For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FD, యుటిలిట బిల్స్: వాట్సాప్‌పై ఐసీఐసీఐ బ్యాంకు కొత్త సేవలు

|

ప్రయివేటురంగ రెండో దిగ్గజ ఐసీఐసీఐ బ్యాంకు తమ కస్టమర్లకు సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ వాట్సాప్ సహాయంతో కస్టమర్లు సందేశం పంపించడం ద్వారా క్షణాల వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఇంటిలో కూచునే విద్యుత్, గ్యాస్, పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లు చెల్లింపులు జరపవచ్చు.

ట్రేడ్ ఫైనాన్స్ వివరాలు తక్షణమే యాక్సెస్ చేయవచ్చు. బ్యాంకింగ్ రంగంలో వాట్సాప్ ద్వారా ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేందుకు వీలుగా ఐసీఐసీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను గతంలో అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారుల నుండి మంచి స్పందన రావడంతో తాజా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది.

భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది.. కానీ, కేంద్రం స్పందించకుంటే..భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది.. కానీ, కేంద్రం స్పందించకుంటే..

25 రకాల సేవలు

25 రకాల సేవలు

రిటైల్ కస్టమర్లు వాట్సాప్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ తెరుచుకోవచ్చు. దీంతో పాటు కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, మొబైల్ బిల్లులు ఒక్క క్లిక్ ద్వారా చెల్లించవచ్చు. త్వరలో మొబైల్ ప్రీపెయిడ్ బిల్లులు చెల్లించే వెసులుబాటు కూడా తీసుకురానుంది. గతంలో ఐసీఐసీఐ అందుబాటులోకి తెచ్చిన సేవల ప్రకారం ఖాతాదారుడు అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, క్రెడిట్ కార్డు లిమిట్, ప్రీ-అప్రూవ్డ్ లోన్ వివరాలు, క్రెడిట్ కార్డుు, డెబిట్ కార్డుల బ్లాక్ చేయడం, అన్ బ్లాక్ చేయడం వంటి సేవలు పొందే వీలు ఉంది.

కార్పోరేట్ కంపెనీలు, ఎంఎస్ఎంఈ కస్టమర్ ఐడీ, దిగుమతి ఎగుమతి కోడ్, బ్యాంకులో రుణ సదుపాయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. తాజా సేవలతో కలిపి ఐసీఐసీఐ వాట్సాప్ ద్వారా 25రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఆదరణ.. మరిన్ని సేవలు

ఆదరణ.. మరిన్ని సేవలు

ఐసీఐసీఐ ఏప్రిల్ 4న మొదటిసారి వాట్సాప్ సేవలు ప్రారంభించింది. దీనికి మంచి ఆదరణ లభించింది. ఆరు నెలల వ్యవధిలోనే 20 లక్షలమందికి పైగా కస్టమర్లు ఈ సేవలను వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. రిటైల్, ఎన్నారై, కార్పోరేట్, ఎంఎస్ఎంఈ కస్టమర్లకు కూడా ప్రస్తుతం వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

24x7 అందుబాటులో

24x7 అందుబాటులో

వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు 24x7 అందుబాటులో ఉంటాయి. కస్టమర్లకు పూర్తి రక్షణ కల్పించేలా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయం ఉంది.

ఐసీఐసీఐ వాట్సాప్ నెంబర్ 86400 86400 ను మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబర్ బ్యాంకు అకౌంట్‌తో జత చేసి ఉండాలి.

ఖాతాదారు హాయ్ అని సందేశం పంపించాలి. అప్పుడు బ్యాంకు సేవల వివరాలు వస్తాయి.

అందులో మీకు కావాల్సిన సేవలకు సంబంధించిన నెంబర్‌ను ఎంటర్ చేయాలి.

English summary

FD, యుటిలిట బిల్స్: వాట్సాప్‌పై ఐసీఐసీఐ బ్యాంకు కొత్త సేవలు | Check out ICICI bank's new banking services on WhatsApp

ICICI Bank has launched of WhatsApp services for customers, using which they can create fixed deposits, pay utility bills and access details of trade finance instantly.
Story first published: Monday, October 19, 2020, 11:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X