For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్ న్యూస్: ఆధార్ కార్డులో ఈ మార్పులకు ప్రూఫ్స్ అవసరంలేదు

|

న్యూఢిల్లీ: ఆధార్ అప్‌డేషన్‌పై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) శుక్రవారం మరింత స్పష్టతను ఇచ్చింది. సాధారణంగా ఆధార్ కార్డులో ఏ మార్పులు చేసుకోవాలన్నా పాస్‌పోర్టు, టెంత్ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ వంటివి ఏదో ఒకటి ఉండాలి. అయితే ఆధార్‌లో కొన్ని మార్పులు చేసుకోవడానికి మాత్రం ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదని UIDAI అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది.

SBI క్రెడిట్ కార్డు బిల్లును ఏటీఎం ద్వారా ఎలా చెల్లించాలి?SBI క్రెడిట్ కార్డు బిల్లును ఏటీఎం ద్వారా ఎలా చెల్లించాలి?

వీటికి డాక్యుమెంటేషన్ అవసరం లేదు

మీ ఆధార్ కార్డులోని బయోమెట్రిక్స్, ఫోటోగ్రాఫ్, జెండర్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి అప్‌డేషన్స్‌కు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదని తెలిపింది. కేవలం మీరు మీ ఆధార్ కార్డును మీ దగ్గరలోని ఆధార్ కేంద్రానికి తీసుకు వెళ్తే సరిపోతుందని తెలిపింది. ఫోటో, ఫింగర్ ఫ్రింట్, ఐరిష్ స్కాన్, జెండర్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ కోసం కేవలం ఏదైనా ఆధార్ కేంద్రానికి ఆధార్ కార్డుతో సహా వెళ్తే చాలునని పేర్కొంది.

వీటికి మాత్రం ఆధార్ అవసరం

వీటికి మాత్రం ఆధార్ అవసరం

అయితే పేరు, పుట్టిన తేదీ, చిరునామా మార్చుకోవడానికి మాత్రం అవసరమైన డాక్యుమెంట్స్ అవసరమని స్పష్టం చేసింది. పాస్‌పోర్టు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, టెంత్ మెమో.. ఏదైనా డాక్యుమెంట్ అవసరమని తెలిపింది.

ఆధార్ కార్డు కోసం ఇవి అవసరం...

ఆధార్ కార్డు కోసం ఇవి అవసరం...

ఆధార్ కార్డు కావాలంటే UIDAI యాక్సెప్ట్ చేసే ఏవైనా ప్రూఫ్స్ సబ్‌మిట్ చేయాలి. ఆధార్ కార్డు కావాలన్నా, మార్పులు చేయాలన్నా కావాల్సిన డాక్యుమెంట్స్....

- పాస్‌పోర్ట్

- పాన్ కార్డు

- రేషన్ కార్డు లేదా పీడీఎస్ ఫోటో కార్డు

- ఓటర్ ఐడీ కార్డు

- డ్రైవింగ్ లైసెన్స్

- భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డు

- PSU ఇష్యూ చేసిన సర్వీస్ ఫోటో ఏడీ కార్డ్స్

- NREGS జాబ్ కార్డు

- గుర్తింపు పొందిన విద్యా సంస్థ ఇష్యూ చేసిన ఫోటో ఐడెంటిఫికేషన్

- బ్యాంకు ఏటీఎం కార్డు ఫోటో

- ఫోటో క్రెడిట్ కార్డు

- పెన్షనర్ ఫోటో కార్డు

- స్వాతంత్ర సమరయోధుడి ఫోటో కార్డు

- కిసాన్ ఫోటో పాస్ బుక్

- CGHS ఫోటో కార్డు

- మ్యారేజ్ సర్టిఫికెట్

- వివాహ రుజువు పత్రం

- పేరు మార్చుకోవడానికి చట్టబద్దంగా ఆమోదించబడిన సర్టిఫికేట్

- ECHS ఫోటో కార్డు

- పోస్ట్ డిపార్టుమెంట్ జారీ చేసిన పేరు, ఫోటో కలిగి ఉన్న దరఖాస్తుదారు చిరునామా కార్డు

English summary

గుడ్ న్యూస్: ఆధార్ కార్డులో ఈ మార్పులకు ప్రూఫ్స్ అవసరంలేదు | No document for update Photograph, Biometric, Gender, Mobile Number and Email ID in Aadhaar

No document required for update of Photograph, Biometrics, Gender, Mobile Number & Email ID in your Aadhaar. Just take your Aadhaar and visit any nearby Aadhaar Kendra.
Story first published: Friday, September 13, 2019, 15:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X