For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ కార్డులు పోయాయా? కంగారు పడకండి... ఇలా చేయండి

|

ఎవరి పర్సులో చూసినా డెబిట్, క్రెడిట్ కార్డులు తప్పనిసరిగా ఉంటాయి. నగదుకు బదులుగా కార్డులద్వారానే ఎక్కువగా చెల్లింపులు జరుగుతున్న నేటి కాలంలో ఈ కార్డులు తీసుకునేవారు, వాటితో చెల్లింపులు చేసేవారు పెరిగిపోతున్నారు. బస్సు ప్రయాణాల్లో, షాపింగ్ లేదా ఇతర సందర్భాల్లో దురదృష్టవశాత్తు పర్సు చేయిజారిపోవచ్చు. లేదా పర్సును ఎవరైనా దొంగిలించవచ్చు. ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా కంగారు పెరిగిపోతుంది. ఏం చేయాలో తోచదు. తమ కార్డులను ఎవరు దుర్వినియోగం చేస్తారోనని భయపడుతుంటారు. కొత్త మంది తమ కార్డుల పిన్ నెంబర్లకు కూడా పర్సులోనే దాచుకుంటారు. ఇలాంటి వారు మరీ ఎక్కువ కంగారు పడుతుంటారు. ఒకవేళ కార్డులను కోల్పోయిన సందర్భంలో కొన్ని పనులు చేయడం ద్వారా మీ కార్డులు దుర్వినియోగం కాకుండా చూసుకోవచ్చు. అవేమిటంటే....

SBI రూల్స్: మంత్లీ యావరేజ్, డిపాజిట్, విత్‌డ్రా మార్పులుSBI రూల్స్: మంత్లీ యావరేజ్, డిపాజిట్, విత్‌డ్రా మార్పులు

ముందు కార్డు బ్లాక్ చేయండి..

ముందు కార్డు బ్లాక్ చేయండి..

* కార్డులు కోల్పోయినట్టు గుర్తించిన వెంటనే సంభందిత బ్యాంకుకు చెందిన కాల్ సెంటర్ కు ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించాలి. డెబిట్ కార్డు అయితే కాల్ సెంటర్ నెంబర్ ను ఆ బ్యాంకు ఏటీఎం ద్వారా తెలుసుకోవచ్చు. లేదా బ్యాంకు శాఖ ద్వారా తెలుసుకొని బ్లాక్ చేయించవచ్చు. కాల్ సెంటర్ నెంబర్ బ్యాంక్ వెబ్ సైట్ లోను అందుబాటులో ఉంటుంది. గూగుల్ లో వెతకవచ్చు. అయితే కొంతమంది మోసకారులు బ్యాంక్ కాల్ సెంటర్ నెంబర్ పేరుతో తప్పు నెంబర్ చూపి మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కార్డును బ్లాక్ చేయవచ్చు. ఈ బ్యాంకు శాఖను సంప్రదించినా కూడా కార్డు పనిచేయకుండా చేస్తారు. అయితే దీనికి కొంత సమయం పడుతుంది. ఈ లోపే మీ కార్డుద్వారా ఏమైనా లావాదేవీలు జరిగితే ఆ భారం మీ పైనే పడుతుంది.

* మీ బ్యాంకు కాల్ సెంటర్ నెంబర్ ను మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోండి. క్రెడిట్, డెబిట్ కార్డుల వెనక భాగంలో కాల్ సెంటర్ నెంబర్లు ఉంటాయి. వాటిని కూడా మొబైల్ లో ఉంచుకోవడం వల్ల కార్డులు పోయినప్పుడు లేదా ఏదైనా అనధికారిక లావాదేవీలు జరిగినప్పుడు వెంటనే కాల్ చేసి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది.

* మీరు కార్డును బ్లాక్ చేయడానికి సంబంధించి ఫోన్ చేసినప్పుడు మీ కార్డు, మీకు సంబంధిన వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వివరాలు ఏదైనా బుక్కులో రాసి ఉంచుకోవడం మేలు.

ఎఫ్ఐఆర్ ముఖ్యం...

ఎఫ్ఐఆర్ ముఖ్యం...

* మీ కార్డులు దొంగతనానికి గురైన సందర్భాల్లో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేయించండి. ఒకవేళ మీ కార్డును దుర్వినియోగం చేసినప్పుడు అందుకు సంబంధించిన లాలావాదేవీ మీరు నిర్వహించలేదు అనడానికి ఇది ప్రూఫ్ గా పనికివస్తుంది. కాబట్టి ఆ మొత్తాన్ని మీరు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

* బ్యాంకు నుంచి మరో డూప్లికేట్ కార్డును పొందడానికి ఈ ఎఫ్ఐ ఆర్ కాపీ ఉపయోగ పడుతుంది.

* పర్సులో సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కార్డు, ఇతర కార్డులు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త కార్డులకోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఎఫ్ ఐ ఆర్ కాపీ దోహదపడుతుంది.

అవసరం ఉన్న కార్డుకే దరఖాస్తు చేయండి..

అవసరం ఉన్న కార్డుకే దరఖాస్తు చేయండి..

* కార్డులు పోయిన తర్వాత వాటిని బ్లాక్ చేస్తాం. తర్వాత కొత్త కార్డులకోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఒక్కసారి మీరు ఏయే కార్డులను ఎక్కువగా వినియోగిస్తున్నాయో చూసుకోండి. ఎక్కువగా వాడని కార్డులను మళ్ళి తీసుకోవడం వృధానే కదా. సాధారణంగా కార్డులకు వార్షికంగా ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మీకు అవసరం ఉన్న కార్డు కోసమే మళ్ళి దరఖాస్తు చేసుకోండి. దీనివల్ల మీపై భారం కూడా తగ్గుతుంది. అవసరం లేని కార్డు గురించి మీరు బ్యాంకుకు తెలియజేస్తే దానికి సంబంధించిన చార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

కార్డు స్టేట్ మెంట్ చూసుకోండి...

కార్డు స్టేట్ మెంట్ చూసుకోండి...

* కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించిన వెంటనే మొబైల్ నెంబర్కు ఎస్ ఎం ఎస్ వస్తుంది కదా.. మీరు కోల్పోయిన కార్డుకు సంబంధించి ఏమైనా లావాదేవీలు జరుగుతున్నాయా ఒక్కసారి చూసుకోండి. క్రెడిట్ కార్డు విషయంలో అయితే స్టేట్మెంట్ ను పరిశీలించండి. ఏమైనా తేడాలు ఉంటే కార్డు జారీ చేసిన బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు కంపెనీకి సమాచారం అందించండి.

ఇలా చేయండి..

ఇలా చేయండి..

* అవసరమైన కార్డులనే వెంట తీసుకువెళ్ళండి.

* పర్సులో కార్డులు సక్రమంగా ఉన్నదీ లేనిదీ చూసుకోండి. క్రమపద్ధతిలో పెట్టుకోండి.

* కాల పరిమితి అయిపోయిన కార్డులను పారవేసి మూడు దాన్ని కట్ చేయండి. కార్డు నెంబర్ కనబడకుండా కట్ చేయాలి.

* పిన్ నెంబర్లను కార్డు పైనగానీ, పర్సులోగాని రాసి ఉంచుకోవద్దు. దీనివల్ల పర్సు దొరికిన వారు వెంటనే దాని ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది.

* కార్డు నెంబర్లను ఇతరులకు మెసేజ్ చేయకండి. మీకు తెలిసినవారికి కూడా ఈ సమాచారం పంపవద్దు. అవసరమైతే ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు.

English summary

మీ కార్డులు పోయాయా? కంగారు పడకండి... ఇలా చేయండి | Missed your credit card? Don't worry

If you missed your card like Credit Card or Debit Card? Don't worry about that. You can do this.
Story first published: Wednesday, September 18, 2019, 17:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X