For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: పీఎఫ్ ఖాతాదారులకు కొత్త సౌకర్యం, తెలుసుకోవాల్సిన అంశాలు

|

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్ సబ్‌స్కైబర్లకు ఇటీవల ఈ-నామినేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మేరకు సెప్టెంబర్ 12వ తేదీతో 13వ తేదీన సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ-నామినేషన్ సౌకర్యం సేవా పోర్టల్‌లో వెరిఫైడ్ మెంబర్స్‌కు, ఈపీఎఫ్ఓ అకౌంటుకు ఆధార్ లింక్ చేసిన వారికి మాత్రమే ఉంటుంది.

రూ.3,000తో 25 ఏళ్లకు రూ.56 లక్షల రాబడిరూ.3,000తో 25 ఏళ్లకు రూ.56 లక్షల రాబడి

ఈ-నామినేషన్ ఫెసిలిటీ

ఈ-నామినేషన్ ఫెసిలిటీ

EPFO మెంబర్ సేవా పోర్టల్‌కు లాగిన్ అవడం ద్వారా EPFO మెంబర్ ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. 'ఈపీఎఫ్ మెంబర్స్‌కు ఈ-నామినేషన్ ఫెసిలిటీ సౌకర్యాన్ని ప్రారంభించాం. ఆధార్ లింక్ చేసిన, ధృవీకరించబడిన సభ్యులు తమ నామినేషన్‌ను ఆన్‌లైన్ ద్వారా దాఖలు చేయవచ్చు.' అని పేర్కొంది.

ఈ-నామినేషన్‌పై ఆధారపడి ఆన్‌లైన్ క్లెయిమ్స్

ఈ-నామినేషన్‌పై ఆధారపడి ఆన్‌లైన్ క్లెయిమ్స్

సర్క్యులర్ ప్రకారం దీనిని C-DAC డెవలప్ చేసింది. ఈ-సైన్ సౌకర్యాన్ని అభివృద్ధి చేశారు. ఆన్‌లైన్ పెన్షన్ క్లెయిమ్స్ అనేవి ఈ-నామినేషన్ అంశంపై ఆధారపడి ఉంటాయి. అలాగే ఈ-నామినేషన్ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలంటే యాక్టివ్ యూఏఎన్ నెంబర్ తప్పనిసరి.

ఈపీఎఫ్ఓ నామినేషన్ రూల్స్

ఈపీఎఫ్ఓ నామినేషన్ రూల్స్

- ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం ఇండివిడ్యువల్స్ తమ ఫ్యామిలీ మెంబర్స్‌ను నామినేట్ చేయవచ్చు.

- ఎవరికైనా కుటుంబం లేదా కుటుంబ సభ్యులు లేకపోతే మాత్రమే ఇతరులను ఎవరినైనా నామినేట్ చేయవచ్చు.

- కుటుంబ సభ్యులు ఉండి వారిని నామినేట్ చేయకుండా ఇతరులను చేస్తే అది చెల్లుబాటు కాదు.

సబ్‌స్కైబర్లు పోర్టల్‌లో లాగిన్ అయితే పాపప్

సబ్‌స్కైబర్లు పోర్టల్‌లో లాగిన్ అయితే పాపప్

నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయని సబ్‌స్కైబర్లు పోర్టల్‌లో లాగిన్ అయితే వారికి ఈ విషయం ఒక పాపప్ సందేశం ద్వారా డిస్‌ప్లే అవుతుంది. ఈ-నామినేషన్ ఫైల్ చేయమని అడుగుతుంది.

English summary

గుడ్‌న్యూస్: పీఎఫ్ ఖాతాదారులకు కొత్త సౌకర్యం, తెలుసుకోవాల్సిన అంశాలు | EPF account e nomination facility launched, Here's all you need to know

The EPFO launched the e-nomination facility for EPF members on Friday (September 13, 2019). As per a circular dated September 12, this e-nomination facility can be used by members whose Aadhaar is linked and verified on the member sewa portal.
Story first published: Monday, September 16, 2019, 13:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X