For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

|

కరోనా మహమ్మారి తర్వాత ఈక్విటీల్లో పెట్టుబడులకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఏ మేరకు ఉన్నాయని ఎప్పటికప్పుడు అవగాహనకు వస్తుంది. ఈక్విటీల్లో కొంతమంది తాత్కాలికంగా ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు చూస్తారు. మరికొంతమంది లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. ఆయా స్టాక్స్ ఆయా కంపెనీలను బట్టి, దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతాయి. అయితే పెట్టుబడులు పెట్టే సమయంలో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

పెట్టుబడి సమయం

పెట్టుబడి సమయం

ఈక్విటీ మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనేది తెలుసుకోవాల్సిన విషయం. ప్రస్తుతం భారత మార్కెట్ ఆల్ టైమ్ గరిష్టానికి దగ్గరలో ఉన్నాయి. సూచీలు బుల్లిష్‌గా ఉన్నాయి. ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకడంతో పాటు బుల్లిష్‌గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కోసం మొగ్గు చూపే వారు ఉంటారు. అలాగే స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైన సమయంలోను చాలామంది పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతారు. ఈ రెండింటి సమయంలో కూడా ఇన్వెస్టర్లు మరింత ఆచితూచి వ్యవహరిస్తారు. పెట్టుబడికి ఈ రెండు సమయాలు చాలా కీలకం. పెరుగుతున్న ఈక్విటీ ధరను అవకాశంగా భావించే పెట్టుబడిదారులకు ఇది నిరుత్సాకరంగా ఉండదు. పై సమయాల్లో పెట్టుబడి ద్వారా ఇది ప్రయోజనం. అలాగే ప్రతికూలత కూడా ఉంది. మార్కెట్ పరుగులో ఇది ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, దిద్దుబాటుకు గురయితే మాత్రం నష్టం కలుగుతుంది. మార్కెట్ పతనమైతే ఆ పెట్టిన పెట్టుబడిలో ఎక్కువ మొత్తం నష్టపోవచ్చు.

వ్యాల్యూ ఇన్వెస్ట్‌మెంట్

వ్యాల్యూ ఇన్వెస్ట్‌మెంట్

ఏవైనా స్టాక్స్ తక్కువలో ట్రేడింగ్ అవుతున్న సమయంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపే పెట్టుబడిదారులు ఎక్కువ. తక్కువ ధరలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం ద్వారా తర్వాత ప్రాఫిట్ బుకింగ్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడిగా చూసుకోవచ్చు. స్టాక్ వ్యాల్యూ గత కొన్నేళ్లలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉందో చూసుకొని, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. పెద్ద పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిటర్న్స్ వస్తాయి.

గ్రోత్ ఇన్వెస్ట్‌మెంట్

గ్రోత్ ఇన్వెస్ట్‌మెంట్

గత పదేళ్ల కాలంలో లేదా గత అయిదేళ్ల కాలంలో లేదా కంపెనీ ప్రారంభం నుండి వృద్ధి ఎలా ఉంది అనే అంశాన్ని పరిశీలించాలి. సాధారణంగా ఒక సంస్థకు మెరుగైన ఆదాయ దృక్పథం లేదా ఈపీఎస్ స్టాక్ వృద్ధి నిర్ణయిస్తుంది. కంపెనీ గత ఏడాది రూ.100 రిటర్న్స్ ఇస్తే, తర్వాత సంవత్సరంలో రూ.250 ఇస్తే మంచి రిటర్న్స్‌గా భావించవచ్చు.

English summary

ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి | 3 Investing Styles When It Comes To Financial Markets

Equities is a broad based investment category that cannot be mugged up in a year or so. Years of experience into the category provides insight into the asset class and like there is a basket of securities available to add to one's portfolio, there are also different investment approaches that are well suited for different market cycles or for different investor categories.
Story first published: Monday, July 12, 2021, 20:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X