For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు చాలా భద్రం, ఎందుకో తెలుసా?

|

భారతదేశంలో బ్యాంకులో ఖాతా కలిగిన ప్రతి ఒక్కరికి డెబిట్ కార్డు ఉంటుంది. గత కొన్నేళ్లుగా డెబిట్ కార్డు మోసాలు, ఏటీఎం మోసాలు పెరుగుతున్నప్పటికీ వాటి వినియోగం మాత్రం గణనీయంగానే ఉంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం డిజిటలైజేషన్‌ను ప్రోత్సహిస్తోంది. పబ్లిక్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు, ఆర్బీఐ ఎప్పటికప్పుడు డెబిట్ కార్డు ఫ్రాడ్స్ పైన చర్యలకు ప్రయత్నాలు చేస్తోంది. అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఫ్రాడ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వినియోగదారుడిది కూడా.

ఆన్ లైన్ నేరాలు..

ఆన్ లైన్ నేరాలు..

ఒక వ్యక్తి పర్సనల్ డిటైల్స్, మీ బ్యాంకు ఖాతా వివరాలను ఆన్ లైన్ ద్వారా కనుగునేందుకు నేరగాళ్లకు అనేక మార్గాలు ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా ప్రాడ్‌స్టర్స్ కూడా అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మీరు ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా నెట్ వర్క్స్ పైన ఎక్కువ సమయం గడుపుతారు. అక్కడి నుంచి మీ పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్, ఈమెయిల్ వంటి అడ్రస్‌లు తీసుకుంటారు.

డెబిట్ కార్డుకు బదులు క్రెడిట్ కార్డు

డెబిట్ కార్డుకు బదులు క్రెడిట్ కార్డు

ఫ్రాడస్టర్స్ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు దొంగిలించడానికి అనేక కొత్త మార్గాలు చూస్తున్నారని, ఇలాంటి సమయంలో డెబిట్ కార్డును సాధ్యమైనంత ఉపయోగించకుండా తమను తాము కాపాడుకోవాలని చెబుతున్నారు. డెబిట్ కార్డుకు బదులు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే మంచిదని సూచిస్తున్నారు.

క్రెడిట్ కార్డుకు పరిమితి ఉంటుంది

క్రెడిట్ కార్డుకు పరిమితి ఉంటుంది

- బ్యాంకులు జారీ చేసే క్రెడిట్ కార్డులపై క్రెడిట్ పరిమితి ఉంటుంది. కాబట్టి దీని ద్వారా ఫ్రాడ్ చేయాలనుకున్నప్పటికీ పెద్ద మొత్తంలో చేయలేని పరిస్థితి. ఆయా కార్డు పరిమితిని మించి ఫ్రాడ్ చేయలేడు.

- మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించినప్పుడు బ్యాంకుకు సంబంధించిన డబ్బును మీరు ఉపయోగిస్తున్నట్లు. అదే సమయంలో మీ డబ్బు బ్యాంకులో ఉంటే దానిపై వడ్డీ వస్తుంది.

- మీరు మీ క్రెడిట్ కార్డు డ్యూస్‌ను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా నెలాఖరులోగా చెల్లించాలి.

క్రెడిట్ కార్డు ద్వారా నష్టపోతే.. డెబిట్ కార్డు ద్వారా నష్టపోతే...

క్రెడిట్ కార్డు ద్వారా నష్టపోతే.. డెబిట్ కార్డు ద్వారా నష్టపోతే...

- డేటా ఉల్లంఘన విషయానికి వస్తే... మీ క్రెడిట్ కార్డుపై జరిగే ఫ్రాడ్‌కు మీరు పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు మోసాన్ని పసిగట్టిన వెంటనే బ్యాంకుకు కార్డు రద్దు కోసం తెలియజేయాలి.

- అదే సమయంలో క్రెడిట్ కార్డు విషయంలో చీటింగ్ జరిగితే మీ బ్యాంకు అకౌంట్‌లోని డబ్బు నష్టపోతారు. మీరు దానిని తిరిగి పొందాలన్న ఇబ్బందికరమే. ఇక మీ సొంత అజాగ్రత్త వల్ల మోసం జరిగితే డబ్బును అసలే పొందలేరు.

క్రెడిట్ కార్డులు సురక్షితం

క్రెడిట్ కార్డులు సురక్షితం

- క్రెడిట్ కార్డులు చాలా విస్తృతంగా ఉపయోగించవచ్చు. ఇంటర్నేషనల్ వెబ్ సైట్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

- దేశంలో లేక విదేశాల్లో విహార యాత్రకు వెళ్లినప్పుడు క్రెడిట్ కార్డులు సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటాయి.

బ్యాలెన్స్ తనిఖీ చేయండి

బ్యాలెన్స్ తనిఖీ చేయండి

- ఎలాంటి ఫ్రాడ్‌కు గురి కాకుండా ఉండేందుకు మీ బ్యాలెన్సును, లావాదేవీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను తరుచూ పరిశీలించండి.

- అవసరమైతే మీరు మీ కార్డులోని CVV నెంబర్‌ను కూడా తుడిచివేయవచ్చు. ఎప్పుడైనా కార్డు దొంగతనానికి గురైతే దానిని ఫ్రాడస్టర్స్ ఉపయోగించకుండా చేసే అవకాశం ఉంటుంది.

Read more about: credit cards bank
English summary

డెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు చాలా భద్రం, ఎందుకో తెలుసా? | Why Are Credit Cards Safer Than Debit Cards?

Anyone who holds a bank account in India has a debit card. Despite a large number of debit card and ATM frauds reported in the last few years, their use has been significantly high, thanks to its wide reach and acceptance at a time when the Indian government is pushing digital transactions.
Story first published: Wednesday, September 11, 2019, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X