For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.500తో ఫ్లిప్‌కార్ట్ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు: క్యాష్ బ్యాక్, ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఇవే

|

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు వచ్చింది. యాక్సిస్ బ్యాంక్, మాస్టర్ కార్డుతో కలిసి ఈ కో బ్రాండెడ్ కార్డును తెచ్చింది. దీనిని ప్రస్తుతం ఎంపిక చేసిన కస్టమర్లకు జూలై నెలలోనే అందిస్తున్నామని, ఆ తర్వాత కొద్ది వారాల్లో అందరికీ యాక్సెస్ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ ఓ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

జగన్ చేతికి దివాళా ఏపీ, ప్రతి వ్యక్తిపై రూ.1 లక్ష అప్పుజగన్ చేతికి దివాళా ఏపీ, ప్రతి వ్యక్తిపై రూ.1 లక్ష అప్పు

ఇక్కడ కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్

ఇక్కడ కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్

ఫ్లిప్‌కార్ట్ ఇండియాలో అతిపెద్ద ఈ కామర్స్ ప్లాట్‌ఫాం. యాక్సిస్ బ్యాంకు - మాస్టర్ కార్డుతో జతకట్టి ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు తీసుకువచ్చింది. దీనిపై 5 శాతం వరకు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ఖర్చుపై అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వనుంది. ఫ్లిప్‌కార్ట్, మింత్ర, 2GUDలో ఈ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం ఈ క్యాష్ బ్యాక్ ఉంది.

రూ.500 చెల్లించి తీసుకోవాలి

రూ.500 చెల్లించి తీసుకోవాలి

యూజర్లు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి రూ.500 చెల్లించవలసి ఉంటుంది. దీంతో ఏడాది పాటు రూ.2 లక్షల ఖర్చుపై సర్‌ఛార్జ్ వంటి తగ్గింపులు పొందవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ ప్రతి నెల ఆటోమేటిక్‌గా కస్టమర్ స్టేట్‌‌మెంట్‌లో క్రెడిట్ అవుతుంది. జూలై నెలలో సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే ఈ కార్డు అందుబాటులో ఉందని ఫ్లిప్‌కార్ట్ తన ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత అందరు కస్టమర్లు యాక్సెస్ పొందుతారని పేర్కొంది.

ఇక్కడ 4 శాతం క్యాష్ బ్యాక్.. ఇతర ట్రాన్సాక్షన్లకు 1.5 శాతం

ఇక్కడ 4 శాతం క్యాష్ బ్యాక్.. ఇతర ట్రాన్సాక్షన్లకు 1.5 శాతం

ఫ్లిప్‌కార్ట్ - యాక్సిస్ బ్యాంక్‌లు థర్డ్ పార్టీతోను టయ్ అప్ అయ్యాయి. MakeMyTrip, PVR, Uber, Curefit, UrbanClap తదితర వంటి వాటితో జత కట్టాయి. ఈ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫాం ట్రాన్సాక్షన్లపై కస్టమర్లు 4 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇవి కాకుండా కొనుగోళ్లపై 1.5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఉంటుంది.

వెల్‌కం బెనిఫిట్స్, అదనపు ప్రయోజనాలు

వెల్‌కం బెనిఫిట్స్, అదనపు ప్రయోజనాలు

ఈ క్రెడిట్ కార్డు ద్వారా welcome benefits కూడా పొందవచ్చు. కో-బ్రాండెడ్ లేదా థర్డ్ పార్టీ పేమెంట్స్‌లో ప్రారంభ లావాదేవీలపై రూ.3,000 వెల్‌కం బెనిఫిట్స్ ఉన్నాయి. క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భారత్‌లో ప్రతి ఏడాది ఎయిర్‌పోర్టులలో నాలుగు కాంప్లిమెంటరీ లాంజ్ విజిట్స్ సౌకర్యం ఉంది. పెట్రోల్, డీజిల్ పైన 1 శాతం ఫ్యూయల్ సర్‌చార్జ్ ఉంటుంది. నెలకు ఇది గరిష్టంగా రూ.500 వరకు సర్‌చార్జ్ తగ్గింపు ఉంటుంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యం కలిగిన రెస్టారెంట్లలో 20 శాతం వరకు డిస్కౌంట్, 1.5 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఉంటుంది. 2016లో యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి ఫ్లిప్‌కార్ట్.. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డును తీసుకు వచ్చింది.

English summary

రూ.500తో ఫ్లిప్‌కార్ట్ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు: క్యాష్ బ్యాక్, ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఇవే | Flipkart partners with Axis Bank to launch credit card offering unlimited cashback

Flipkart in a statement said the card will be available for select users in July while all customers will get access within a few weeks.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X