For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ విషయాలు మరవొద్దు...

By Jai
|

బ్యాంకులు ఇచ్చే రుణాల్లో వ్యక్తిగత రుణాల వాటా కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రుణాలు అన్ సెక్యూర్డ్ రుణాలు అంటే ఎలాంటి ఆస్తులను తనఖా పెట్టుకోకుండా ఇచ్చే రుణాలన్న మాట. ఈ రుణాలను స్వల్ప కాలిక అవసరాలు లేదా ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి తీసుకుంటుంటారు. ఈ రుణాలపై వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ రుణాన్ని తీసుకునే ముందు కొన్ని అంశాలపై దృష్టి సారించాలి. అవేమిటంటే...

ఈ క్రెడిట్-డెబిట్ కార్డ్స్ ఉపయోగిస్తున్నారా, తెలుసుకోండి...ఈ క్రెడిట్-డెబిట్ కార్డ్స్ ఉపయోగిస్తున్నారా, తెలుసుకోండి...

రుణ అవసరం ఎంత?

రుణ అవసరం ఎంత?

వ్యక్తిగత రుణం తీసుకునే ముందు ఆ రుణ అవసరం ఎంతో ముందు ఆలోచించండి. సాధారణంగా వ్యక్తిగత రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకే ఇస్తామంటూ బ్యాంకుల నుంచి మెయిల్స్ వస్తుంటాయి. వీటిని చూడగానే ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ దొరికితే ఎలాఉంటుందో అలా ప్రవర్తిస్తారు కొంతమంది. ఈ రుణం వస్తే ఏది కొనుగోలు చేస్తే బాగుంటుందో ఆలోచిస్తుంటారు. అప్పులను ఎవ్వరూ అప్పనంగా ఇవ్వరు అన్న విషయాన్నీ మరచిపోవద్దు. అప్పు తీసుకునే ముందే అది అవసరమా అన్న ఆలోచన చేయకపోతే అప్పుల ఊబిలో చిక్కుకుపోతారు. ఒకవేళ మీకు తప్పనిసరిగా అప్పు కావాలి అనుకుంటే మీ బ్యాంకు డిపాజిట్లు, పీపీఎఫ్ హామీగా రుణం తీసుకోండి.

పోల్చి చూసుకోండి..

పోల్చి చూసుకోండి..

మీకు వ్యక్తిగత రుణం ఇవ్వడానికి బ్యాంకు ముందుకు రాగానే వెంటనే తీసుకోకండి.ఎంత వడ్డీ రేటుకు ఇస్తున్నది చూసుకోండి. మీ చేతిలో ఎప్పుడు ఉంటుంది కాబట్టి వివిధ బ్యాంకుల వెబ్ సైట్లు చూసి వడ్డీ రేటును పోల్చి చూడండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఉన్న సామర్థ్యాలను కూడా చూసుకోండి.

చెల్లింపు సామర్థ్యం ఎంత?

చెల్లింపు సామర్థ్యం ఎంత?

రుణ సొమ్ము ఖాతాలో పడినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో దానికి సంబంధించిన నెలవారీ వాయిదాలు చెల్లించే సమయంలో అంత ఇబ్బంది ఉంటుంది. ఈఎంఐ ల కోసం తెలిసిన వారందరికీ ఫోన్లు చేసే వారిని మీరు చూసి ఉంటారు. ఆ పరిస్థితి మీకు రాకుండా చూసుకోండి. పెరిగే ఖర్చుల గురించి ఆలోచించుకోండి. ఒకవేళ ఈఎంఐ విషయంలో ఇబ్బంది వస్తే ఎలా అధిగమించాలో ముందే సిద్దమయి ఉండండి. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే మీరే డీఫాల్ట్ అయిపోతారు. అది మీక్రెడిట్ స్కోర్ ను దెబ్బతీస్తుంది. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే మీకే ఇబ్బంది

మీకు అర్హత ఉందా...

మీకు అర్హత ఉందా...

వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి మీ అర్హతకు సంబంధించినవి. అవేంటంటే మీ ఆదాయం, మీ వయసు, క్రెడిట్ చరిత్ర, మీకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ, ఉద్యోగ స్థిరత్వం వంటివి. మీకు రుణం ఇచ్చే ముందు బ్యాంకులు ఈ విషయాలను ముందు పరిశీలిస్తాయి. అందుకే ముందు ఈ విషయాలపై దృష్టి సారించాలి.

చార్జీలు తెలుసుకోవాలి

చార్జీలు తెలుసుకోవాలి

మీరు తీసుకునే రుణంపై వడ్డీ రేటుకు సంభందించి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఆ రుణ మంజూరుకు బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ చార్జీలు ఎంతనో ముందే తెలుసుకోవాలి. గడువుకన్నా ముందుగానే తీసుకున్న రుణాన్ని చెల్లిస్తే ప్రీపేమెంట్ చార్జీలు ఏమైనా తీసుకుంటున్నారా చూడాలి. వాయిదాలు చెల్లించడంలో జాప్యం జరిగితే వసూలు చేసే జరిమానాల గురించి కూడా తెలుసుకోవాలి. వీటన్నింటిని చూడకుండా రుణం తీసుకుంటే మీపై భారం పెరుగుతుందన్న విషయం మరచిపోవొద్దు.

పాత రుణ వివరాలు దాచవద్దు

పాత రుణ వివరాలు దాచవద్దు

మీరు గతంలో తీసుకున్న రుణాల వివరాలు మీ బ్యాంకుకు తెలియజేయండి. ఈ వివరాలు మీరు దాచిపెట్టాలని ప్రయత్నించినా దాగవు. మీ క్రెడిట్ చరిత్ర చూస్తే ఈ వివరాలు తెలిసిపోతాయి. అప్పుడు మీ రుణాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది. అందుకే మీ గత రుణాల వివరాలను నిజాయితీగా మీ బ్యాంకు అధికారికి తెలియజేయండి. అప్పుడేమైనా ఇబ్బందులు కలిగినా ఆ వివరాలు పంచుకోండి.

English summary

వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ విషయాలు మరవొద్దు... | Know these things about personal loan

Personal loans generally cost less than using credit cards or taking cash advance loans. Personal loans can be used for many purposes.
Story first published: Monday, June 10, 2019, 11:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X