For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ICICI శాలరీ అకౌంట్ ఉందా?: కొన్ని క్లిక్స్‌తో మీరు హోంలోన్ పొందవచ్చు

|

హోమ్ లోన్ కోసం మీరు బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని కొన్ని క్లిక్స్‌లలో హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రయివేటు రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ ఇలా లోన్ అందిస్తోంది. ఇన్‌స్టాంట్ లోన్ ఇస్తోంది. సాధారణంగా హోమ్ లోన్ లాంగ్ ప్రాసెస్‌తో కూడుకున్నది. క్రెడిట్ హిస్టరీ, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్, నెల ఆదాయం, ఓల్డ్ డ్యూస్‌తో పాటు మీ కేపబులిటీని చెక్ చేస్తారు. కానీ ఐసీఐసీఎస్‌లో ఈ లాంగ్ ప్రాసెస్ పక్కన పెట్టి సులభంగా హోంలోన్ పొందవచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ శాలరీ అకౌంట్ తప్పనిసరి.

<strong>SBI సేవింగ్స్ అకౌంట్ ఉందా?: ఈ రోజు నుంచి ఈ రూల్స్ మారుతున్నా</strong>SBI సేవింగ్స్ అకౌంట్ ఉందా?: ఈ రోజు నుంచి ఈ రూల్స్ మారుతున్నా

ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌స్టాంట్ హోమ్ లోన్ ఆఫర్ ఫీచర్స్...

ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌స్టాంట్ హోమ్ లోన్ ఆఫర్ ఫీచర్స్...

- లోన్ సాంక్షన్ లెటర్ కాల పరిమితి ఆరు నెలలు. ఈ కాలంలో మీరు ఎప్పుడైనా లోన్ తీసుకోవచ్చు.

- మీ శాలరీ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యే మొత్తం ఆధారంగా మీకు గరిష్టంగా ఎంత లోన్ వస్తుందనేది ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు లాగిన్ అయితే మీరు ఎంత మొత్తం పొందవచ్చో ఉంటుంది. గరిష్టంగా రూ.1 కోటి వరకు హోమ్ లోన్ తీసుకోవచ్చు.

గరిష్టంగా 30 ఏళ్ల టెన్యూర్

గరిష్టంగా 30 ఏళ్ల టెన్యూర్

- ఐసీఐసీఐ బ్యాంకులో గరిష్ట కాలపరిమితి (టెన్యూర్) 30 సంవత్సరాలు. మీ వయస్సు ఆధారంగా కూడా గరిష్ట కాలపరిమితి ఉంటుంది. అది కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అవసరమైతే మీరు కాలపరిమితిని (టెన్యూర్) తగ్గించుకోవచ్చు. కానీ పెంచుకోవడం మాత్రం కుదరదు. అంటే గరిష్టంగా మీకు 30 ఏళ్లు అని ఉంటే అంతకు తక్కువ సమయంలోనే మీ లోన్ పూర్తి చేసుకోవచ్చు. కానీ అంతకుమించి మాత్రం పెంచరు.

టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ

టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ

మీ కాలపరిమితి ఆధారంగా ఈఎంఐ చెల్లింపు ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలపరిమితితో రూ.1 కోటి తీసుకుంటే 9 శాతం వడ్డీ లెక్కిస్తే గరిష్టంగా అప్పుడు రూ.80,460 మీ ఈఎంఐ అవుతుంది. మీరు రూ.80,460 ఈఎంఐతో 20 ఏళ్ల కాలపరిమితి ఆప్షన్ ఎంచుకుంటే మీకు లోన్ అమౌంట్ రూ.89.42 లక్షలు వస్తుంది. మీరు హోమ్ లోన్ ప్లాన్ చేస్తే కనుక ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్‌స్టాంట్ లోన్ ఫెసిలిటీని చెక్ చేయండి. ఆదాయం పొందే వారిని (మీ భాగస్వామి లేదా ఇతరులు) కో-అప్లికెంట్‌గా చేరిస్తే ఎక్కువ మొత్తాన్ని రుణం రూపంలో పొందవచ్చు.

English summary

ICICI శాలరీ అకౌంట్ ఉందా?: కొన్ని క్లిక్స్‌తో మీరు హోంలోన్ పొందవచ్చు | Have salary account with ICICI Bank? You can get home loan in just few clicks

Wouldn't it be quite helpful if you do not have to visit your bank for home loans. Just sit at home and apply for housing loan in few clicks. This is exactly what private lender ICICI Bank is offering.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X