For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకో కాంటాక్టులెస్ కార్డు ఉందా? దాంతో లాభాలేంటో తెలుసుకోండి మరి!

|

డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం మరింత వేగంగా విస్తరిస్తోంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా వీటిని విపరీతంగా వాడుతున్నారు. ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించే సమయంలో కార్డు నెంబర్లను ఎంటర్ చేస్తే సరిపోతుంది. కానీ ఏదైనా షాపింగ్ మాల్ లేదా మరేదైనా స్టోర్ కు వెళ్ళినప్పుడు కార్డుల ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మన బిల్లు మొత్తానికి సంబంధించిన సొమ్ము చెల్లించేందుకు కార్డును పాయింట్ అఫ్ సేల్ మిషిన్ లో పెడుతుంటారు. లేదా స్వైప్ చేస్తుంటారు.

అప్పుడు మనం మన పిన్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత లావాదేవీ పూర్తి అవుతుంది. అయితే ఈ ప్రక్రియ ముగియడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది అసౌకర్యంగా కూడా ఉంటుంది. దీన్ని గుర్తించిన కార్డుల కంపెనీలు సరికొత్త టెక్నాలజీతో కూడిన కాంటాక్ట్ లెస్ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటి పనితీరు, సౌలభ్యం ఏవిధంగా ఉంటుందో చూద్దాం...

తప్పు చేశాం.. గుణపాఠం నేర్చుకోవాల్సింది, ఆ విషయంలో మోడీ ప్రభుత్వం ఓకే!: మన్మోహన్తప్పు చేశాం.. గుణపాఠం నేర్చుకోవాల్సింది, ఆ విషయంలో మోడీ ప్రభుత్వం ఓకే!: మన్మోహన్

క్షణాల్లో చెల్లింపులు

క్షణాల్లో చెల్లింపులు

కాంటాక్టులెస్ కార్డుల ద్వారా క్షణాల్లో వ్యాపార సంస్థల వద్ద చెల్లింపులు చేయవచ్చు.

కాంటాక్ట్ లెస్ లావాదేవీలు నిర్వహించడానికి కాంటాక్టులెస్ టెక్నాలజీ కలిగిన కార్డులను వినియోగించాల్సి ఉంటుంది. ఈ కార్డులపై కాంటాక్ట్ లెస్ సింబల్ ఉంటుంది. ఇది మొబైల్ ఫోన్ లో కనిపించే టవర్ సింబల్ మాదిరిగా ఉంటుంది. ఇదే సింబల్ కలిగి ఉండే పీవోఎస్ టెర్మినళ్ల వద్ద ఈ కార్డులను కాంటాక్టులెస్ లావాదేవీల కోసం వినియోగించవచ్చు. ఈ కార్డులను పీవోఎస్ టెర్మినల్ వద్ద స్వైపింగ్ చేయాల్సిన అవసరం ఉండవు. ఆ మిషన్ పై కార్డును అటుఇటు తిప్పితే సరిపోతుంది. చెల్లింపు జరిగిపోతుంది. ఎలాంటి పిన్ అవసరం ఉండదు. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా ఈ కార్డులు పనిచేస్తాయి. ఒకవేళ పీవోఎస్ ఈ టెక్నాలజీకి అనుగుణంగా లేకపోతే కార్డును స్వైప్ చేసి చెల్లింపులు చేయవచ్చు.

లావాదేవీలపై పరిమితి

లావాదేవీలపై పరిమితి

* కాంటాక్టులెస్ కార్డులను వినియోగించినప్పుడు ఎలాంటి పిన్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ కార్డును వినియోగించి ఎవరైనా లావాదేవీలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్డులను పోగొట్టుకున్న సందర్భంలో దుర్వినియోగం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి లావాదేవీల పై పరిమితిని విధించారు.

* రూ.2,000 లోపు లావాదేవీలకు పిన్ నెంబర్ ను వాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఇంతకన్నా ఎక్కువ మొత్తం ఉంటె పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

* రోజులో గరిష్టంగా ఐదు లావాదేవీలు నిర్వహించవచ్చు. వీటి మొత్తం రూ. 10,000 వరకు మాత్రమే ఉండాలి. ఒకవేళ కార్డును కోల్పోయిన దాని ద్వారా ఎక్కువ మొత్తాన్ని వినియోగించుకునే అవకాశం ఉండదు. ఒకవేళ కార్డు పోతే వెంటనే దాన్ని బ్లాక్ చేయించడం వల్ల నష్టం జరగకుండా చూసుకోవచ్చు.

* కాంటాక్ట్ లెస్ కార్డులను బ్యాంక్ శాఖా ద్వారా పొందవచ్చు.

భద్రత, సెక్యూరిటీ

భద్రత, సెక్యూరిటీ

* సాధారణంగా కార్డులతో పీఓఎస్ టెర్మినళ్ల వద్ద చెల్లింపులు చేసే సమయంలో మన కార్డును అక్కడ ఉండే వ్యాపారులకు ఇస్తుంటాము. కొన్ని సందర్భాల్లో మనకు దూరంగా కార్డును వాడాల్సి వస్తుంది. అప్పుడు మన కార్డు సమాచారం మరొకరికి తెల్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దేనివల్ల దుర్వినియోగం జరగవచ్చు.

కానీ కాంటాక్టులెస్ కార్డుల వల్ల మన చేతిలోనే కార్డు ఉంటుంది. చెల్లింపులు మన ముందే జరిగిపోతాయి.

తెలియకుండా చెల్లింపులు జరిగే అవకాశం ఉండదు...

తెలియకుండా చెల్లింపులు జరిగే అవకాశం ఉండదు...

* పీవోఎస్ మిషన్ వద్ద కార్డును ఉంచగానే చెల్లింపులు జరిగే అవకాశం ఉన్నందువల్ల అనుకోకుండా ఆ మిషన్ వద్ద కార్డును ఉంచితే చెల్లింపులు జరుగుతాయా అన్న సందేహం రావచ్చు. కానీ అలా జరగడానికి అవకాశం ఉండదు. వ్యాపారీ మిషన్ అమౌంట్ ను ఎంటర్ చేయడంతో పాటు కార్డును చూపిన తర్వాత దాన్ని ఒకే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండు జరగకుండా చెల్లింపులు జరిగే అవకాశం ఉండదు.

English summary

మీకో కాంటాక్టులెస్ కార్డు ఉందా? దాంతో లాభాలేంటో తెలుసుకోండి మరి! | Benefits of contactless cards

Contactless payments are safe and highly secure. They have the same protection as chip & PIN payments, making them safer than cash. Contactless cards and devices are also embedded with multiple layers of security to protect you against fraud.
Story first published: Saturday, October 19, 2019, 12:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X