంలో సంస్థ య‌జ‌మాని సూచించిన మేర‌కు బ్యాంకులు సంస్థ‌ ఖాతా నుండి డ‌బ్బును డెబిట్ చేసి ఉద్యోగుల అకౌంట్లకు క్రెడిట్ చేస్తాయి. మినిమం బ్యాలెన్స్ నిర్వహణ అవసరం లేదు. 3 నెల‌ల పాటు వ‌రుస‌గా వేతన ఖాతాకు క్రెడిట్ కాకుంటే ఆ సేవింగ్స్ ఖాతాను రెగ్యులర్ సేవింగ్స్ ఖాతా కిందకు మారుస్తారు.

- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ ఖాతా: సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ ఖాతా సాధార‌ణ పొదుపు ఖాతా మాదిరిగా ప‌ని చేస్తుంది. అయితే వ‌డ్డీ రేట్లు సాధార‌ణ ఖాతా కంటే కాస్త ఎక్కువ ఉంటాయి. ప‌ద‌వీ విర‌మ‌ణ ఖాతా నుండి లేదా పెన్ష‌న్ ఫండ్స్ నుండి నిధుల‌ను పంపించడం కోసం ఇత‌ర సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీంలతో అనుసంధానమై ఉంటాయి. బ్యాంకు ఖాతా కింద‌ అన్ని నిధులను ఏకీకృతం చేస్తాయి.

- మైనర్ సేవింగ్స్ ఖాతా: సేవింగ్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ గురించి పిల్లలకు అవగాహన కల్పించేందుకు ఈ ఖాతా ఉద్దేశించినది. ఈ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ నిర్వహణ అవసరం లేదు. పదేళ్లలోపు పిల్లలు, తల్లిదండ్రులు లేదా గార్డియన్ పర్యవేక్షణలో ఈ ఖాతాను నిర్వహించవచ్చు. పదేళ్లు నిండిన తర్వాత పిల్లలు సొంతగా ఆపరేట్ చేయవచ్చు. పిల్లలకు పద్దెనిమిదేళ్లు నిండాక దీనిని రెగ్యులర్ పొదుపు ఖాతాగా మారుస్తారు.

- జీరో బ్యాలెన్స్ ఖాతా: రెగ్యులర్ సేవింగ్స్ ఖాతా మాదిరిగా ఉంటుంది. అయితే మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. ఉపసంహరణ మొత్తాలపై పరిమితి ఉంటుంది.

- వుమెన్ సేవింగ్స్ అకౌంట్: మ‌హిళ‌లు ఆర్థికంగా ముందుకు సాగేందుకు ఈ ఖాతాలను తీసుకు వచ్చారు. కొన్ని ప్ర‌త్యేక ఫీచ‌ర్ల‌ు ఉంటాయి. నిర్ధిష్ట కొనుగోళ్ల‌పై రాయితీలు ఉంటాయి. త‌క్కువ వ‌డ్డీ రేటుకు రుణం ల‌భిస్తుంది. డీమ్యాట్ ఖాతా చార్జీలు ఉండ‌వు. బ్యాంకును బ‌ట్టి ఫీచర్స్ మారుతాయి.

English summary

Savings Account: సేవింగ్స్ అకౌంట్ రకాలు, ఫీచర్స్, ప్రయోజనాలు | Different Types Of Savings Account and Features and Benefits of Savings Account

For citizens that wish to save for the future, they can open a savings account in the banks listed below.
Story first published: Wednesday, December 1, 2021, 18:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X