For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే డబ్బు ఆదా.. రూ.13 లక్షల ఆదాయమున్నా ట్యాక్స్ చెల్లించక్కరలేదు!

|

న్యూఢిల్లీ: ఈ ఏడాది మీరు ఓ ఇంటిని లేదా ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఏడాదికి మీ ఆదాయం రూ.13 లక్షలు అయినా పన్ను ఆదా చేసే మార్గాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ కారును లేదా ఇంటిని కొనుగోలు చేసినప్పుడు ట్యాక్స్ సేవింగ్ నిబంధనలను చూసుకొని తీసుకుంటే పన్ను భారం పడే అవకాశాలు లేవు. తాజా బడ్జెట్‌లో హోమ్ లోన్స్, ఎలక్ట్రిక్ వాహనాల రుణాల వడ్డీలపై రాయితీలు ఇచ్చారు. వీటితో ఏడాదికి రూ.12 నుంచి రూ.13 ఆదాయం వరకు కొత్త నిబంధనల ప్రకారం ట్యాక్స్ కట్టకుండా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

ఇల్లు కొనేవారికి భారీ ఊరట: రూ.3.5 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపుఇల్లు కొనేవారికి భారీ ఊరట: రూ.3.5 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు

హోమ్‌లోన్ వడ్డీపై రూ.3,50,000 రాయితీ

హోమ్‌లోన్ వడ్డీపై రూ.3,50,000 రాయితీ

హోమ్ లోన్ వడ్డీపై రాయితీ రూ.3.50 లక్షల వరకు ఇచ్చారు. ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు ఇంటిని కొనుగోలు చేస్తే ఇది వర్తిస్తుంది. దీని వ్యాల్యూ రూ.45 లక్షలుగా ఉండాలి. ఈ ఇల్లు కొనుగోలు చేసే సమయానికి మీ పేరుపై ఎలాంటి రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉండరాదు. ఇలాంటి సందర్భంలో సెక్షన్ 24, సెక్షన్ 80EEA.. ఈ రెండు కలిపి మొత్తంగా రూ.2.5 లక్షల డిడక్షన్ పొందవచ్చు. ఈ ప్రయోజనం పొందాలంటే ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్ (ఢిల్లీ నేషనల్ కాపిటల్ రీజియన్ - ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్, ఫరీదాబాద్), హైదరాబాద్, కొల్‌కతా, ముంబై వంటి కార్పెట్ ఏరియాల్లో 60 స్క్వేర్ మీటర్లకు మించరాదు. పైన నగరాలు మినహా ఇతర టౌన్‌లలో 90 స్క్వేర్ మీటర్లు మించరాదు. అంటే మీ రూ.13 లక్షల సంపాదనలో రూ.3.5 లక్షలు డిడక్ట్ చేసుకోవచ్చు.

- రూ.13,00,000 - రూ.3,50,000 = రూ.9,50,000 (మిగులుతుంది)

 ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.1,50,000 రాయితీ

ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.1,50,000 రాయితీ

సెక్షన్ 80EEB కింద ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే మరో రూ.1.50 లక్షల డిడక్షన్ ఉంటుంది. ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2023 మధ్య నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ సహా ఏ ఆర్థిక సంస్థ నుంచి అయినా లోన్ తీసుకోవచ్చు. మీరు లోన్ తీసుకునే సమయానికి మరో ఎలక్ట్రిక్ వాహనం ఉండరాదు.

- రూ.9,50,000 - రూ.1,50,000 = రూ.8,00,000 (మిగులుతుంది)

ఇతర మినహాయింపులు

ఇతర మినహాయింపులు

సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు డిడక్షన్ చూపించవచ్చు. పీఎఫ్, ఈపీఎఫ్, పిల్లల స్కూల్ ఫీజులకు మినహాయింపు ఉంటుంది. అలాగే, 80సీసీడీ(1బీ) కింద NPS కాంట్రిబ్యూషన్ కింద రూ.50,000 మినహాయింపు ఉంటుంది. హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం మినహాయింపు రూ.75,000గా ఉంది. ఇవి కలుపుకుంటే రూ.1,50,000+75,000+50,000.. ఈ మొత్తం కలిపితే రూ.2,75,000 అవుతుంది.

- రూ.8,00,000 - రూ.2,75,000 = రూ.5,25,000 (మిగులుతుంది)

దీనికి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ యాడ్ అవుతుంది. దీంతో రూ.4,75,000 అవుతుంది.

కట్టాల్సిన పన్ను సున్నా

కట్టాల్సిన పన్ను సున్నా

ట్యాక్స్ సేవింగ్ నిబంధనల ప్రకారం హోమ్ లోన్, ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొని, ఇతర మినహాయింపులు తోడయితే రూ.5 లక్షలకు తగ్గుతుంది. రూ.2.50 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది. దీనికి చెల్లించాల్సిన ఆదాయ పన్ను సున్నా. మిగతా రూ.2.50 లక్షలకు ఆదాయ పన్ను 5 శాతం. అంటే రూ.12,500 అవుతుంది. మీకు రూ.13 లక్షలు ఆదాయం వస్తే ఆ తర్వాత వచ్చే ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను 20 శాతం. కానీ పైన చెప్పిన ప్రకారం చెల్లించే పన్ను మాత్రం సున్నా. అంటే మీ పన్ను రూ.12,500గా ఉంటుంది. అయితే సెక్షన్ 87ఏ ప్రకారం లెస్ ట్యాక్స్ రిబేట్ రూ.12,500 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో కట్టాల్సిన పన్ను కేవలం సున్నాగా ఉంటుంది. అంటే మీకు వచ్చే రూ.13 లక్షల ఆదాయాన్ని విభజించుకుంటే ఆదాయ పన్ను కట్టకుండా, డబ్బు ఆదా చేసుకోవచ్చు.

English summary

ఇలా చేస్తే డబ్బు ఆదా.. రూ.13 లక్షల ఆదాయమున్నా ట్యాక్స్ చెల్లించక్కరలేదు! | Buying an affordable house, electric car? No tax to be paid on gross salary of up to Rs.13 lakh

Have you purchased an affordable house and an electric car this financial year or are planning to do so? The good news is that you may not have to pay any tax on gross salary of over Rs 13 lakh provided you fully utilise the benefits of tax-saving investments and take care of some provisions while purchasing the house and the electric vehicle.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X