For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీమా పాలసీని ఆపేద్దామనుకుంటున్నారా.. అయితే ఇలా చేయొచ్చు..

|

జీవిత బీమా ప్రాధాన్యాన్ని తెలుసుకొని కొంత మంది పాలసీలను తీసుకుంటారు. మరికొంత మంది తమకు తెలిసిన ఏజెంటు ఒత్తిడి మేరకు లేదా తప్పుడు సమాచారంతో తెలియక పాలసీలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే మరికొంత మంది పన్ను ప్రయోజనాలు లభిస్తాయని బీమా పాలసీలను తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఆర్ధిక భారం పెరిగిపోయి బీమా ప్రీమియం చెల్లించలేని పరిస్థితుల్లో దాన్ని నిలిపివేయాలనుకుంటారు. కారణాలు ఏమైనా కావచ్చు బీమా పాలసీని కొనసాగించ వద్దనుకుంటే ఏమిచేయాలంటే...

ఆ ఇన్సురెన్స్ పాలసీతో జాగ్రత్త, అది ఎందుకూ ఉపయోగపడదు!!ఆ ఇన్సురెన్స్ పాలసీతో జాగ్రత్త, అది ఎందుకూ ఉపయోగపడదు!!

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సు అయితే..

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సు అయితే..

* సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్సు పాలసీని ప్రతియేటా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాలసీని రెన్యూవల్ చేసుకుంటేనే బీమా రక్షణ ఉంటుంది. లేకపోతే బీమా రక్షణ లభించదు. ఒకవేళ ఈ ఇన్సూరెన్సు కొనసాగించవద్దను కుంటే రెన్యూవల్ చేయకపోతే సరిపోతుంది.

సాంప్రదాయ జీవిత బీమా పాలసీ అయితే ..

సాంప్రదాయ జీవిత బీమా పాలసీ అయితే ..

* సాంప్రదాయ జీవిత బీమా పాలసీల్లో ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ పాలసీలు ఉంటాయి. ఈ పాలసీలను ఒకసారి తీసుకున్న తర్వాత వాటి కాలపరిమితి వరకు ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. ఒకవేళ ప్రీమియం చెల్లించకపోయినా పాలసీ మెచ్యూరిటీ వరకు అది కొనసాగుతుంది.

* ఈ పాలసీలను నిర్దేశిత కాలపరిమితి లోపు నిలిపివేస్తే మన చేతికి అందే సొమ్ము చాలా తక్కువగా ఉంటుంది.

సరెండర్ చేస్తే...

సరెండర్ చేస్తే...

* పాలసీని బీమా కంపెనీకి సరెండర్ చేయాలనుకున్నప్పుడు ఆ బీమా సంస్థ మీకు చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కకడుతుంది. అయితే ఈ మొత్తం మీరు లెక్కలు వేసుకున్న మాదిరిగా ఉండకపోవచ్చు.

* కంపెనీ నిబంధనల ప్రకారం ఈ సరెండర్ పాలసీ విలువను లెక్కగడతారు. ఇది మీరు చెల్లించిన బీమా ప్రీమియంకన్నా తక్కువ కూడా ఉండవచ్చు.

* పాలసీ మొదటి ఏడేళ్ల కాలానికి బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ నిర్ణయించిన ప్రకారంగా సరెండర్ విలువ ఉంటుంది.

ఒక్కసారి ఆలోచించుకోండి..

ఒక్కసారి ఆలోచించుకోండి..

* జీవిత బీమా పాలసీని సరెండర్ చేసే ముందు సరెండర్ చేయాల్సిన అవసరం ఉన్నదా అన్న విషయాన్నీ ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు సరైన బీమా రక్షణ ఉందనుకుంటే అనవసరమైన పాలసీని సరెండ్ చేయండి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు సరెండర్ ఆలోచన చేయవచ్చు.

* బీమా పాలసీ ద్వారా లభించే రిటర్న్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చేది మరేదైనా ఉంటే అందులో పెట్టుబడి కోసం సరెండర్ ఆలోచన చేయవచ్చు.

* మీకు తగినంతగా బీమా కవరేజీ ఉందనుకుంటే... మిగతా సొమ్ముతో పీపీఎఫ్ వంటి డెట్ ఉత్పత్తులు లేదా బ్యాలన్సుడ్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టవచ్చు.

English summary

బీమా పాలసీని ఆపేద్దామనుకుంటున్నారా.. అయితే ఇలా చేయొచ్చు.. | How to discontinue your life insurance policy

In case of a term life insurance policy, if you stop paying the periodic premium, the policy automatically lapses.
Story first published: Tuesday, July 23, 2019, 9:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X