For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే...

By Jai
|

అప్పటిదాకా బ్యాచిలర్ లైఫ్... ఉద్యోగం చేసే వారికి ఎంతో ఆర్థిక స్వేచ్ఛ. ఖర్చుల విషయంలో పెద్దగా ఆలోచించరు. పొదుపునకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. అయితే పెళ్లి తర్వాత కూడా ఇదే విధంగా ఉంటే ఆర్ధిక పరంగా భవిష్యత్తులో ఇబ్బందులు మీరే భరించాల్సి వస్తుంది మరి. అందుకే పెళ్లి చేసుకున్న కొత్త జంట కొన్ని ఆర్ధిక విషయాల గురించి ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దానికి అనుగుణంగా వ్యవహరిస్తే మీ కాపురంతో పాటు ఆర్ధిక పరిస్థితి సాఫీగా సాగిపోతుంది.

ఏంచేయాలి?

ఈ రోజుల్లో యువ జంటలు ఉద్యోగం చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇద్దరి సంపాదనా కలిస్తే ఖర్చులు పోగా అధిక మొత్తంలో మిగులుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మొత్తాన్ని ఎలా సద్వినియోగ పరచుకోవాలన్నదాని గురించే మీరు చర్చించుకోవాలి. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఎలాగంటే...

ఉమ్మడి బ్యాంకు ఖాతా

ఉమ్మడి బ్యాంకు ఖాతా

- పెళ్ళికి ముందు వరకు మీకు వేర్వేరుగా బ్యాంకు ఖాతాలు ఉండవచ్చు. పెళ్లి తర్వాత ఉమ్మడిగా ఒక బ్యాంకు ఖాతా తెరవండి. ఈ ఖాతా ద్వారా లావాదేవీలు జరపడం ద్వారా మీరు ఖర్చు చేస్తున్న అంశాలపై ఒక అవగాహనా వస్తుంది.

-మీ ఖర్చులపై ఎప్పుడు ఒక కన్నేసి ఉంచండి. ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు దాని అవసరం ఎంత ఉందో చూసుకోండి

- ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లపై అందరికి ఎక్కువ ఆసక్తి ఉంటోంది.ఆఫర్లు కనబడగానే కొనేస్తున్నారు. అవసరం లేకున్నా ఇలా ఎన్నో వాటిని ఆన్ లైన్ లో కొంటున్నారు. ఇలాంటి ఖర్చులనే అదుపు చేయాలి.

-మీ ఆర్థిక లక్ష్యాన్ని, ప్రాధాన్యాన్ని నిర్దేశించుకోండి. ఎప్పుడు కారు కొనుక్కోవాలి, ఎప్పుడు ఇల్లు కొనుగోలు చేయాలి అన్న దాని గురించి కూడా ఒక నిర్ణయానికి రావాలి.

పిల్లల చదువులకు..

పిల్లల చదువులకు..

- మీకు పుట్టబోయే పిల్లలు వారి చదువులకు అయ్యే ఖర్చులకు అనుగుణంగా మీ పొదుపు ఉండాలి. పిల్లల పెళ్లిళ్లు, రిటైర్మెంట్ కోసం కూడా పొదుపు చేస్తున్న వారు ఉన్నారు. కొన్ని బీమా సంస్థలు రిటైర్మెంట్ పాలసీలను అందిస్తున్నాయి. వాటిని తీసుకునే అంశం గురించి ఆలోచించండి.

-ఇద్దరి జీవిత బీమా తీసుకోవడం మంచిది. ఈ రోజుల్లో ఆరోగ్య బీమా కూడా తప్పని సరిగా మారింది. హాస్పిటల్లో చేరితే బిల్లు లక్షల్లో చెల్లించాల్సిన పరిస్థితి. కాబట్టి మీరు ఆరోగ్య బీమా గురించి నిర్లక్ష్యం చేయవద్దు.

కొత్త జంట కోరికలు

కొత్త జంట కోరికలు

- కొత్త జంట కోరికలు అపారంగా ఉంటాయి. ఆర్థిక వనరులు మాత్రం పరిమితంగా ఉంటాయి. కొంతమంది తమ సంతోషాల కోసం అప్పులు కూడా చేస్తుంటారు. కానీ చిన్నగా మొదలయ్యే అప్పు పెద్ద ఊబిలాగా మారవచ్చు. అందులో చిక్కితే ఇక బయటికి రావడం అసాధ్యం. అందుకే అప్పులు ఏమైనా చేయవలసి వస్తే ముందుగానే ఆ మొత్తాన్ని తీర్చడానికి మీకున్న సామర్థ్యం ఎంతో ఒక్కసారి ఆలోచించుకోండి.

- అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. ఇందుకోసం ఒక బ్యాంకు ఖాతా తెరవడం మంచిది. మీదగ్గర కొంత సొమ్ము ఉంటే ఆ మొత్తాన్ని ఆ ఖాతాకు బదిలీ చేయండి. అత్యవసరం అయితే తప్ప ఆ ఖాతాలో సొమ్ము తీసుకోవాలన్న దాని గురించి ఆలోచించవద్దు.

-మీ రోజువారీ, నెలవారీ బడ్జెట్ ఎంత అవుతుందో ఒక్కసారి లెక్కవేసుకోండి. అదనపు ఖర్చులను కట్టడి చేయండి.

పెట్టుబడి

పెట్టుబడి

- మీరు పెట్టుబడులపై కూడా దృష్టి పెట్టడం మంచిది. ఎక్కువ రిస్క్ వద్దనుకుంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. లేదా రికరింగ్ డిపాజిట్ చేయవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై రిస్క్ ఉందని భావిస్తే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. క్రమానుగత పెట్టుబడుల (sip) ద్వారా మీ రాబడులను పెంచుకోవచ్చు.

- క్రెడిట్ కార్డు వినియోగం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ కార్డు వినియోగం అలవాటు అయితే ఆర్థిక పరిస్థితి గతి తప్పవచ్చు.

- నెలవారీ వాయిదాల్లో ఉత్పత్తులను కొనే ముందు మీ చెల్లింపు సామర్థ్యం గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. తప్పని సరిగా ఈ వాయిదాలను గుర్తు పెట్టుకోండి లేకపోతే డీఫాల్టుగా మారే ప్రమాదం ఉంటుంది.

English summary

మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే... | Here is financial advice that married couples often ignore!

Here is financial advice that married couples often ignore. Create Separate Accounts and One Joint Account. Track How You Are Spending Money. Set Your Financial Priorities Together.
Story first published: Thursday, May 16, 2019, 15:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X