For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త ఫీచర్స్, గూగుల్‌పేను వెంటనే అప్‌డేట్ చేసుకోండి: ఇలా చేయండి...

|

మీరు గూగుల్ పే ఉపయోగిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. గూగుల్ కొన్ని కొత్త సదుపాయాలను తీసుకు వస్తోంది. ఈ మేరకు గురువారం గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో ఈ ప్రకటన చేసింది. ఇందులో ఒకటి టోకనైజ్డ్ కార్డ్స్, రెండోది స్పాట్ ప్లాట్‌ఫాం. టోకనైజేషన్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పేమెంట్ అప్లికేషన్‌కు డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఇప్పటి వరకు కేవలం యూపీఐ ఆధారిత చెల్లింపులను మాత్రమే అనుమతించింది. ఇప్పుడు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది.

హోమ్ లోన్, ఎంఎస్ఎంఈలకు శుభవార్త, 400 జిల్లాల్లో లోన్ మేళాహోమ్ లోన్, ఎంఎస్ఎంఈలకు శుభవార్త, 400 జిల్లాల్లో లోన్ మేళా

గూగుల్ పే టోకనైజ్డ్ కార్డు సదుపాయం

గూగుల్ పే టోకనైజ్డ్ కార్డు సదుపాయం

ఎంతోమంది క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగిస్తారు. ఆన్ లైన్ ద్వారా కొనుగోళ్లు జరిపేటప్పుడు కార్డు వివరాలతో పాటు సీవీవీ వంటివి కూడా పేర్కొంటారు. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు మోసాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో గూగుల్ పే టోకనైజ్డ్ కార్డు అనే కొత్త సదుపాయం తీసుకు వచ్చింది.

గూగుల్ పేలో యాడ్ చేసుకోవాలి

గూగుల్ పేలో యాడ్ చేసుకోవాలి

ఈ టోకనైజ్డ్ కార్డు ద్వారా క్రెడిట్ లేదా డెబిట్ కార్డుకు సంబంధించిన వివరాలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ వివరాలు ఇవ్వకుండానే గూగుల్ పే ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఇందుకు మన కార్డును గూగుల్ పేలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాల ఆధారిత పేమెంట్ సేవలు మాత్రమే గూగుల్ పేలో అందుబాటులో ఉండగా, ఇక నుంచి కార్డులను కూడా వినియోగించే వెసులుబాటు ఉంది.

సదుపాయం వీటికే...

సదుపాయం వీటికే...

ప్రస్తుతం HDFC, యాక్సిస్, కొటక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులకు చెందిన వీసా కార్డుదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. కొద్ది రోజుల్లో మాస్టర్ కార్డ్, రూపేకార్డులను కూడా అందుబాటులోకి తీసుకు రానుంది.

వ్యాపార సంస్థలు ఉత్పత్తులు ప్రదర్శించడం కోసం...

వ్యాపార సంస్థలు ఉత్పత్తులు ప్రదర్శించడం కోసం...

గూగుల్ పే వ్యాపారులు, సంస్థల కోసం కూడా స్పాట్ ప్లాట్ ఫాంను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు కొన్ని వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు ప్రదర్శించడం కోసం సైట్‌ను గానీ, యాప్‌ను గానీ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే గూగుల్ పే స్పాట్ ప్లాట్ ఫామ్ ద్వారా వ్యాపారాలు అలాంటివి ఏమీ క్రియేట్ చేయకుండా గూగుల్ పేలో నమోదు చేసుకోవచ్చు. దీంతో తమ ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి సమాచారం కస్టమర్లకు కనిపిస్తుంది.

 నేరుగా బుక్ చేసుకోవచ్చు...

నేరుగా బుక్ చేసుకోవచ్చు...

యూజర్ బస్ టిక్కెట్ లేదా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ను వేరే యాప్‌లోకి వెళ్లకుండా స్పాట్ ప్లాట్ ఫాం ఫీచర్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. పేమెంట్ అక్కడే చేయవచ్చు. ప్రస్తుతం మేక్ మై ట్రిప్, ఈట్. ఫిట్, గో ఐబిబో, ఓవెన్ స్టోరీ, రెడ్ బస్, అర్బన్ క్లాప్ సదుపాయాలను గూగుల్ పే అందిస్తోంది. టోకెనైజ్డ్ కార్డ్స్, స్పాట్ ప్లాట్ ఫామ్.. ఈ రెండు ఫీచర్స్ వినియోగించేందుకు గూగుల్ పే యాప్‌ను అప్ డేట్ చేసుకోవాలి.

English summary

కొత్త ఫీచర్స్, గూగుల్‌పేను వెంటనే అప్‌డేట్ చేసుకోండి: ఇలా చేయండి... | Google Pay will now support debit and credit cards

Google Pay users now be able to add debit and credit cards to the payments application.
Story first published: Friday, September 20, 2019, 14:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X