For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ బయోమెట్రిక్ మిస్‌యూజ్ కావొద్దంటే.. ఇలా చేయండి

|

భారతదేశంలో 12అంకెల ప్రత్యేక గుర్తింపు కల్గిన ఆధార్ కార్డు పౌరులందరికీ ఉంటుంది దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేస్తుంది. అయితే నకిలీ బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, నకిలీ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ నిర్వహించేందుకు మోసగాళ్లు ఆధార్ నెంబర్‌ను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆధార్ కార్డుదారులు తమ కార్డులు దుర్వినియోగం కాకుండా, సురక్షితంగా ఉండేలా UIDAI అందించిన లాక్/అన్‌లాక్ ఫీచర్‌ను ఉపయోగించాలని కోరుతోంది. మీ ఆధార్ కార్డు బయోమెట్రిక్‌ను ఎలా లాక్ చేయాలి, ఎలా అన్-లాక్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

లాక్ చేయండి

లాక్ చేయండి

భద్రతా అంశాలను పరిగణలోకి తీసుకొని UIDAI ఇటీవల అధికారిక ట్విట్టర్ ద్వారా ఆధార్ కార్డుదారులకు పలు సూచనలు చేసింది. 'మీ ఆధార్‌ను ఎవరైనా దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు మీ ఆధార్ బయోమెట్రిక్‌ను లాక్ చేయండి. మీ ఆధార్‌ను లాక్/అన్‌లాక్ చేయడానికి mAadhaar యాప్‌ను ఉపయోగించండి లేదా https://resident.uidai.gov.in/aadhaar-lockunlock పైన క్లిక్ చేయండి' అని పేర్కొంది. ఈ సేవలకు మీ VID తప్పనిసరి అని తెలిపింది.

మీ ఆధార్ బయోమెట్రిక్‌ను లాక్ చేయడానికి ఇలా చేయండి..

మీ ఆధార్ బయోమెట్రిక్‌ను లాక్ చేయడానికి ఇలా చేయండి..

- https://resident.uidai.gov.in/aadhaar-lockunlock వెబ్ సైట్ లోకి వెళ్లండి.

- Secure UID Authentication Channel సెక్షన్‌లోని Lock UID లేదా Unlock UID ఆప్షన్‌ను ఎంచుకోండి.

- Lock UID సెలక్ట్ చేశాక మీ 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయాలి. పేరును ఎంటర్ చేయాలి. పిన్ కోడ్, ఆధార్ ఇతర వివరాలు ఇవ్వాలి.

- తర్వాత కాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత మీకు వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఇది వస్తుంది.

- వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అవుతుంది.

mAadhaar ద్వారా లాక్ చేయడం

mAadhaar ద్వారా లాక్ చేయడం

mAadhaar యాప్ ద్వారా మీ ఆధార్ కార్డును లాక్ చేయడానికి లేదా అన్ లాక్ చేయడానికి ఇలా చేయండి....

- మీ మొబైల్ ఫోన్లో mAadhaarను ఓపెన్ చేయాలి. మీ అకౌంట్‌కు లాగిన్ కావాలి.

- My Aadhaar యాప్ పైన క్లిక్ చేయాలి. Aadhaar Lock ఆప్షన్‌ను ఎంచుకోండి.

- Confirmation సందేశాన్ని యాక్సెప్ట్ చేయాలి. Lock Aadhaar పైన క్లిక్ చేయాలి.

- మీ ఆధార్ నెంబర్, పూర్తి పేరు, పిన్ కోడ్, ఆ తర్వాత కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి. ఈ పాస్ వర్డ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది.

- ఓటీపీని ఎంటర్ చేయాలి. ధృవీకరణ తర్వాత మీ ఆధార్ కార్డ్ లాక్ అవుతుంది.

English summary

ఆధార్ బయోమెట్రిక్ మిస్‌యూజ్ కావొద్దంటే.. ఇలా చేయండి | Aadhaar Biometrics To Prevent Misuse

For all the resident citizens of India, an Aadhaar Card is a 12-digit unique identification number that serves as an identity proof for them issued by the Unique Identification Authority of India (UIDAI).
Story first published: Monday, July 19, 2021, 21:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X