For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PF Transfer: ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్‌ను ఇలా ట్రాన్సుఫర్ చేయండి

|

న్యూఢిల్లీ: ఉద్యోగం మారుతున్నారా? అయితే ఇది మీకోసమే! ఓ కంపెనీ నుంచి మరో కొత్త కంపెనీలోకి వెళ్లినప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్‌ను మార్చుకోవడం తప్పనిసరి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఓ ఉద్యోగి వేతనం నుంచి ప్రతి నెల పీఎఫ్ కింద కొంత మొత్తం కట్ అవుతుంది. యాజమాన్యం కూడా అంతే మొత్తం యాడ్ చేస్తుంది. అయితే, చాలామంది వివిధ కారణాల వల్ల ఉద్యోగం మారుస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి మార్చాలి.

జగన్ రూ.58 కోట్లు ఆదా చేశారా? సేవింగ్ పేరుతో రూ.32వేలకోట్లు!జగన్ రూ.58 కోట్లు ఆదా చేశారా? సేవింగ్ పేరుతో రూ.32వేలకోట్లు!

ఇక్కడ ఉద్యోగికి రెండు ఆప్షన్స్

ఇక్కడ ఉద్యోగికి రెండు ఆప్షన్స్

ఉద్యోగికి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఓ కంపెనీలో ఉద్యోగం మానివేసిన తర్వాత నెల తర్వాత కూడా మరో ఉద్యోగంలో చేరకుంటే కొంత మొత్తం, రెండు నెలల పాటు చేరకుంటే పీఎఫ్ అకౌంట్ నుంచి మిగిలిన మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉంది. ఇది మొదటి ఆప్షన్ కాగా.. రెండో ఆప్షన్ ప్రస్తుత కంపెనీకి పీఎఫ్ అకౌంట్ మార్చుకోవచ్చు.

యూఏఎన్ లింక్ చేస్తుంది

యూఏఎన్ లింక్ చేస్తుంది

ఈపీఎఫ్ అకౌంట్‌ను ఎప్పటికప్పుడు సరళీకృతం చేసింది. టెక్నాలజీ విప్లవానికి అనుగుణంగా ఈపీఎఫ్‌ను కూడా మార్చి పీఎఫ్ ట్రాన్సుఫర్, పీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేస్తోంది. EPFO యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN)ను ప్రవేశపెట్టింది. ఒకే మెంబర్‌కు కేటాయించిన వివిధ ఈపీఎఫ్ అకౌంట్స్‌ను ఇది లింక్ చేయడానికి ఉపయోగపడింది.

ఇవి అవసరం...

ఇవి అవసరం...

ఆన్‌లైన్ ట్రాన్సుఫర్ క్లెయిమ్ పోర్టల్ ద్వారా పీఎఫ్ ట్రాన్సుపర్ సాధ్యమైనప్పటికీ UAN ప్రవేశపెట్టడంతో బదలీ ప్రక్రియ సవరించబడింది. దీనిని ఏకీకృత పోర్టల్ కిందకు మార్చబడింది. పీఎఫ్ అకౌంట్‌ను బదలీ చేసుకునేందుకు కొన్ని డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. అవేమంటే..

- సభ్యుడు తన UAN నెంబర్‌ను UAN పోర్టల్‌లో యాక్టివేట్ చేసి ఉండాలి.

- యాక్టివేషన్ కోసం ఉపయోగించే మొబైల్ నెంబర్ కూడా యాక్టివేషన్‌లో ఉండాలి.

- బ్యాంకు అకౌంట్, బ్యాంకు IFSC కోడ్ ఉండాలి.

- ఈ-కేవైసీకి ఎంప్లాయర్ అప్రూవల్ ఉండాలి.

- పాత కంపెనీ/కొత్త కంపెనీకి చెందిన వారి డిజిటల్ రిజిస్ట్రేషన్ సంతకాలు కలిగి ఉండాలి.

- పాత మరియు కొత్త ఎంప్లాయర్‌కు చెందిన పీఎఫ్ అకౌంట్ నెంబర్‌ను ఈపీఎఫ్ డేటా బేస్‌లో పేర్కొనాలి.

- ఈపీఎఫ్ఓ చూపిస్తున్న వ్యక్తిగత సమాచారం, పీఎఫ్ ఖాతా సంబంధిత సమాచారం సరైనదేనా నిర్ధారించుకోవాలి.

పీఎఫ్ బ్యాలెన్స్ బదలీ ఇలా చేయండి...

పీఎఫ్ బ్యాలెన్స్ బదలీ ఇలా చేయండి...

- తొలుత ఈపీఎఫ్ఓ పోర్టల్‌కు వెళ్లాలి. అక్కడ UAN నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత One Member - One EPF Account (Transfer Request)' పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత మీ వ్యక్తిగత సమాచారం, పీఎఫ్ అకౌంట్ వివరాలు అక్కడ కనిపిస్తాయి. ప్రస్తుత కంపెనీకి సంబంధించినవి ఉంటాయి. వాటిని ధృవీకరించండి.

- ఈపీఎఫ్ నెంబర్, పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ జాయినింగ్ వంటి వివరాలు ఉంటాయి.

- Get details పైన క్లిక్ చేస్తే పాత కంపెనీకి చెందిన పీఎఫ్ అకౌంట్ డిటైల్స్ కనిపిస్తాయి.

- మీ పాత కంపెనీ లేదా కొత్త కంపెనీ కన్‌ఫర్మ్ చేసినట్లుగా ఆధారం ఏదో ఒకదానిని ఎంచుకోవాలి. యజమానులలో ఎవరినైనా ఎంచుకున్న తర్వాత ఐడీ/యూఏఎన్ అందించాలి.

- Get OTP పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. OTPని ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్ పైన క్లిక్ చేయండి.

- అప్పుడు ఎంప్లాయర్ డిజిటల్‌గా మీ ఈపీఎఫ్ ట్రాన్సుఫర్ రిక్వెస్ట్‌ను అప్రూవ్ చేయాలి. యూనిఫైడ్ పోర్టల్ ఇంటర్ ఫేస్‌ను యాక్సెస్ చేయడం ద్వారా ఆమోదిస్తారు.

- ఆ తర్వాత ఫామ్ 13 ఫిల్ చేయాలి. పాత కంపెనీ, కొత్త కంపెనీ పీఎఫ్ అకౌంట్ నెంబర్స్ పేర్కొనాలి. పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్ లోడ్ చేసుకోవాలి.

- ఆ తర్వాత దానిపై సంతకం చేసి గత కంపెనీకి పంపించాలి.

- మీ పాత కంపెనీకి ఈపీఎఫ్ ట్రాన్సుఫర్‌కు సంబంధించిన ఆన్ లైన్ నోటిఫికేషన్ వెళ్తుంది.

- ఎంప్లాయిమెంట్ వివరాలను వెరిఫై చేసిన తర్వాత కంపెనీ మీ క్లెయిమ్‌ను ఈపీఎఫ్ఓ ఆఫీస్‌కు డిజిటల్‌గానే ట్రాన్సుఫర్ చేస్తుంది. ఈపీఎఫ్ఓ ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది.

- ఆన్ లైన్ సర్వీసెస్‌కు వెళ్లి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.

English summary

PF Transfer: ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్‌ను ఇలా ట్రాన్సుఫర్ చేయండి | PF Transfer: Procedure for EPF Transfer

Once an individual starts his career by taking up employment in any of the PF registered organization, an employee would be registered for PF purpose and both employee and employer contributions to employee’s PF and the fund earns interest till withdrawal.
Story first published: Sunday, September 22, 2019, 19:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X