For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇబ్బందులు లేకుండా... 3 రోజుల్లోనే ఆధార్‌తో రిజిస్ట్రేషన్ నెంబర్ పొందొచ్చు

|

మూడురోజుల్లోనే జీఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పొందే కొత్త సౌలభ్యాన్ని ఆర్థిక శాఖ అందుబాటులోకి తీసుకు వచ్చింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ ఆధారిత ధృవీకరణను ఎంపిక చేసుకుంటే మూడు వర్కింగ్ డేస్‌లోనే ఆధార నెంబర్‌ను వీలు ఉంటుంది. వ్యాపార సంస్థ వెరిఫికేషన్ అవసరం కూడా ఉండదు. ఒకవేళ ఆధార్ ఆధారిత ధృవీకరణను ఎంపిక చేసుకోకుంటే వ్యాపార సంస్థ, పత్రాల పరిశీలన కోసం మూడు వారాల వరకు సమయం పడుతుంది. అలాంటి సమయంలో ఒకవేళ ఏమైనా నోటీసులు జారీ అయితే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది.

<strong>రిలయన్స్, అమెజాన్‌కు షాక్: టాటా 'సూపర్ యాప్', ఈ సేవలన్నీ అందుబాటులో..</strong>రిలయన్స్, అమెజాన్‌కు షాక్: టాటా 'సూపర్ యాప్', ఈ సేవలన్నీ అందుబాటులో..

ఇబ్బంది లేని రిజిస్ట్రేషన్

ఇబ్బంది లేని రిజిస్ట్రేషన్

దీని ద్వారా ఇబ్బందిలేని రిజిస్ట్రేషన్‌తో పాటు జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందడానికి ఆధార్ ద్వారా ప్రామాణీకరణను ఎంచుకునే దరఖాస్తుదారు ఎలాంటి భౌతిక ధృవీకరణ లేకుండా మూడు రోజుల్లో అనుమతి పొందుతారని ఓ అధికారి వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆధార్ ప్రామాణీకరణను ఎంచుకోకుంటే మాత్రం 21 రోజులు (వర్కింగ్ డేస్) తీసుకుంటుంటుందని తెలిపారు.

నకిలీ, మోసపూరిత సంస్థలను దూరం ఉంచేలా

నకిలీ, మోసపూరిత సంస్థలను దూరం ఉంచేలా

నకిలీ, మోసపూరిత సంస్థలను జీఎస్టీ మేకానిజంకు దూరంగా ఉంచేందుకు సరైన వెరిఫికేషన్, ఇతర వివరాలు అవసరమని అధికారులు చెబుతున్నారు. రెండు కేసుల్లోను ట్యాక్స్ అధికారులు నిర్ణీత కాలపరిమితిలో పని చేయాలి. నిర్ణీత కాలపరిమితి తర్వాత తిరస్కరణకు నోటీసులు ఇవ్వకుంటే సదరు దరఖాస్తు ఆమోదించినట్లుగా పరిగణించవచ్చు.

ఆధార్ ఆధారిత రిజిస్ట్రేషన్ అయితే..

ఆధార్ ఆధారిత రిజిస్ట్రేషన్ అయితే..

పన్ను చెల్లింపుదారుల కోసం ఆధార్ ఆధారిత జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను మార్చి 14వ తేదీన సమావేశమైన 39వ జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ లేదా ఫిజికల్ ఫామ్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఆధార్ ఆధారితం అయితే ప్రమోటర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు, ఈమెయిల్ ఐడికి లింక్ షేర్ చేయబడుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డిక్లరేషన్ స్క్రీన్ ఉంటుంది. అక్కడ అప్లికెంట్ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. ఇది రిజిస్టర్డ్ మొబైల్, ఈ-మెయిల్‌కు వస్తుంది. ఆ తర్వాత ఈ-కేవైసీ పాపప్ వస్తుంది.

English summary

ఇబ్బందులు లేకుండా... 3 రోజుల్లోనే ఆధార్‌తో రిజిస్ట్రేషన్ నెంబర్ పొందొచ్చు | Aadhaar to get GST registration in just three days

An aspiring entrepreneur is saved from the hassle of physical verification for obtaining the registration for the Goods and Services Tax (GST), if the person opts for authentication through his Aadhaar number.
Story first published: Tuesday, August 25, 2020, 15:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X