For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక గ్యాస్ బుకింగ్ మరింత సులభం, భారత్ గ్యాస్ నుండి వాట్సాప్ సేవలు

|

దేశంలోని రెండో అతిపెద్ద చమురు మార్కెటింగ్ కంపెనీ భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (BPCL) మంగళవారం దేశవ్యాప్తంగా కస్టమర్ ఫ్రెండ్లీ అంశంలో మరో అడుగు ముందుకేసింది. వాట్సాప్ ద్వారా వంట గ్యాస్‌ను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. బీపీసీఎల్‌కు 71 మిలియన్ల (7.1 కోట్లు) మంది కస్టమర్లు ఉన్నారు. దేశంలో ఇండియన్ ఆయిల్‌కు అతిపెద్ద చమురు మార్కెట్ ఉండగా, ఇది రెండో స్థానంలో ఉంది.

ఏం టైంకు తెరుచుకుంటాయ్: బ్యాంకు పనివేళల్లో మార్పులు, SBI ఏం చెప్పిందంటే?ఏం టైంకు తెరుచుకుంటాయ్: బ్యాంకు పనివేళల్లో మార్పులు, SBI ఏం చెప్పిందంటే?

వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్

వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్

తాజాగా బీపీసీఎల్ వాట్సాప్ ద్వారా వంట గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించడం ద్వారా నూతన సేవలకు శ్రీకారం చుట్టింది. కంపెనీ వెబ్ సైట్‌లో రిజిస్టార్ చేసుకున్న మొబైల్ నంబర్ నుండి వాట్సాప్ నంబర్ '1800224344' (బీపీసీఎల్ స్మార్ట్ లైన్ నెంబర్) ద్వారా సిలిండర్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ రోజు నుండి (మే 26, మంగళవారం) భారత్ గ్యాస్ కస్టమర్లు వాట్సాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చునని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.

చెల్లింపులు ఇలా చేయవచ్చు

చెల్లింపులు ఇలా చేయవచ్చు

కస్టమర్ మరింత ఈజీగా గ్యాస్ సిలిండర్‌ను బుకింగ్ చేసుకునే విధంగా ఈ కొత్త సేవలను తీసుకు వచ్చినట్లు కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ అరుణ్‌ సింగ్ తెలిపారు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్స్, యూపీఐ, అమెజాన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చునని తెలిపారు. గత కొద్దికాలంగా వాట్సాప్ అందరూ ఉపయోగిస్తున్నారని, ఈ ప్లాట్ ఫామ్ అందరికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

చెల్లింపు కోసం లింక్

చెల్లింపు కోసం లింక్

వాట్సాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకున్న అనంతరం ఆన్ లైన్ పేమెంట్ కోసం లింక్‌తో పాటు కన్ఫర్మేషన్ సందేశం వస్తుంది. ఈ చెల్లింపులను డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా యూపీఐ లేదా అమెజాన్ వంటి ఇతర యాప్స్ ద్వారా చేయవచ్చునని ఎల్పీజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంచార్జ్ టీ పీతాంబరం చెప్పారు.

కొత్త ఫీచర్స్

కొత్త ఫీచర్స్

భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ఎల్పీజీ డెలివరీ ట్రాకింగ్ వంటి కొత్త ఫీచర్లను పరిచయం చేయడంతో పాటు కస్టమర్ల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నట్లు మార్కెటింగ్ డైరెక్టర్ అరుణ్ సింగ్ అన్నారు. ఇప్పటికే ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్, యాప్స్, వెబ్ సైట్ తదితర డిజిటల్ ఛానల్స్ ద్వారా ఎల్పీజీ బుక్ చేసుకునే సౌకర్యం ఉందని, ఇందుకు 6,111 మంది డిస్ట్రిబ్యూటర్స్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తెలిపారు.

English summary

ఇక గ్యాస్ బుకింగ్ మరింత సులభం, భారత్ గ్యాస్ నుండి వాట్సాప్ సేవలు | BPCL launches cooking gas booking via WhatsApp

The second-largest national oil marketing company Bharat Petroleum Corp Ltd (BPCL) on Tuesday announced a new customer-friendly initiative with the launch of cooking gas booking through Whatsapp across the country.
Story first published: Wednesday, May 27, 2020, 18:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X