For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో ఫైబర్: ఏ ప్లాన్ ఎంత, ఏ ప్లాన్‌తో ప్రయోజనం.. అన్ని వివరాలు...

|

రిలయన్స్ జియో సరికొత్త అద్భుతమైన ఇంటర్నెట్ ఆఫర్లతో ముందుకు వచ్చింది. చాలారోజులుగా దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూస్తున్న ఫైబర్ సేవలను గురువారం 1,600 నగరాల్లో ప్రారంభించింది. మినిమం 100Mbps స్పీడ్ నుంచి గరిష్టంగా 1Gbps స్పీడ్ వరకు వివిధ రకాల ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది. అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బాండ్‌తో పాటు దేశంలో ఎక్కడికైనా ఉచిత వాయిస్ కాల్, టీవీ ద్వారా వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ సౌకర్యం వంటివి కూడా ప్రకటించింది.

జియో బ్రాడ్‌బాండ్, సెట్ టాప్ బాక్స్ ఉచితంజియో బ్రాడ్‌బాండ్, సెట్ టాప్ బాక్స్ ఉచితం

రిలయన్స్ జియో ప్లాన్స్ రూ.699 నుంచి రూ.8,499 వరకు

రిలయన్స్ జియో ప్లాన్స్ రూ.699 నుంచి రూ.8,499 వరకు

రిలయన్స్ జియో ప్లాన్స్ రూ.699 నుంచి రబ.8.499 వరకు ఉన్నాయి. హైస్పీడ్ ఇంటర్నెట్, ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తుంది. లోయెస్ట్ టారిఫ్ 100Mbps ఉండగా 1Gbps గరిష్టం. అన్ని ప్లాన్స్‌లోను అన్ని సేవలు అందిస్తున్నారు. మొత్తం ఆరు రకాల ప్లాన్స్ అందిస్తోంది.

ప్రతి కనెక్షన్‌తో ఇచ్చేవి...

ప్రతి కనెక్షన్‌తో ఇచ్చేవి...

- జియో హైడెఫినేషన్ (HD) సెట్ టాప్ బాక్స్

- రోటర్ (జియో హోమ్ గేట్ వే)

- దేశంలో ఎక్కడికైనా ఉచితంగా వాయిస్ కాల్ చేసుకునే ల్యాండ్ లైన్ ఫోన్.

- టెలివిజన్ నుంచి వీడియో కాల్స్, కాన్ఫరెన్స్ సదుపాయం

- జీరో లెటెన్సీ గేమింగ్

- కంటెంటును ఇంట్లో, బయట భిన్న పరికరాల్లో ఉపయోగించవచ్చు.

- 5 డివైజ్‌ల వరకు భద్రత

ఆఫర్ ఎంత, ముందు ఎంత చెల్లించాలి?

ఆఫర్ ఎంత, ముందు ఎంత చెల్లించాలి?

రూ.699 స్కీం వారికి మూడు నెలల పాటు జియో సినిమా, జియో సావన్ OTT యాప్స్, రూ.899 స్కీం వాళ్లకు మూడు నెలల వరకు OTT యాప్స్ అన్నీ ఫ్రీ. రూ.1,299 నుంచి ఆ పైన స్కీం వారికి అద్దె స్కీం కింద ఏడాది పాటు OTT యాప్స్ కంటెంట్ ఉచితం.

జియో గిగా ఫైబర్ కావాలనుకునే ప్రతి కస్టమర్ ప్రారంభంలో రూ.2500 చెల్లించాలి. ఇందులో రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్. మరో రూ.1000 ఇన్‌స్టాలేషన్ ఛార్జ్.

కనెక్షన్ పొందటం ఎలా?

కనెక్షన్ పొందటం ఎలా?

జియో వెబ్‌సైట్‌ను సందర్శించి జియో ఫైబర్ కనెక్షన్ కోసం నమోదు చేసుకోవాలి. మీ పేరు, చిరునామా, మొబైల్‌ నెంబర్‌, ఈ మెయిల్ ఐడీ వివరాలను ఇవ్వాలి. మీ ప్రాంతంలో సేవలు ప్రారంభమైతే జియో ప్రతినిధులు మీ వద్దకు వచ్చి కనెక్షన్‌ ఇస్తారు. వారికి కావాల్సిన డాక్యుమెంట్స్, దరఖాస్తు ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తారు.

https://gigafiber.jio.com/registration

వెల్‌కం ఆఫర్స్

వెల్‌కం ఆఫర్స్

రిలయన్స్‌ జియో వెల్ కమ్ ఆఫర్లను ప్రకటించింది. ఆయా వార్షిక ప్లాన్ల ఆధారంగా ఈ బహుమతులున్నాయి. బ్రాంజ్‌ ప్లాన్‌పై రెండు 6 వాట్స్ స్పీకర్లు (విలువ రూ.2,999), సిల్వర్ ప్లాన్‌పై రెండు 12వాట్స్ స్పీకర్లు (రూ.3,999), గోల్డ్, డైమండ్ ప్లాన్స్‌పై 24 అంగుళాల హెచ్‌డీ టీవీ (రూ.12,990), ప్లాటినం ప్లాన్‌పై 32 అంగుళాల హెచ్‌డీ టీవీ (రూ.32,990), టైటానియం ప్లాన్‌తో 43 అంగుళాల 4కే టీవీ (రూ.44,990) ఉచితంగా అందిస్తారు.

రూ.699 బ్రాంజ్ ప్లాన్.. వివరాలు

రూ.699 బ్రాంజ్ ప్లాన్.. వివరాలు

- రిలయన్స్ జియో మినిమం రూ.699 బ్రాంజ్ ప్లాన్.

- నెలకు రూ.699

- స్పీడ్: 100mbps వరకు

- బెనిఫిట్స్: 30 రోజుల వరకు హైస్పీడ్ డేటా (100GB+50 GB ఎక్స్‌ట్రా)

- లాండ్ లైన్ ఫోన్ నుంచి ఇండియాలో ఎక్కడైనా ఉచిత వాయిస్ కాల్స్

- వీడియోకాలింగ్/కాల్ కాన్ఫరెన్సింగ్ (సంవత్సరానికి రూ.1,200 విలువైనది)

- గేమింగ్: (సంవత్సరానికి రూ.1,200 విలువైనది)

- నెట్ వర్కింగ్ సర్వీసెస్: ఇంట్లో, బయట కంటెంట్‌ను భిన్న పరికరాల్లో ఉపయోగించవచ్చు.

- డివైస్ సెక్యూరిటీ : రూ.999 విలువ కలిగిన ఐదు డివైసెస్‌లు ఏడాదికి

- గిఫ్ట్- రూ.2,999 విలువ కలిగిన మ్యూజ్ 6W స్పీకర్

రూ.849 సిల్వర్ ప్లాన్.. వివరాలు

రూ.849 సిల్వర్ ప్లాన్.. వివరాలు

- రిలయన్స్ జియో రెండో ప్లాన్ రూ.849 సిల్వర్ ప్లాన్.

- నెలకు రూ.849

- స్పీడ్: 100mbps వరకు

- ప్లాన్ బెనిఫిట్స్: 30 రోజుల వరకు హైస్పీడ్ డేటా (200GB+200 GB ఎక్స్‌ట్రా)

- లాండ్ లైన్ ఫోన్ నుంచి ఇండియాలో ఎక్కడైనా ఉచిత వాయిస్ కాల్స్

- వీడియోకాలింగ్/కాల్ కాన్ఫరెన్సింగ్ (సంవత్సరానికి రూ.1,200 విలువైనది)

- గేమింగ్: (సంవత్సరానికి రూ.1,200 విలువైనది)

- నెట్ వర్కింగ్ సర్వీసెస్: ఇంట్లో, బయట కంటెంట్‌ను భిన్న పరికరాల్లో ఉపయోగించవచ్చు.

- డివైస్ సెక్యూరిటీ : రూ.999 విలువ కలిగిన ఐదు డివైసెస్‌లు ఏడాదికి

- గిఫ్ట్- రూ.3,999 విలువ కలిగిన Thump2 12W స్పీకర్స్.

రూ.1,299 గోల్డ్ ప్లాన్.. వివరాలు

రూ.1,299 గోల్డ్ ప్లాన్.. వివరాలు

- రిలయన్స్ జియో గిగా ఫైబర్ మూడో ప్లాన్ గోల్డ్.

- నెలకు రూ.1,299

- స్పీడ్: 250mbps వరకు

- ప్లాన్ బెనిఫిట్స్: 30 రోజుల వరకు హైస్పీడ్ డేటా (500GB+250 GB ఎక్స్‌ట్రా)

- లాండ్ లైన్ ఫోన్ నుంచి ఇండియాలో ఎక్కడైనా ఉచిత వాయిస్ కాల్స్

- నెట్ వర్కింగ్ సర్వీసెస్: ఇంట్లో, బయట కంటెంట్‌ను భిన్న పరికరాల్లో ఉపయోగించవచ్చు.

- డివైస్ సెక్యూరిటీ : రూ.999 విలువ కలిగిన ఐదు డివైసెస్‌లు ఏడాదికి

రూ.2,499 డైమండ్ ప్లాన్.. వివరాలు

రూ.2,499 డైమండ్ ప్లాన్.. వివరాలు

- రిలయన్స్ జియో గిగా ఫైబర్ నాలుగో ప్లాన్ డైమండ్.

- నెలకు రూ.2,499 చెల్లించాలి.

- స్పీడ్: 500mbps వరకు

- ప్లాన్ బెనిఫిట్స్: 30 రోజుల వరకు అన్‌లిమిటెడ్ హైస్పీడ్ డేటా (1250GB+250 GB ఎక్స్‌ట్రా)

- లాండ్ లైన్ ఫోన్ నుంచి ఇండియాలో ఎక్కడైనా ఉచిత వాయిస్ కాల్స్

- వీడియోకాలింగ్/కాల్ కాన్ఫరెన్సింగ్ (సంవత్సరానికి రూ.1,200 విలువైనది)

- గేమింగ్: (సంవత్సరానికి రూ.1,200 విలువైనది)

- నెట్ వర్కింగ్ సర్వీసెస్: ఇంట్లో, బయట కంటెంట్‌ను భిన్న పరికరాల్లో ఉపయోగించవచ్చు.

- డివైస్ సెక్యూరిటీ : రూ.999 విలువ కలిగిన ఐదు డివైసెస్‌లు ఏడాదికి

- గిఫ్ట్- రూ.12,990 విలువ కలిగిన 24 ఇంచుల HD టీవీ

- VR ఎక్స్‌పీరియన్స్: వీఆర్ హెడ్ సెట్‌ ద్వారా థియేటర్ లైక్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్

- ప్రీమియం కంటెంట్ : ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీస్, స్పెషల్ స్పోర్ట్స్ కంటెంట్

రూ.3,999 ప్లాటినమ్ ప్లాన్.. వివరాలు

రూ.3,999 ప్లాటినమ్ ప్లాన్.. వివరాలు

- రిలయన్స్ జియో గిగా ఫైబర్ ఐదో ప్లాన్ ప్లాటినమ్

- నెలకు రూ.3,999 చెల్లించాలి.

- స్పీడ్: 1Gbps వరకు

- ప్లాన్ బెనిఫిట్స్: 30 రోజుల వరకు అన్‌లిమిటెడ్ హైస్పీడ్ డేటా (2500 GB)

- లాండ్ లైన్ ఫోన్ నుంచి ఇండియాలో ఎక్కడైనా ఉచిత వాయిస్ కాల్స్

- వీడియోకాలింగ్/కాల్ కాన్ఫరెన్సింగ్ (సంవత్సరానికి రూ.1,200 విలువైనది)

- గేమింగ్: (సంవత్సరానికి రూ.1,200 విలువైనది)

- నెట్ వర్కింగ్ సర్వీసెస్: ఇంట్లో, బయట కంటెంట్‌ను భిన్న పరికరాల్లో ఉపయోగించవచ్చు.

- డివైస్ సెక్యూరిటీ : రూ.999 విలువ కలిగిన ఐదు డివైసెస్‌లు ఏడాదికి

- VR ఎక్స్‌పీరియన్స్: వీఆర్ హెడ్ సెట్‌

- ప్రీమియం కంటెంట్ : ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీస్, స్పెషల్ స్పోర్ట్స్ కంటెంట్

రూ.8,499 టైటానియమ్ ప్లాన్.. వివరాలు

రూ.8,499 టైటానియమ్ ప్లాన్.. వివరాలు

- రిలయన్స్ జియో గిగా ఫైబర్ చివరి.. ఆరో ప్లాన్ టైటానియమ్

- నెలకు రూ.8,499 చెల్లించాలి.

- స్పీడ్: 1Gbps వరకు

- ప్లాన్ బెనిఫిట్స్: 30 రోజుల వరకు అన్‌లిమిటెడ్ హైస్పీడ్ డేటా (5000 GB)

- లాండ్ లైన్ ఫోన్ నుంచి ఇండియాలో ఎక్కడైనా ఉచిత వాయిస్ కాల్స్

- వీడియోకాలింగ్/కాల్ కాన్ఫరెన్సింగ్ (సంవత్సరానికి రూ.1,200 విలువైనది)

- గేమింగ్: (సంవత్సరానికి రూ.1,200 విలువైనది)

- నెట్ వర్కింగ్ సర్వీసెస్: ఇంట్లో, బయట కంటెంట్‌ను భిన్న పరికరాల్లో ఉపయోగించవచ్చు.

- డివైస్ సెక్యూరిటీ : రూ.999 విలువ కలిగిన ఐదు డివైసెస్‌లు ఏడాదికి

- VR ఎక్స్‌పీరియన్స్: వీఆర్ హెడ్ సెట్‌

- ప్రీమియం కంటెంట్ : ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీస్, స్పెషల్ స్పోర్ట్స్ కంటెంట్

ఏడాది స్కీంలకు...

ఏడాది స్కీంలకు...

రూ.699-రూ.849 నెలవారీ అద్దె పథకాలకు వార్షికంగా చెల్లిస్తే బ్లూటూత్ స్పీకర్, రూ.1299 అద్దెను రెండేళ్లకు చెల్లిస్తే 4 అంగుళాల HD టీవీ, రూ.2499 అద్దెను ఏడాదికి చెల్లిస్తే 24 అంగుళాల టీవీ, రూ.3999 అద్దెను ఏడాదికి చెల్లిస్తే 32 అంగుళాల టీవీ, రూ.8499 అద్దెను ఏడాదికి చెల్లిస్తే 43 అంగుళాల 4K ఎల్ఈడీ, 4K సెట్ టాప్ బాక్స్ ఉచితంగా ఇస్తారు. ఫైనాన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు...

గుర్తుంచుకోవాల్సిన విషయాలు...

జియో గిగా ఫైబర్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. పరిమితి దాటిన తర్వాత ఇంటర్నెట్ వేగం 1ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. అలాగే టీవీ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్ సదుపాయాలు వినియోగించుకునేందుకు అనువైన పరికరాలను కస్టమర్లు సమకూర్చుకోవాలి.

ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీస్ వీరికే...

ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీస్ వీరికే...

కొత్త సినిమాలను విడుదల రోజే ఇంట్లోనే వీక్షించేంచేందుకు రూ.2499 అంతకంటే ఎక్కువ అద్దె పథకాలు చెల్లించిన వారికే ఉంటుంది. రూ.2499 అంతకంటే ఎక్కువ స్కీం పథకాలకు వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్‌తో సినిమా థియేటర్ అనుభవంతో వీడియోలు వీక్షించవచ్చు. అయితే ఇది వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతుంది.

సెట్ టాప్ బాక్స్ ఉచితం

సెట్ టాప్ బాక్స్ ఉచితం

ప్రతి నెల రూ.1,299 నుంచి 8,499 ప్లాన్స్ వార్షిక చందాదారులకు ఉచితంగా HD లేదా 4K ఎల్‌ఈడీ టీవీ, 4K సెట్ టాప్ బాక్స్ ఇస్తారు. ఈ సెట్ టాప్ బాక్సులు కేబుల్ ఆపరేటర్ల నుంచి నేరుగా టీవీ సిగ్నల్స్‌ను తీసుకోగలుగుతాయి. ఇప్పటికే హాత్‌వే, డీఈఎన్‌, జీటీపీఎల్‌లో రిలయన్స్‌ మెజార్టీ వాటాలు దక్కించుకుంది. జియో సెట్ టాప్ బాక్సుతో ఓ కెమెరాను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే వీడియో కాల్స్‌ను టీవీల్లో కూడా చూస్తూ మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది.

English summary

జియో ఫైబర్: ఏ ప్లాన్ ఎంత, ఏ ప్లాన్‌తో ప్రయోజనం.. అన్ని వివరాలు... | Reliance launches JioFiber: Here are all the details

India's youngest and only profitable telecom service provider, Reliance Jio on Thursday formally launched its wired broadband offering JioFiber across 1,600 cities in India.
Story first published: Friday, September 6, 2019, 9:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X