For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ బ్యాంకుల్లో లక్షలు దాటిన APY సబ్‌స్కైబర్లు: స్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇలా దరఖాస్తు..

|

పద్దెనిమిదేళ్ల నుండి నలభై సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయులు అటల్ పెన్షన్ యోజన(APY)లో చేరవచ్చు. సేవింగ్స్ అకౌంట్ కలిగిన బ్యాంకు లేదా పోస్టాఫీస్ బ్రాంచీ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత కనీస పెన్షన్ రూ.1000 నుండి రూ.5000 వరకు అందుతుంది. ఆయా వ్యక్తులు APYకి కాంట్రిబ్యూషన్ చేసిన మొత్తం ఆధారంగా ఈ పెన్షన్ వస్తుంది. సబ్‌స్క్రైబర్ అనుకోని పరిస్థితుల్లో మృతి చెందితే భాగస్వామికి పెన్షన్ వస్తుంది. సబ్‌స్క్రైబర్, భాగస్వామి ఇద్దరు మృతి చెందితే 60 ఏళ్ల వరకు కాంట్రిబ్యూట్ చేసిన మొత్తం నామినీకి చెందుతుంది.

అటల్ పెన్షన్ యోజన స్కీంలో చాలామంది చేరుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో APY కింద 28 లక్షలమంది కొత్తగా సబ్‌స్క్రైబ్ అయ్యారు. APY స్కీంను PFRDA నిర్వహిస్తోంది. ఆగస్ట్ 25, 2021 నాటికి APY సబ్‌స్క్రైబర్ల సంఖ్య 3.30 కోట్లు దాటింది. వివిధ బ్యాంకుల్లో APY సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఇక్కడ చూద్దాం.

ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్యాంకుల్లో చేరిన APY సబ్‌స్క్రైబర్లు. ఇక్కడ టాప్ 10 బ్యాంకులు. ఈ బ్యాంకుల్లో ఒక్క దాంట్లో లక్షకు పైగా చేరారు. ఏప్రిల్ 1, 2021 నుండి ఆగస్ట్ 24, 2021 వరకు ఈ బ్యాంకుల్లో చేరిన సబ్‌స్క్రైబర్లు

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 7,99,428,
- కెనరా బ్యాంకు - 2,65,826,
- ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు లిమిటెడ్ - 2,06,643,
- బ్యాంక్ ఆఫ్ బరోడా - 2,01,009,
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 1,74,291,
- బ్యాంక్ ఆఫ్ ఇండియా - 1,30,362,
- ఇండియన్ బ్యాంకు - 1,13,739,
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 1,04,905,
- పంజాబ్ నేషనల్ బ్యాంకు - 1,01,459

ఈ బ్యాంకుల్లో లక్షలు దాటిన APY సబ్‌స్కైబర్లు

266 రిజిస్టర్డ్ APY సర్వీస్ ప్రొవైడర్లచే ఇది నిర్వహించబడుతోంది. ఇందులో వివిధ బ్యాంకులు, డిపార్టుమెంట్ ఆఫ్ పోస్ట్‌లు ఉన్నాయి. సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారు మాత్రమే ఈ ఖాతాను తెరవగలరు. కాబట్టి ఈ అకౌంట్స్‌ను ప్రోత్సహించాలని PFRDA అన్ని బ్యాంకులను ఆదేశించింది.

APY స్కీంను విస్తృతం చేయడానికి, ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్లు, APY సీర్స్‌కు మరింత ప్రయోజనం చేకూర్చడానికి PFRDA ఇటీవల వివిధ చర్యలు ప్రారంభించింది. APY మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్స్ తీసుకు వచ్చింది. ఉమాంగ్ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంటోంది. APY FAQలను అప్ డేట్ చేయడం, APY సబ్‌స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్, APY సిటిజన్ చార్టర్‌ను 13 ప్రాంతీయ భాషల్లోకి జారీ చేయడం చేస్తోంది.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకే ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 8 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA) ప్రకారం ఆగస్ట్ 25వ తేదీ నాటికి APY చందాదారులు 3.30 కోట్లు దాటారు.

వివిధ రాష్ట్రాల్లో APY చేరికలు...

- ఉత్తర ప్రదేశ్ 49,65,922,
- బీహార్ 31,31,675,
- పశ్చిమ బెంగాల్ 26,18,656,
- మహారాష్ట్ర 25,51,028,
- తమిళనాడు 24,55,438,
- ఆంధ్రప్రదేశ్ 19,80,374,
- కర్నాటక 19,74,610,
- మధ్యప్రదేశ్ 19,19,795 9,
- రాజస్థాన్ 16,16,050,
- గుజరాత్ 13,50,864,
- ఒడిశా 12,45,837

ఇక, PFRDA డేటా ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 2.33 కోట్ల మంది సబ్‌స్క్రైబ్ అయ్యారు. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 61.32 లక్షలు, ప్రయివేటు బ్యాంకుల్లో 20.64 లక్షలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల్లో 10.78 లక్షలు, పోస్టాఫీస్‌లలో 3.40 లక్షలు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో 84,627 మంది చేరారు.

SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇలా దరఖాస్తు

APYలో చేరడానికి 18 నుండి 40 ఏళ్లు ఉండాలి. ఐదు నెలవారీ పెన్షన్ విధానాలు ఉంటాయి. సబ్‌స్క్రైబర్లు అరవై ఏళ్ల తర్వాత రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000, రూ.5000 పొందవచ్చు. పథకంలో చేరే సమయంలో సబ్‌స్క్రైబర్ పైన తెలిపివాటిలో ఎంత మొత్తాన్ని పెన్షన్‌గా పొందాలనుంటున్నాడో ఎంపిక చేసుకుంటే, ఆ మేరకు చెల్లించాలి. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా APY స్కీంలో చేరవచ్చు.

- SBI నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగ్-ఇన్ కావాలి.
- 'ఇ-స‌ర్వీసెస్' ఆప్ష‌న్‌లో అందుబాటులో ఉన్న 'సోష‌ల్ సెక్యూరిటీ స్కీం'పై క్లిక్ చేయాలి. తర్వాత కొత్త విండో ఓపెన్ అవుతుంది.
- అందులో అటల్ పెన్షన్ యోజనను ఎంచుకోవాలి.
- అటల్ పెన్షన్ యోజన స్కీంకు అనుసంధానించే సేవింగ్స్ ఖాతా నెంబర్‌ను ఎంటర్ చేసి, సబ్‌మిట్ చేయాలి.
- సబ్‌మిట్ చేసిన తర్వాత క‌స్ట‌మ‌ర్ ఐడెంటిఫేకేష‌న్(CIF) నెంబర్‌ను సెల‌క్ట్ చేసుకునే ఆప్ష‌న్ వ‌స్తుంది.
- సిస్ట‌మ్ జ‌న‌రేట్ చేసిన CIF నెంబర్‌ను ఎంపిక చేసుకోవాలి.
- స్క్రీన్ పైన క‌నిపించే ఇ-ఫాంను పూర్తి చేయాలి.
- వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత నామినీ వివరాలు ఇవ్వాలి.
- పెన్ష‌న్ మొత్తం, నెల‌వారీగా, త్రైమాసికంగా, వార్షికంగా మీకు కావల‌సిన కాంట్రీబ్యూషన్ కాలపరిమితి వంటి వివరాలు ఇవ్వాలి.
- ఫామ్ సబ్‌మిట్ చేసి, అక్నాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

English summary

Banks With Over 1 lakh APY Enrolments, Open APY through SBI net banking

Any Indian citizen between the ages of 18 and 40 can join the APY through a bank or post office branch where they have a savings bank account.
Story first published: Friday, September 3, 2021, 12:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X