For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI క్యాష్ విత్‌డ్రా లిమిట్: ఏ డెబిట్ కార్డుకు ఎంత నగదు తీయవచ్చు?

|

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ రకాల డెబిట్ కార్డులపై ఏటీఎం నుంచి ఉపసంహరణలపై పరిమితులు విధిస్తోంది. గత ఏడాది నవంబర్ నెలలో క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులపై ఉపసంహరణ పరిమితిని సగానికి తగ్గించింది. కార్డులు, వేరియంట్‌ను బట్టి ఎస్బీఐ కార్డులకు వేర్వేరు నగదు ఉపసంహరణలు వర్తిస్తాయి. ఎస్బీఐ కస్టమర్లు ఓ నెలలో 8 నుంచి 10 సార్లు ఏటీఎం నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా డబ్బులు తీసుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్ పరిమితి దాటితే ఎస్బీఐ కొంత చార్జ్ చేస్తుంది. ఏటీఎంలో తగినంత బ్యాలెన్స్ లేకుండా లావాదేవీలు జరిపితే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎస్బీఐ కొంత ఛార్జ్ చేయనుంది. ఇదిలా ఉండగా, ఏ డెబిట్ కార్డుకు ఎస్బీఐ పరిమితి ఎంతనో కింద చూడండి...

క్రెడిట్‌కార్డ్‌తో పెట్రోల్ కొట్టించుకుంటున్నారా.. జాగ్రత్తక్రెడిట్‌కార్డ్‌తో పెట్రోల్ కొట్టించుకుంటున్నారా.. జాగ్రత్త

SBI క్లాసిక్ అండ్ మాస్ట్రో డెబిట్ కార్డులు

SBI క్లాసిక్ అండ్ మాస్ట్రో డెబిట్ కార్డులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువగా ఇచ్చే ఏటీఎం కమ్ డెబిట్ కార్డుల్లో ఇది ఒకటి.

ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పరిమితి.. కనీసం రూ.100. గరిష్టం రూ.20,000

SBI గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు

SBI గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు

ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుతో మీకు కావాల్సినప్పుడు అలాగే ఎక్కడైనా మీ అకౌంట్‌కు యాక్సెస్ లభిస్తుంది.

ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పరిమితి.. కనీసం రూ.100. గరిష్టం రూ.40,000

SBI గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు

SBI గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు

ఎస్బీఐ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డును వ్యాపార సంస్థలలో వస్తువుల కొనుగోలుకు వినియోగించవచ్చు. అలాగే ఆన్ లైన్ పేమెంట్స్ కోసం, ప్రపంచవ్యాప్తంగా నగదు ఉపసంహరణకు ఉపయోగించుకోవచ్చు.

ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పరిమితి.. కనీసం రూ.100. గరిష్టం రూ.50,000

SBI ప్లాటినమ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు

SBI ప్లాటినమ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు

ఎస్బీఐ ప్లాటినమ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుతో ఆన్‌లైన్ పేమెంట్స్ చేయవచ్చు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నగదును ఉపసంహరించుకోవచ్చు.

ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పరిమితి.. కనీసం రూ.100. గరిష్టం రూ.1,00,000

డెబిట్ కార్డు మోసాలకు యోనో చెక్

డెబిట్ కార్డు మోసాలకు యోనో చెక్

డెబిట్ కార్డు మోసాల గురించి తెలిసిందే. డెబిట్ కార్డు మోసాలను అరికట్టేందుకు ఎస్బీఐ యోనో యాప్ తీసుకు వచ్చింది. డెబిట్ కార్డు లేకుండానే యోనో యాప్ ద్వారా మీరు ఎంచుకున్న ఏటీఎం సెంటర్ నుంచి నగదును ఉపసంహరించుకోవచ్చు. యోనో.. ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ ఫామ్. కస్టమర్లు యోనో ద్వారా చెల్లింపులు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు.

కార్డు ఛార్జీలు

కార్డు ఛార్జీలు

ఎస్బీఐ కార్డుకు ఇతర ఛార్జీలు ఉంటాయి. మెయింటెనెన్స్ కింద ఏడాదికి రూ.125 ప్లస్ జీఎస్టీ ఛార్జ్ చేస్తారు. అలాగే, కార్డు రీప్లేస్‌మెంట్ వంటి వాటికి రూ.300 ప్లస్ జీఎస్టీ ఛార్జ్ చేస్తారు.

English summary

SBI క్యాష్ విత్‌డ్రా లిమిట్: ఏ డెబిట్ కార్డుకు ఎంత నగదు తీయవచ్చు? | SBI daily atm cash withdrawal limit for different debit cards

Effective 1st October, SBI will also charge for transaction decline due to insufficient balance at ATMs.
Story first published: Friday, September 27, 2019, 6:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X